Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరుకే ఎండ !
పేరుకు పోయిన యుగాల నాటి కిరణాలేమో
ఒక్క కిరణమూ పేరుకు వచ్చింది కాదు
దగడు లేదు !
వ్యాధులకు దడి కాదు !
కంటికి కనిపించనంత క్రిమిని దహనం చేయలేని
కిరణాలు ఏమి మహిమాన్వితం !
లోక బాంధవుడట !
లోకంలోని వైరస్ ను చురుక్కుమనిపించ లేదు
పోయిన ఎండకాలం పై
ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నామో !
కరోనా క్రిమి ఖతం ఔతుందని
మళ్లీ ఈ ఎండాకాలానికి
వైరస్ వైరితనం విస్తతమే ఐంది
కర్మ సాక్షివి కదా ! సూర్యా !
మా కర్మ ఇలా కాలిపోతోంది
భూమి అనాథ ప్రేతాల సమాధిగా తిరిగిపోతోంది
ప్రభాకరా !
నీ కన్నా బెత్తెడు ''మాస్క్'' నయం
నిశ్చింతగా మా చేతిలో పని
అంత దూరంలోని సూర్యుడి పై
నమ్మకం అర్ఘ్యం విడిచినట్లు వదులుకున్నట్లే
దండి కరోనాను మాడగొట్టని ఎండ దండుగ
''మాస్క్ ధారయామి ''మహా మంత్రం
మన ఊపిరి మన వశం
గడప దాటుతున్నావా ?
మాస్క్ వేసుకో !
నోరు మూసుకో !
- కందాళై రాఘవాచార్య, 8790593638