Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పక్షుల్ని Painted Storks అంటారు. ఇవి చెరువులు, చిన్న చిన్న కుంటలు, మడుగులు వంటి నీటి ప్రదేశాల్లో అతి సాధారణంగా కనిపించే migrate. ఇవి ఎక్కువుగా స్థానిక పక్షులే. లేదా లోకల్ గానే waders అవుతాయి. వీటి ముక్కు చాలా పొడగ్గా, పసుపు రంగులో ఉండి చివరన కాస్త ఒంపు తిరిగి ఉంటుంది. నెత్తి మీద దాదాపు ఏ ఈకా లేకుండా నున్నటి చర్మం ఉంటుంది. కాళ్ళు చాలా పొడగ్గా ఉంటాయి. తెల్లటి రెక్కల మీద నల్లటి రంగు ఉంటుంది. రెక్కల చివర్ల లో పింక్ కలర్ తో చిత్రకారుడు పెయింట్ చేసినట్టుగా ఉంటుంది. వీటికి అందుకే ఆ పేరు వచ్చింది. ఇవి నీళ్ళు ఎక్కువుగా ఉన్నప్పుడు కాస్త ఒడ్డున, గడ్డి ఉండే వైపు ఒకే చోట గంటల కొద్దీ కదలకుండా నిలబడి నీళ్ళల్లోకి చూస్తూ ఉంటాయి, మనం కొంగ జపం అంటామే అలా అన్నమాట. ఈ లోగా వీటిని గమనించకుండా దగ్గరికి వచ్చిన చేపల్ని, కప్పల్ని, చివరికి పాముల్ని సైతం తమ పొడవాటి ముక్కుతో పట్టేసుకొని గుటుక్కున మింగేస్తాయి. అదే, నీటి మట్టం తగ్గిపోతే, పొడవాటి ముక్కుల్ని సగం తెరచి, సగం నీళ్ళల్లోకి ముంచి చీపురు కట్టతో అటూ ఇటూ ఊడుస్తున్నట్టు తిప్పుతూ ఉంటాయి. అప్పుడు నోటికి తగిలిన కప్పల్ని, చేపల్ని పట్టుకొని తినేస్తాయి. ఇవి ఎక్కువుగా గుంపులు గానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు జంటగా లేదా ఒంటిగా కూడా కనిపిస్తాయి. ఇక్కడ
కనిపిస్తున్న Painted Storks ని మొన్న నేను తుర్కపల్లి చిన్న చెరువు దగ్గర తీశాను. అక్కడ నీళ్ళు బాగా తగ్గిపోయాయి. అందుకే అక్కడికి ఓ గుంపు చేరింది. చెరువు పక్కనే పెద్ద పెద్ద బండలున్నాయి. ఇవి చెరువులో ఉన్నప్పుడు ఎవరైనా మనుషులు ఆ చెరువు దగ్గరికి వస్తే ఎగిరి ఇలా పక్కనున్న బండల మీద వాలుతున్నాయి.