Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ విదేశాలలో చారిత్రాత్మకమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. బుద్ధునికి సంబంధించినవి అయితే వేళ్లలో లెక్కపెట్టలేనన్ని ప్రదేశాలు ఉన్నాయి. బుద్ధుడు మన దేశస్తుడైనప్పటికీ బౌద్ధాలయాలు చైనాలో ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో వందల ఏండ్ల చరిత్ర కలిగి ఉన్నాయి కూడా.. అలాంటి ఒక ఆలయ నిర్మాణమే ఆయుతయ.. ఇది థారులాండ్లోని ఫ్రా నఖోన్ సి లో ఉంది. ఈ నగరాన్ని 1351లో రామాతిబోడి రాజు స్థాపించారు. కానీ ఇది అంతకంటే పురాతనమైనదని ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ 850లో ఖైమర్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, ఒక కోటను నిర్మించుకున్నారు. అయితే 1569లో బర్మీస్ ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్న క్రమంలో ఇక్కడ ఉన్న చాలా విలువైన కళాత్మక వస్తువులను కోల్పోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. చివరకు 1969లో థాయిలాండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఈ శిథిలాల పునర్నిర్మాణం ప్రారంభించి 1976 నాటికి చారిత్రక ఉద్యానవనంగా తీర్చిదిద్దింది. ఇందులో కొంత భాగాన్ని యునెస్కో 1991 ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.