Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలసర్పాన్ని కాటేసి కాజేసిన
కాలదర్పాన్ని నేను
తిరోగమిస్తున్న లోకాన్ని నిలబెట్టి
పురోగమనం నేర్పుతున్న ప్రగతిని నేను
కలం బలం తెలియనివారు
కత్తుల కోసం వెతుకుతారు
ప్రాణాలు తీసేవి మనకెందుకు
ప్రజలను మేల్కొల్పుదాం రా ! ముందుకు ...
అన్న దాశరథి కష్ణమాచార్య బాటలో కలం శక్తిని చాటుతున్న కవి ఆనంద్ పెరుమాళ్ళ. కవిగా, కథకుడిగా సమీక్షకుడిగా సాహితీ లోకానికి సుపరిచితులు అయిన పెరుమాళ్ళ ఆనంద్ కవిత్వం ఇటీవల కాలస్పర్శగా సాహితీ హదయాలను స్పర్శించింది. కవి సిరా చుక్కలతో అక్షర దీపాలు వెలిగిస్తుంటాడు. అయితే దీనికి అదనంగా ఆనంద్ పెరుమాళ్ళ సజన సాహితీ సంస్థ నిర్వహణలోనూ వివిధ సాహితీ సభా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ తలమునకలై ఉంటారు. సామాజిక దక్పథం నిండుగా కలిగిన కవి. అందుకేనేమో ప్రముఖ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం వ్యక్తిత్వానికి ఒక Plane mirror కవి నైజం కవిత్వంలో దొరికిపోతుంది. అని కాల స్పర్శకు వారు రాసిన ముందుమాటలో అరుదైన వ్యక్తుల్లో ఆనంద్ ను ఒకరిగా గుర్తించారు.
ప్రముఖ కవి తండు కష్ణ కౌండిన్య కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగానే తాను దర్శించి, పలవరించి అనుభూతిని లేదా ఆవేదన పొందిన ప్రతి విషయాన్ని కవిత్వీకరించారని స్పష్టీకరించారు.
సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తువులే కాలస్పర్శ నిండా కనిపిస్తాయి.
''అన్యాయానికి ఆకలయినప్పుడు
న్యాయాన్ని నోటకరచుకొని
రక్తాన్ని ఆరగిస్తూ
చెమటను తాగిస్తుంది
ప్లీజ్ అంటే వదలదు'' అని కవి అంటాడు 'ఓడిపోతూనే ఉంది' అనే కవితలో. న్యాయం ఓడిపోతూనే ఉంది కవిత్వానికి కాస్తంత చైతన్యాన్ని నింపితే అప్పుడైనా అన్యాయాన్ని నిలదీస్తుంది. నేటి సమాజంలో అంతకంతకూ పెరుగుతున్న అన్యాయాలను చూసి కవి వాపోయిన కవిత ఇది.
''ఈ దేశాభివద్ధిని
కరోనా లాక్డౌన్ కాలంలో
వలస పాదాల నడకల్లో చూడాలి
శ్రమ సంపదను నెత్తినపెట్టుకు తిరిగే
శ్రమ కోటీశ్వరులు'' అంటూ వలస కూలీల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన తీరు పాషాణ హదయాలలో సైతం ఒకింత ఆర్ద్రతను నింపుతుంది.
''దిగబడుతున్న సంసారబండిని అమ్మ చెమటచుక్కలతో లాగింది
పొట్టకూటికోసం
ఒట్టి చేపలమ్మి
ఎండు చేపయింది మా అమ్మ'' అన్నప్పుడు ఆకస్మికంగా అంతర్ధానమైన భర్త, ఒక్కసారిగా మీద పడిన గంపెడు సంసారం, వెక్కిరిస్తున్న విభిన్న సమస్యల నడుమ ఒక స్త్రీ త్యాగశీలత, బాధ్యతాయుత నడత, అననుకూల పరిస్థితులపై ప్రతిఘటన.. ఇలా ఎన్నో అంశాలు 'స్వేదానికి రూపమిస్తే' అనే కవితలో దర్శనమిస్తాయి.
మనిషితనం మాయమై స్వార్ధమే పరమార్థంగా గమిస్తున్న వ్యవస్థను చూసి
''ఓ మనిషి
అహంకారాన్ని
ఆధిపత్యాన్ని ఆర్పేయి
ఆరిపోయిన
సమానత్వాన్ని మానవత్వాన్ని
ఇకనైనా వెలిగిస్తావా...?అంటాడు.
కరోనా విపత్తు దేశాన్ని కబళించి బడులు మూతపడిన సందర్భంలో ''ఇప్పుడు పిల్లల ఆటల్లేవు పాటల్లేవు
కేరింతలసలే లేవు
తను ఒంటరిదై
శబ్ధ స్పర్శ కోసం ఆశగా ఎదురు చూస్తుంది
ఆ బడి తల్లి'' అంటూ పాఠశాలకు ప్రాణాన్ని ఆపాదించి బడి పిల్లల బంగారు బాల్యాన్ని కరోనా చిదిమేసిన తీరును,బడి తల్లి విద్యార్థులకు దూరమై వారి రాక కోసం నిరీక్షిస్తున్న వైనాన్ని కవిత్వీకరించిన విధానం మనసు మనసును కదిలిస్తుంది.
''నాన్న ప్రేమ పూలను వర్షించాడు' అనే కవితలో
''నడి పొద్దులోనే అస్తమించిన సూర్యుడు మా నాన్న
తన గుండెలపై ఆడిస్తాడనుకుంటే
విధి ఆడించిన ఆటలో ఔవుటయిపోయాడు
నాన్న లేని కుటుంబం
రవి లేని ప్రపంచమైంది'' అమ్మ కు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది లోకం. అయితే నాన్నలో కూడా ఉండేది అమ్మతనమే కదా. తన భారాన్ని గుండె తలుపు దగ్గరే అదిమిపెట్టి బాధ్యతల ముళ్ల కిరీటాన్ని ఆనందంగా మోసే నాన్నను కోల్పోవటం సష్టిలో ఏ బిడ్డకైనా పూడ్చలేని వెలితే. రవి లేని ప్రపంచంతో కవి నాన్నను పోల్చడం అంధకారమైన లోకం కనుల ముందు సాక్షాత్క రిస్తుంది. 'నాన్న ప్రేమ పూలను వర్షించాడు' అక్షరాలా అద్భుతమైన కవిత. ఇలా చెప్తూ పోతే ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. పాఠక హదయాలను సామాజిక అంశాల చుట్టూ పరిభ్రమింపజేస్తుంది. సాధారణం నుంచి అసాధారణం అయిన విశేషాలు,సూక్ష్మాంశాల నుండి సంక్లిష్ట విషయాలెన్నో కవితల రూపంలో కాల స్పర్శ ద్వారా ప్రతి పాఠకున్ని సశిస్తాయి.
ప్రతీ కవిత శిల్పసౌందర్యంతో, అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచనగా గోచరమవుతుంది. నిగూఢమైన భావాలతో ప్రకాశిస్తుంది. అందుకేనేమో ప్రముఖ కవి సాగర్ల సత్తయ్య ముందు మాటలో అనవసర పదాలు, పదాడంబరాలు కాల స్పర్శలో ఎక్కడా కనబడవు. చైతన్యాన్ని కలిగించే కవితా వస్తువులే అణువణువునా కనిపిస్తాయని తెలిపారు. మొత్తం 43 కవితలలో మానవ సంబంధాలు, అన్నదాతల ఇక్కట్లు, శ్రమజీవుల వెతలు, జీవకారుణ్యం.. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజ సజీవచిత్రం కవిత్వమై మదిమదిని ఆలోచనతో పాటు రంజింప చేస్తుంది.బలమైన కవిత్వాన్ని అందించే ఆనంద్ పెరుమాళ్ళ కలం నుండి మరెన్నో రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
- ఉప్పల పద్మ, 8340933244