Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి విలపిస్తున్నది. భూగోళం అధిక వేడితో మండుతున్నది. ఫలితంగా అడవుల్లో కార్చిచ్చులు, కరువులు, వరదలు, కాలుష్యం కోట్లాది మంది పై ప్రభావం చూపుతున్నవి. పర్యావరణం పై మానవ జోక్యం పెరిగి వాతావరణ మార్పులు జరిగి తద్వారా పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతున్నది. అడవుల నరికివేత వల్ల జీవవైవిద్యం తగ్గుతున్నది. భూ వినియోగంలో వచ్చిన మార్పులు, కేంద్రీకృత వ్యవసాయం - పశుపోషణ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నవి. అందుకే భూమాత అత్యవసర కార్యాచరణ కోసం పిలుపునిస్తున్నది. పర్యావరణ వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే - భూగ్రహం, భూమిపై జీవజాలం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వారిని కార్యోన్ముఖులు చేయడం కోసమే ప్రతి సంవత్సరం ఏప్రిల్ - 22న 'ధరిత్రి దినోత్సవం' నిర్వహిస్తున్నారు.
గ్రీన్ హౌస్ వాయువులు వేడెక్కుతున్న భూగోళం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూగోళంపై సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2019లో అత్యధికంగా 59.1గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతా వరణం లోకి విడుదల అయింది. కరోనా లాక్ డౌన్ వల్ల 2020 లో జఉ2 విడుదల 7శాతం తగ్గినా అది తాత్కాలికమే. 2020 అత్యధిక వేడి గల సంవత్సరాల్లో ఒకటిగా నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే 2100 నాటికి భూగోళం మీద సగటు ఉష్ణోగ్రతలు 'పారి శ్రామిక విప్లవం' ముందు కాలాని కంటే
అధనంగా 3శీజ పెరగనుంది. ప్రస్తుతం ఈ పెరుగుదల 1.1శీజ గా ఉంది. ఫలితంగా అడవుల్లో కార్చిచ్చులు, కరువులు, మంచు నదులు కరగడం పెరుగుతున్నది. 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం ఈ పెరుగుదలను రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కే పరిమితం చేయాలి . 1.5ళీజ కు పరిమితం చేసేలా దేశాలన్నీ గట్టిగా ప్రయత్నిం చాలని తీర్మానించారు. అలా జరగా లంటే 2030 నాటికి జఉ2 విడుదల 44 గిగా టన్నులకు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 51 శాతం గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతున్న 126 దేశాలు తమ పరిధిలో కార్బన్ విడుదలని సున్నా కు పరిమితం (నెట్ జీరో )చేస్తామని వాగ్దానం చేసినా ఆశించిన కార్యచరణ లేకపోవడం వల్ల జఉ2 విడుదల 60 గిగా టన్నులకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే మెజారిటీ గా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతున్న దేశాలు దాని తగ్గుదలకు చేస్తున్న కషి నామమాత్రంగానే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం అత్యంత పేదలు విడుదల చేస్తున్న కార్బన్ వాయువుల కంటే 1శాతం అత్యధిక ధనవంతులు విడుదల చేస్తున్నదే ఎక్కువంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
కరుగుతున్న అడవులు
కనుమరుగవుతున్న జీవజాలం
అభివృద్ధి పేరుతో మనిషి చేపడుతున్న వివిధ కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతి సంవత్సరం 4.7 మిలియన్ హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. దీనివల్ల 10 లక్షల రకాల జంతు, వృక్ష జాతులు 'అంతం' అంచున నిలబడ్డాయి. 1970 - 2016 మధ్య 68శాతం క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జీవ జాతులు క్షీణించాయి. మరోవైపు అటవీ జంతువుల వ్యాపారం పెరిగింది. ఆహారం, వ్యాపారం కోసం అడవి జంతువుల్ని వాడటం వల్ల కొన్ని రకాల వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నాయి (జునాటిక్ వ్యాధులు). వాటిలో కరోనా ఒకటి. ప్రస్తుతం మనుషులకు సోకుతున్న వ్యాధుల్లో 75శాతం జంతువుల నుంచే వస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి పర్యా వరణ విభాగం తేల్చింది.
భూమిని ఆవహిస్తున్న
ప్లాస్టిక్ భూతం
మనం వాడి పడేస్తున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నది. 1950ల్లో సగటున సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి కాగా 2015 నాటికి అది 419 మిలియన్ టన్నులకు పెరిగింది. దీనిలో 11 మిలియన్ టన్నులు సముద్రాల్లోకి చేరుతున్నది. 2040 నాటికి ఇది 29 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాస్టిక్ సముద్ర జీవజాలానికి పెనుముప్పుగా మారింది. అత్యధికంగా కార్బన్ పీల్చుకునే సముద్రాలు తమ శక్తిని కోల్పోతున్నాయి.
పర్యావరణం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు మార్పు కోసం కృషి చేస్తున్నారు. వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు 1970లో మొదటిసారిగా అమెరికా లో 'గెలార్డ్ నెల్సన్ 'ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. 1990 నుండి విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 22న జరగనున్న 51 వార్షికోత్సవ కార్యక్రమాల్లో 100 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే అతి పెద్ద మత రహిత కార్యక్రమం. సమస్య తీవ్రత గుర్తించిన ఐక్యరాజ్యసమితి రాబోయే దశాబ్దాన్ని (2021 - 30) ''పర్యావరణ పునరుద్ధరణ దశాబ్దం'' గా ప్రకటించింది. పర్యావరణ ధ్వంసాన్ని అడ్డుకోవడం, నిలపడం, పునరుద్ధ రించడం దీనిలో ముఖ్య లక్ష్యం. వ్యవసాయ క్షేత్రాలు, అడవులు, మంచి నీటి వనరులు, గడ్డి భూములు, పర్వతాలు, సముద్రాలు, తీర ప్రాంతాలను పునరుద్ధరించడం కోసం కృషి జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది.
పర్యావరణ విద్య
పర్యావరణ పునరుద్ధరణ వెనువెంటనే జరిగే ప్రక్రియ కాదు. రాబోయే తరాల్ని కూడా దీని కోసం సంసిద్ధుల్ని చేయాల్సి ఉంది. అందుకే అన్ని దేశాల్లో పర్యావరణ విద్యను సిలబస్లో భాగంగా చేయాలనే డిమాండ్ పెరుగు తున్నది. 178 దేశాలనుంచి కార్మిక సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు చేసిన డిమాండ్ మేరకు నవంబర్లో గ్లాస్టో లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పారిస్ వాతావరణ ఒప్పందం లో కూడా ఈ అంశాన్ని చేర్చాలని కోరు తున్నారు.
ప్రజల భాగస్వామ్యం - ప్రజాస్వామిక డిమాండ్
పర్యావరణ సుస్థిరత విషయాలో ప్రజల భాగస్వామ్యం పేరిగేలా కృషి జరగాల్సి ఉంది. ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించాలంటే నాణ్యమైన పర్యావరణాన్ని అందించాలి. ఆ వైపుగా వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చెయ్యాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాణ్యమైన పర్యావరణం కోసం ధరిత్రి (భూమాత) పునరుద్ధరణ అనేది ప్రజాస్వామిక డిమాండ్ గా మార్చడంలో అభ్యుదయ శక్తుల పాత్ర కీలకం కానుంది.
- సేవ్ ఎన్విరాన్మెంట్ క్లబ్, తెలంగాణ.
ఆర్. విక్రమ్ రెడ్డి