Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడు స్వేదధారల్ని కురిపించి
వజ్రవైడూర్యాల్ని వెలికితీస్తాడు
అతడు పాదం మోపితే పచ్చదనం
మయూర పింఛమై విచ్చుకొంటుంది..
అతగాడు సష్టించే ఆహారాన్ని
పంచభక్ష్య పరమాన్నాలుగా
ఆరగించేటి మనం..
ఒక్క క్షణం ఆ పసిడి పంటలన్నీ
వెండి పళ్ళాల్లోకి ఎలా వస్తున్నాయో
నిండు కళ్ళాల్లోకి వెళ్లి చూస్తే..
వ్యవసాయం, యుద్ధం ఒక్కటే అని
తెలుస్తుంది..
రెండు చోట్లా ప్రాణాలు పణంగా పెట్టి
ఫలితాలు వెలికితీస్తారు
అక్కడ శత్రువు వేరే దేశం వాడు
ఇక్కడ శత్రువు చపల చిత్తాల ప్రకతి
భూమ్యాకాశాల రంగస్థలంపై గడియకో
దశ్యం మారుస్తూ పంటను కాచే బంటు
కంట నీరొలికిస్తుంది..
చుక్క చినుకు రాల్చని కరువు కాష్టం
అకాల వర్షాల విషాద కష్టం
పెనుతుఫానుల విలయ విధ్యంసం..
అన్నిటికీ సిద్ధమంటూ పలుగు పారా
ఆయుధాలుగా.. భార్యా పిల్లలే సైన్యంగా
ప్రకతితో పోరాడి ఇసుక నుండి తైలం
తీసిన చందాన మట్టి నుండి మంచి
ముత్యాలు పండించి మననోటికందించే
అచ్చమైన పచ్చదనాల సైనికుడే రైతు!!
- భీమవరపు పురుషోత్తం, 9949800253