Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా కవిత్వమంటే ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి వుండాలని భావిస్తారు. కానీ, స్పందించే మనసు మధనం నుండి వాక్యాలు వాక్యాలుగా కాగీతాన్ని అల్లుకొని ఒక నిగూఢమైన భావచిత్రం పురిటి నొప్పుల నుండి ఆవిర్భవించినప్పుడు. ఈ కవిత్వంలోని మర్మాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో సిద్ధాంత కర్తలు, విమర్శకులు వారి వారి సృజనతో తమ ఆలోచనను అభివ్యక్తికరిస్తారు. రసజ్ఞులు మాత్రం మనసుతో వీక్షించి ...దానిలో దాగిన భావనను ఆస్వాదిస్తారు.
కవిత్వంలో ప్రధానంగా మనకు కనిపించేది భావుకత, తాత్వికత నిండిన అనుభవాల సారాంశాలు. స్వాతిగారు జీవితంలోని అనేక పార్శ్వలను. తన మనో నేత్రంతో వీక్షించిన దృశ్యాలను, తను కలలుగన్న ప్రపంచాన్ని 'పోతబొమ్మ' సంకలనంలో ఒక అనూహ్యమైన భావుకత ప్రపంచాన్ని సృజించారు. వాస్తవానికి కవిత్వానికి ఎలాంటి కొలబద్ధలు లేకపోయినప్పటికి. స్వాతిగారి స్వాతి చినుకులు కవిత్వం ఆస్వాదించేవారి మనసును తట్టిలేపుతుంది.
స్వాతిగారి దృష్టిలో కవిత్వమంటే వాక్యాలు ఎంత మాత్రం కాదు-
కవిత రాయాలంటే / ముందు నువ్వు / కవిత్వమై ప్రవహించాలని /
తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వాక్యాలు స్వాతిగారికి కవిత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తాయి.
కవిత్వంలో వస్తువు ఏదైనప్పటికి- ఆ వస్తువులో ఆత్మను ఆవిష్కరించి తన భావుకతను ప్రదర్శిస్తారు.
నేడు ఆధునిక జీవన పోకడలుజ వాటిలో దాగిన రుగ్మతలను. పచ్చని చెట్టును ప్రతీకగా తీసుకొని మనిషిలోని మానసికత స్వభావాన్ని ఆవిష్కరిస్తూ, ఈ మనిషి మనుగడ ఏమిటి అని నిరసిస్తూ ఈ విధంగా అంటారు.
అదేమిటో/ ఇంత త్వరగా ఈ పచ్చని చెట్టు ఇలా/ నిలువెలా వేరుపరుగు పట్టినట్టు / ఆధునికత సోకి వడలి పోయిందేమిటి?అని తన అవేదనను వ్యక్తికరిస్తూరు.
మరో ఖండికలో - మనిషి చెదపురుగులా ఈ ప్రకృతి వనరులను కబళిస్తుంది. చెట్టుకు మనిషి వల్ల ఏర్పడిన దుర్భల పరిస్థితిని, అతని స్వార్థ చింతనను చెట్టు క్షేమించి అతని మరణంలో సమిధంగా మారుతుంది.
చెట్టు చెదపురుగు అనే ఖండికలో చెట్టు ఆదర్శం కన్పిస్తుంది.
నిన్నటి మనుషులు, మన స్తాత్వాలు, ఆత్మీయతలు, అను బంధాల గురించి ఉదహరించే కవిత -
ఏ కంట నలకపడ్డా / వెనక వెయ్యి కళ్లల్లో నీళ్లు ఊరేది / ఏ మనసు నొచ్చుకున్నా /ఊరు ఊరంతా తల్లి నాలుకై సేద దీర్చేది అని నిన్నటి పరిస్థితులకు, వర్తమాన పరిస్థిలకు మధ్య మనుషుల్లో కనుమరుగయిన సంస్కారం మేలుకొల్పలని, ఏర్పడిన వత్యాసాన్ని తరిమికొట్టాలని'ఇక్కడ ఇంతే!' కవితా ఖండికలో అంటారు.
జీవితం అనేక హక్కుల సంఘమం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పాత్ర ఎలా ఉంటుంది అంటే. అది నేటి ఎన్నికల ప్రక్రియ మన అందరికి తెలిసిందే. ఓటు హక్కు వలన ఎలాంటి లాభం కలుగుతుందో స్వాతిగారు వ్యంగ్యంగా ఈ విధంగా అంటారు.
ఓటేస్తే మాత్రం' అనే ఖండికలో
వస్తే రాని పోతే పోనీ రాకున్నా
మనమే వేసుకుందాం.
అనేది ధీమా ఇప్పుడు
ఓటేస్తే మాత్రమే వడ్డించే వాడిదే రాజ్యం
మనకు మాత్రం వేలి మీద నల్లచుక్క
ఇట్లు సర్దుకుందుకు ఒక సెలవు దినం!
ప్రతులకు: పోతబొమ్మ (కవిత్వం)
స్వాతి శ్రీపాద
జె.వి. పబ్లిషర్స్
పేజీలు: 124 వెల :100/-
ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
- బొల్లిముంత వెంకట రమణారావు