Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెమట చుక్క
కంటి చెమ్మ
నెత్తుటి బొట్టు
కలగలిసిన కవనం
అంతరాలపై అప్రకటిత కదనం
దోపిడి
ఆకలి
నిరుద్యోగం
ఇత్యాది రుగ్మతలపై
వాడి వేడి భావాల దాడితో
ఎర్ర పదాల నిగనిగలు కురిపిస్తూ
బద్ద శబ్ద ఫిరంగుల విధ్వంసం
సమసమాజ సాహిత్య కేతనం
లయాత్మకత
వస్తు వైవిధ్యం
విప్లవ భావగర్భితమై
మహాప్రస్థాన కైతల కత్తులతో
ఖండించబడే వర్గ కుత్తుకలు
ధర్మరాజు స్వర్గలోక యాత్ర
అలనాటి మహాప్రస్థానం
ధర్మాత్ముల సమలోక యాత్ర
ఇలనాటి మహాప్రస్థానం
వెయ్యేండ్ల సాహిత్య చరిత్రతో
నడిచినవారు ''శ్రీ'' లు మాత్రమే
నడిపించిన వాడే ''శ్రీ శ్రీ''
- జినుకల వెంకటేష్, 9652092120