Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణానదీ లోయ నాగరికతకు నిలువెత్తు సాక్ష్యంవిజయవాడ.. 1929లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని అందించిన ప్రాంతం విజయవాడ. క్రీ.శ. 626లో విజయవాడ ఆవిర్భవించిన విషయం నుండి.. అమరావతి రాజధాని దాకా ఎన్నో విషయాలు చకచకా ఫొటోలతో చలపాక ప్రకాష్ నమోదు చేసారు. విజయవాడ నుండి 13 జిల్లాలకు కీ.మీ దూరం.. సందర్శనీయ స్థలాలు.. చరిత్ర.. ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి సినిమా థియేటర్ మారుతీ టాకీస్- దేశంలోనే తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ) అలనాటి బెజవాడలోని పత్రికలు... 1908 నాటి స్వరాజ్యం నుండి శ్రీశ్రీ బులిటెన్ దాకా ఎన్నో విషయాలు రాసారు. మండలి బుద్ధప్రసాద్, డా|| గుమ్మా సాంబశివరావు, గార్ల ముందుమాటలు బాగున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రం- గోరా కృషి; గాందధీ హిల్, విక్టోరియా మ్యూజియం, భారతదేశంలో తొలి రివర్ వ్యాలీ ''కృష్ణవేణి మ్యూజియం'' 1893 నాటి ఆనకట్ట నుండి 1957 నాటి ప్రకాశం బ్యారేజ్ దాకా సచిత్రాలతో ఎన్నో విషయాల్ని సంవత్సరాల వారిగా.. లెక్కలతో పరిశోధనాత్మకంగా రచయిత అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి అయ్యప్ప దేవాలయం నుండి గాంధీ గుడి దాకా ఎన్నో ఆలయాల ప్రశస్తిని గురించి చక్కగా విశ్లేషించారు. ఆసియాలో మొట్టమొదటి బస్సు నడిచింది బెజవాడలోనే.. అంటారు రచయిత. (పేజీ. 78).. ముఖ్య కార్యాలయాల చిరునామాలు- ఫోన్ నెంబర్లు ఇస్తే ఇంకా బాగుండేది. ప్రచురణ రంగంలో 1908 నుండి జరిగిన కృషి... వివిధ పబ్లికేషన్స్ పాత్ర వివరించారు. కవులు, రచయితలు, కళాకారులు, కళా సాంస్కృతిక సంస్థల గురించి, రాజకీయ కళా వేదికలు, పత్రికలు, సాహిత్య సభల గురించి.. వ్యాపార కేంద్రాల గురించి బాగా రాసారు. దక్షిణ భారతదేశంలో తొలి పాల ఉత్పత్తుల కర్మాగారం ''విజయవాడ పాల ప్రాజెక్టు'' 1965లో ప్రారంభం గురించి ఇలా ఎన్నో తెలియని, ప్రపంచ ప్రఖ్యాతి అంశాల్ని యీ పుస్తకంలో అందించిన ప్రకాష్ అభినందనీయులు..
(విజయవాడ సందర్శనం, రచయిత : చలపాక ప్రకాష్, పేజీలు : 224, వెల : 200/-, ప్రతులకు : చలపాక ప్రకాష్, 1-4/3-36, సంజరు గాంధీ కాలనీ, విధ్యాధరపురం- 520012, సెల్ : 9247475975)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
హేమంత తుషారాలు (గజళ్లు), రచయిత :డా. గడ్డం శ్యామల, పేజీలు :136, వెల : రూ. 150/-, ప్రతులకు : శ్యామల గడ్డం, ఫ్లాట్ నెం. 203, మారుతి హైట్స్, న్యూ మారుతీ నగర్, చైతన్యపురి, హైదరాబాద్ - 060, సెల్ : 9704175183
తోరపు దారాలు (కథలు), రచయిత : శ్రీనూ వాసా, పేజీలు :98, వెల : రూ. 100/-, ప్రతులకు : వాసా శ్రీనివాసరావు, శివ పార్వతి వాసా, 24బి-11-65, పాతెబడ, ఏలూరు, చిన్న శివాలయం ఎదురుగా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర. - 534002, సెల్ : 8125996070
ఎగసే కెరటం (నవల), రచయిత : డా.శ్రీసత్య గౌతమి, పేజీలు :100, వెల : రూ. 100/-, ప్రతులకు : జ్యోతి వలబోజు సెల్ : 8096310140, నవోదయ బుక్ హౌస్
బహుశా... (కవిత్వం), రచయిత : వేణుగోపాల్, పేజీలు :120, వెల : రూ. 120/-, ప్రతులకు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
మా కనపర్తి ముషాయిరా (కతలు), రచయిత : రమేశ్ చెప్పాల, పేజీలు : 126,వెల : రూ. 200/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..., సెల్ : 9849073163
కాలం నేర్పిన పాఠం (కథా సంపుటి), రచయిత : శిరంశెట్టి కాంతారావు, పేజీలు :118, వెల : రూ. 100/-, ప్రతులకు : శిరంశెట్టి కాంతారావు, ఇం.నెం. 1-1-177, మమతల కోవెల, శ్రీనివాసపురం కాలనీ, పాత పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
సెల్ : 9849890322