Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసుపత్రిలో పెచ్చులూడిన గోడలు బలవంతంగా నిలబడి వున్న పొడుగాటి హాలులో వరసుగా మంచాలున్నాయి. మంచాల మీద మూల్గులున్నాయి. అవి ఒక్కోప్పుడు ఎడుపులగా మారుతుంటాయి. ఓ మూల మంచం మీద కొట్టి పడేసిన చెట్టు కొమ్మలా ఉన్నాడు శేషయ్య. ఆ కొమ్మ ఎక్కి కూచుంది. ఓ భూతం దాని పేరు కరోనా.
పక్కకు తిరగడానికి కూడా శక్తి లేని శేషయ్య ఊపిరితిత్తుల్లో వేలుపెట్టి కెలుకుతున్నది అది. శ్వాసలోపలికి పోతున్నదో బయటికి వస్తున్నదో అర్థం అవడం లేదు. మధ్యాహ్నం అనగా తెచ్చి పడేశారు. ఓ మందూ మాకూ లేదు.
చూసేదిక్కు లేదు. అప్పుడప్పుడు బయట నుంచి కొడుకులోపలికి వస్తున్నాడని భ్రమపడేవాడు. ఎవ్వరినీ రానివ్వరు. ఎవ్వరిచావు బతుకు వాళ్ళు అనుభవించాల్సిందే. అదొక ఆసుపత్రి. ఐదు నక్షత్రాల హోటల్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రి. అది ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ ఉండ వలసిన వేవీ ఉండవు. రోగులుంటారు. బెడ్లు ఉండవు. జబ్బులుంటాయి. మందులుండవు. మూల్గులుంటాయి. వినిపించుకునే వారుండరు. జబ్బు పడ్డ మనుషులున్న గదులు కూడా జబ్బు పడ్డట్టే వుంటాయి. నేలమీద రకరకాల వాసనలు, ఒక దాని మీద ఒకటి స్వారీ చేస్తూ ఎప్పుడు ఏ వాసన వేస్తుందో ఎప్పుడు ముక్కు మూసుకోవాలో ఎప్పుడు తెరిచి వుంచాలో తెలియదు.
ఆ ఆసుపత్రిలో పెచ్చులూడిన గోడలు బలవంతంగా నిలబడి వున్న పొడుగాటి హాలులో వరసుగా మంచాలున్నాయి. మంచాల మీద మూల్గులున్నాయి. అవి ఒక్కోప్పుడు ఎడుపులగా మారుతుంటాయి. ఓ మూల మంచం మీద కొట్టి పడేసిన చెట్టు కొమ్మలా ఉన్నాడు శేషయ్య. ఆ కొమ్మ ఎక్కి కూచుంది. ఓ భూతం దాని పేరు కరోనా. పక్కకు తిరగడానికి కూడా శక్తి లేని శేషయ్య ఊపిరితిత్తుల్లో వేలుపెట్టి కెలుకుతున్నది అది. శ్వాసలోపలికి పోతున్నదో బయటికి వస్తున్నదో అర్థం అవడం లేదు. మధ్యాహ్నం అనగా తెచ్చి పడేశారు. ఓ మందూ మాకూ లేదు. చూసేదిక్కు లేదు. అప్పుడప్పుడు బయట నుంచి కొడుకులోపలికి వస్తున్నాడని భ్రమపడేవాడు. ఎవ్వరినీ రానివ్వరు. ఎవ్వరిచావు బతుకు వాళ్ళు అనుభవించాల్సిందే. ఒకరెవరో వచ్చారు. డాక్టర్ అనుకున్నాడు. వచ్చిన వాడు ఓ టాబ్లెట్ల స్ట్రిప్పు శేషయ్య మీదికి విసిరాడు. దూరం నుంచే. అది మంచం మీద పడలేదు. కింద కొంచెం దూరంలో పడింది. శేషయ్య వంగి తీసుకోలేడు. ఆ మందు బిళ్ళ వేసుకుంటే బ్రతుకుతానేమోనని ఆశ అతని కళ్ళల్లో బుడ్డిదీపాల్లా వెలిగింది. కానీ తనవల్ల కాదు. కాస్పేపటికి నర్సు వచ్చింది. తనకు మందు వేయడానికేననుకన్నాడు. కానీ ఆ నర్సు హడావిడిగా వెళ్తూ మందు బిళ్ళ స్ట్రిప్పుని తనకు తెలీకుండానే దూరంగా తన్నేసింది. ఇక శేషయ్య కళ్ళల్లో బుడ్ది దీపాలు ఆరిపోయేయి. అప్పుడు వచ్చింది. నేలను ఊడ్చి శుభ్రం చేసే ఆడమనిషి. యాభైదాటి ఉంటయి. ఊడుస్తుంటే కనిపించింది మందు బిళ్ళల స్ట్రిప్పు! ఎవర్ది అనడిగింది శేషయ్య వైపు, చూస్తూ మంచం మీద ఉన్నా శేషయ్య గొంతుక నూతిలోంచి పలికింది. ఆమె పరుగున వెళ్ళి నర్సుకు చెప్పింది. నర్సుకు చెప్పింది. నర్సు డాక్టర్‌ను పిలిచింది. అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఆక్సిజన్ ఆక్సిజన్ అని అరిచారెవ్వరో. ఉందో లేదో చూడాలి అంది నర్సు. డాక్టరు దూరం నుంచే శేషయ్యని చూశాడు. శేషయ్య కళ్ళు తెర్చుకుని ఉన్నయి. కాని రెప్ప కిందికి వాల లేదు. కంటి కొలకుల్లోంచి కణతల మీదకి కారిన కన్నీళ్ళన్నాయి.
తల్లిలోపల ఉంది కొడుకు లందరూ ఆసుపత్రి బయట నేల మీద కూర్చున్నారు. ఇరవై మైళ్ళ దూరం నుంచి కాళ్ళు గడ్డమూ పట్టుకుని ఆటోవాడిని ఒప్పించి తల్లిది మామూలు జ్వరమేనని ఆసుపత్రకి తీసుకువచ్చాడు పెద్దోడు.పెద్దోడు తల్లిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడని తెల్సి బక్ మీద ఊరికి వచ్చాడు చ్నిఓ్నడు. ఎన్నో గంటలు ఎందరినో బతిమాలుకుంటే, కన్నీళ్ళలో మాస్కులు తడిపేసుకుంటే ముసలమ్మను లోపలికి తీసుకువెళ్ళారు.
మనం ఏం చెయ్యలేం అన్నా! ఆల్లేసూసుకుంటారు. ఇంటికి పోదామా! ' అన్నాడు తమ్ముడు.
'నర్సు వచ్చి చెప్తనన్నది అమ్మ ఎట్లున్నదో మందులు గిట్ల ఇచ్చిన్లో లేదో' అన్నాడు అన్న. స్ట్రెచర్ల మీద తెచ్చిన శవాల తాలుకు మనుషుల పేర్లను బిగ్గరగా పిలుస్తున్నారు వార్డు బోరులు. ఎవరూ ముందుకు రాకపోతే మార్చురీ వైపు వెళ్తున్నారు. అన్నదమ్ముల్దిరూ ధీమాగా ఉన్నారు. అమ్మను ఈ రోజే చేర్చారు కదా ఏమీ కాదు. అనుకున్నారు. సరేతీ! రేపొద్దాం మల్ల' అని లేచాడు అన్న. తమ్ముడు నేను అదే అంటున్న అన్న' అన్నాడు తమ్ముడు. ఇద్దరూ లేచి అడుగులు ముందుకు వేశారు. లోపలి నుంచి శవం ఉన్న ఓ స్ట్రెచర్ బయటకు వచ్చింది. సత్తమ్మ సచ్చిపోయింది. ఎవన్న ఉన్నారా!' అన్నా అరుపు వినపడ్డది వాళ్ళకు. వాళ్ళ తల్లి పేరు సత్తమ్మే! ఇద్దరూ వెనక్కు పరుగెత్తారు.
ట్రాఫిక్ పోలీసు, అడవిలో వేటగాడులా రోడ్డు మీద నిలబడ్డాడు. చాలా సేపట్నుంచీ రోడ్డు ఖాళీగా వుంది. ఉన్న ట్టుండి దూరం నుంచి ఓ బైకు వస్తూ కనిపించింది. పకీక్షగా చూశాడు. గద్దకన్ను పెట్టి చూశాడు. పోలీసు. బైక్ మీద ముగ్గురున్నారు. 'ట్రిబుల్ రైడింగ్' దొరికార్రా! రండి రండి రండి దయచేయండి అని పాడుకుంటూ రోడ్డుకు అడ్డంగా ఎలెక్ట్రిక్ పోల్‌లా నిలబడ్డాడు. బైకుని ఆపాడు. ముందు వెనుక ఇద్దరు మొగ పోరలు మధ్యన ఓ ముసలమ్మ. కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నది.
అన్నా నీ కాల్లు మొక్తమే. మాయమ్మనే. ఎల్లెం ఎల్లిపోకుంటే పరేశానయితమే అన్నాడు తమ్ముడు.
ముసలిదాన్ని నడిమిట్ల ఎక్కిచ్చుకుపోతారు. యాక్సి డెంటయిసస్తే ఎవ్వరా జుమ్మ అన్నాడు పెలీసు లేపురి లేపురి ముసలిదాన్ని అని అరిచాడు పోలీసు.
లేవదన్నా లేవదన్నా! సచ్చిపోయిందనాన! అమ్మ సచ్చిపోయిందన్నా అంబులెన్సు దొర్కలేదన్నా ఎట్ల తీసుక్కపోవాల్నో తెలవలేదన్నా. చాలా కోశీష్ చేసినా ఇగ గిట్ల బండి మీద తీస్కపోతున్నాం అన్నాడు. అన్న కళ్ళ నిండా నిండిన నీళ్ళతో .
పోలీసువాడు నాలుగు, ఆరు, పది అడుగులు వెనక్కి వేసి గోడవైపు తిరిగాడు.
ఇలాంటి దృశ్యాలు దేశమంతటా కన్నీటి ప్రవాహాలు. కళ్ల ఎదుట ప్రాణాలు పోతున్నా తమకు మనుషుల్ని బ్రతికించే అవకాశం యివ్వని ప్రభుత్వాలను ప్రశ్నించ లేరు. ఫ్రంట్‌లైన్ వారియర్స్. దేశం శ్మశనాల దిబ్బగా మారుతుంటే ఎన్నికల వ్యూహాలు పన్నే పరిపాలకులు బ్యాలెట్ బాక్స్‌లు పడే ఓట్ల లెక్కలు కావాలి కాని మరణాల అంకెలు కాదు.
చింతపట్ల సుదర్శన్, 9299809212