Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పలనాయుడు కొత్త అవతారమెత్తాడు. కాషాయి వస్త్రాలు ధరించి చేతిలో త్రిశూలం పట్టుకొని, నుదుటన విభూది నామం మెడలో రుద్రాక్ష దండ ఇలా సాధువు అవతారంలో వున్నాడు అతగాడు.
''మూఢ నమ్మకాలకు ఆమడదూరం వుండే అప్పల నాయుడు అకస్మాత్తుగా ఇలా ఎలా మారిపోయాడు'' అందరూ గుసగుసలులాడుకున్నారు.
''నీకేమైందిరా నాయుడూ ఇలా సాధువు అయిపోయావు పైగా ఆ కాషాయి వస్త్రాల మూట ఏమిటీ చేతిలో'' ఆరా తీసాడు మిత్రుడు మధీనా.
''మనవాడు ఏమిచేసినా అందులో అర్ధం పరమార్ధం ఉం టుంది. సామాజిక సేవా
దక్పథంతోనే ఏదైనా చేస్తాడు చూద్దాం ఈ వేష భాషల్లో ఏదైనా విశేషం ఉందేమో''అన్నాడు మరో మిత్రుడు డేవిడ్.
అప్పలనాయుడు చిరునవ్వు నవ్వి ఒక చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు మొదలకి కాషాయి వస్త్రం చుట్టి చెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి చెట్టు కొమ్మలకు పసుపు గుడ్డలు కట్టి మిత్రులు దగ్గరకు వచ్చి ''హమ్మయ్య ఒక చెట్టుని కాపాడాను, చెట్లను కాపాడాలంటే ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది, నేనొక ఉద్యమం తలపెట్టాను వక్ష సంరక్షణ ఉద్యమం ఇలా ఊరూ వాడా తిరిగి సాధ్యమైనన్ని ఎక్కువ చెట్లకు దేవతామూర్తులు అన్న ముద్రలు వేసి చెట్లను కాపాడాలి, అదే నా లక్ష్యం ఈ వేష భాషలు నా తత్వానికి వ్యతిరేకం కానీ ఎక్కువ మంది మూఢ భక్తులు ఉన్న మన సమాజంలో ఇదే సరైన మార్గం అనిపిస్తుంది, చెట్టు దేవుడు అంటే ఆ చెట్టును నరకరు మనవాళ్ళు'' అన్నాడు.
ఆ పక్కనే ఒక చెట్టునీడలో వాలుకుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న నవీన్ అనే యువకుడు ఫక్కున నవ్వాడు.
''ఎందుకు నాయనా నవ్వుతున్నావు!'' ప్రశ్నించాడు అప్పలనాయుడు.
''మీరు ఆత్మవంచన చేసుకొని అబద్దాలను ప్రచారం చేసి, నిజాలని ప్రజలను నమ్మించి తద్వారా సమాజానికి మేలు చేసే వక్షాలను రక్షించాలని అనుకుంటున్నారు, మీ లక్ష్యం మంచిదే కానీ లక్ష్య సాధనా మార్గమే అభిలాషనీయం కాదు, మీ ముగ్గురు మధ్య జరుగుతున్న సంభాషణ విన్న తరువాత నేనొక ఆలోచనకు వచ్చాను. మీరు సహకరిస్తే ప్రజలకు నిజాలు చెప్పి ప్రకతికి, తద్వారా సమాజానికి మేలు చేద్దాం. మీ మనసుకి నచ్చని ఆ కాషాయం, త్రిశూలం, విభూది వదిలేసి నాతో చెయ్యి కలపండి'' అన్నాడు. ఊరువారి సమావేశం జరిగింది. కరోనా వైరస్ ప్రభావం, దాని వల్ల సమాజానికి కలుగుతున్న తీవ్ర నష్టం. కరోనా బాధి తుల ప్రాణాలను నిలపడానికి ప్రాణ వాయువు తయారు చెయ్యడానికి, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య విద్యా పరిశోధనా సంస్థలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో నవీన్ వివరించాడు. ప్రాణవాయువు విలు వను విడమరిచి చెప్పి, రోగాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణవాయువు పుష్కలంగా ఉండాలని చెప్పి, ప్రాణ వాయువును అందించడంలో చెట్ల ప్రాధాన్యతను స్పష్టంగా చెప్పి, చెట్లను పెంచుతాం, చెట్లను కూల్చము అనే నినాదాలను ఊరు వారి చేత చెప్పించాడు. నవీన్ని అప్పలనాయుడు మిత్ర బందం అభినందించింది, ప్రజలను వివేకవంతుల్ని చెయ్యడానికి వాళ్ళ మూఢనమ్మకాల బలహీనతలను కాదు, ప్రజల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని తట్టిలేపాలి అని నవీన్ నిరూపించాడని అందరూ అనుకున్నారు.
- ఎం వి స్వామి, 9441571505