Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పు, బాదం పప్పు.. ఆ తర్వాతే కిస్మిస్లు.. వీటిని ఎండుద్రాక్షలు అని ఎక్కువగా పల్లెటూర్లలో సంబోధిస్తుంటారు. అయితే మంచి నాణ్యత కలిగిన కిస్మిస్లు రుచికి చాలా తియ్యగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. వీటితో శరీరానికి ఎన్నో రకాల మేలు జరుగుతుంది.. అంతేకాదు మిగిలిన డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే వీటి ఖరీదు కూడా తక్కువే...
- వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
- గొంతులో ఏర్పడే కఫాన్ని తొలగించి, రిలీఫ్ ఇస్తుంది.
- రోజువారీ తీసుకునే కొన్ని ఆహారాల వల్ల నోటిలో ఏర్పడే బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది.
- కంటి చూపుకు ఇది చాలా మంచి ఆహారం.
- మహిళలలో ఏర్పడే కొన్ని రకాల అండాశయ సమస్యలు తొలిగిపోయేలా దోహద పడుతుంది.
- ఎక్కువ మందిలో తరుచూ ఉంటే సమస్య మలబద్ధకం.. ఇందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. అందులో కిస్మిస్లతో తొలగి పోయేది కూడా ఒకటి.. అదేమంటే.. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కిస్మిస్లను, సోంపును కలిపి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది.