Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంటి నొప్పి బాధ చాలా ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది అందరూ ఏదొక సందర్భంలో ఎదుర్కొనే సమస్యే... సాధారణంగా ఇంట్లో పాటించే చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుందాం..
- సాల్ట్ వాటర్ నాచురల్ డిస్ఇంఫెక్టెంట్. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలని బయటకి లాగేస్తుంది. దీని వల్ల చిన్న చిన్న నోటి పుండ్లు ఉంటే కూడా తగ్గిపోతాయి. ఇలా చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని మౌత్ వాష్‌లా ఉపయోగించాలి.
- పెప్పర్మింట్ టీ బ్యాగ్స్ పెయిన్ తగ్గించడానికీ సెన్సిటివ్ గమ్స్‌ని నెమ్మది పరచడానికీ వాడతారు. ఇలా చేయడానికి వాడేసిన టీ బ్యాగ్ గోరు వెచ్చగా ఉన్నపుడు నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. లేదా, ఈ టీ బ్యాగ్‌ని కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత అప్లై చేయొచ్చు.
- కొన్ని వేల సంవత్సరాలుగా వెల్లుల్లిని ఆరోగ్య ప్రయోనాల కోసం, మెడిసినల్ ప్రాపర్టీస్ కోసం వాడుతున్నారు. ఇది హానికారక బ్యాక్టీరియాని చంపడమే కాక పెయిన్ రిలీవర్‌గా కూడా పని చేస్తుంది. ఇలా చేయడానికి ఒక వెల్లుల్లి రెమ్మని పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఈ పేస్ట్‌కి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయవచ్చు. లేదంటే తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా ఫలితం ఉంటుంది.
- వెనిల్లా ఎక్స్ట్రాక్ట్లో ఉండే ఆల్కహాల్ పెయిన్‌ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన ఇది త్వరగా, ఎఫెక్టివ్‌గా హీల్ చేస్తుంది.
- ఒక కాటన్ బాల్ మీద కొద్దిగా లవంగ నూనె తీసుకుని దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. దీనికి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, లేదా నీటితో డైల్యూట్ చేసి వాడడం ఉత్తమం. లేదంటే నీటితో డైల్యూట్ చేసిన లవంగ నూనెను మౌత్ వాష్‌లా ఉపయోగించొచ్చు.
- తాజా జామాకులు నమలడం లేదా కొన్ని ఆకులని కొద్దిగా దంచి మరుగుతున్న నీటిలో వేసి మౌత్ వాష్ తయారు చేసుకోని వాడవచ్చు. జామాకులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పుండ్లు త్వరగా తగ్గుతాయి.