Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ నయాగరా.. అంటే టక్కున చెప్పే పేరు బోగతా జలపాతం.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరనే చెప్పవచ్చు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని వాజీడు మండలం చీకుపల్లి ప్రాంతంలో ఉంటుంది బోగతా జలపాతం.. ప్రతి యేటా వర్షాకాలంలో జన సందోహం బాగానే ఉంటుంది. ఇది భద్రాచలంకు 120 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుండి 140 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 329 కిలోమీటర్లు, ములుగు నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడాది పొడవునా నీరు ఉంటూనే ఉంటుంది. జూన్ నుండి నవంబర్ మధ్య కాలంలో నీటి ప్రవాహం బాగుంటుంది. ఎక్కువగా ఆ సమయంలోనే సందర్శకులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.