Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ మొదటి తరం పర్యావరణ ఉద్యమకారుడు, చిప్కో ఉద్యమ నిర్మాత సుందర్‌లాల్ బహుగుణ కరోనా కారణంగా మే నెల 21న డెహ్రాడూన్‌లో మరణించారు. దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం కషి చేస్తున్న ఉద్యమ కారులందరికీ సుందర్‌లాల్ బహుగుణ స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన పెరగడానికి, దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి వారు నిర్మించిన చిప్కో ఉద్యమమే కారణం.
సుందర్‌లాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లా మరోడా గ్రామంలో 1927లో జన్మించారు. వారి పూర్వికులు బెంగాల్‌కు చెందినవారు. స్వాతంత్రోద్యమ సమయంలో సుందర్‌లాల్ శ్రీదేవి సుమన్ అనే స్వాతంత్య ఉద్యమకారునిచే స్ఫూర్తి పొంది అహింస ధర్మ ప్రచారంలోను, అస్పశ్యతకు వ్యతిరేకంగానూ పని చేశారు. 1965-70 ప్రాంతంలో మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీనికోసం కొండ ప్రాంతాల్లో మహిళల్ని సమీకరించారు. అభివద్ధి ప్రాజెక్టుల పేరుతో పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని సుందర్‌లాల్ గమనించారు. అడవులు ధ్వంసం అయితే ఆ ప్రాంత ప్రజల జీవనమే ధ్వంసం అవుతుందని అర్థం చేసుకున్నారు. 1970ల ప్రాంతంలో హిమాలయాల్లో చెట్లు కొట్టడానికి అనుమతి పొందిన అటవీ కాంట్రాక్టర్లు చెట్లు నరికేందుకు సిద్ధపడగా గౌరీ దేవి ఆధ్వర్యంలో కొందరు ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. తన శ్రీమతి విమల బహుగుణ సూచనతో సుందర్‌లాల్ బహుగుణ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. చెట్ల నరికివేతను అడ్డుకోవడం కోసం ఉద్యమకారులు చెట్టు చుట్టూ చేతులతో పెనవేసుకోవడం ద్వారా కాంట్రాక్టర్లు చెట్లు కొట్టకుండా అడ్డుకున్నారు. ఈ విధానమే చిప్కో ఉద్యమంగా ప్రసిద్ధి చెందినది. దీనిని భారతదేశంలో మొట్టమొదటి పర్యా వరణ ఉద్యమంగా చెబుతారు. ఉద్యమం క్రమంగా పెరగడం తో 1980లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు చెట్ల నరికివేత నిషేధించారు. పర్యావర ణానికి సంబంధించి ఇది గొప్ప విజయంగా పరిగణించవచ్చు. ఈ క్రమంలోనే హిమాలయ పర్వత ప్రాంతాలలో అటవీ సంపద ధ్వంసానికి గురి కాకుండా ప్రజల్ని చైతన్య పరచడం కోసం సుందర్‌లాల్ 1981 - 83 మధ్యకాలంలో కాశ్మీర్ నుంచి కోహిమా వరకు సుమారు ఐదు వేల కిలోమీటర్లు హిమాలయాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఆర్థిక అభివద్ధి పేరుతో పర్యావరణం ధ్వంసం చేయడం సరికాదని ''పర్యావరణమే శాశ్వతమైన ఆర్థిక వ్యవస్థ'' అనే స్లోగన్ ఇచ్చారు. మరోవైపు 1980 - 2004 మధ్య ఉత్తరాఖండ్‌లో నిర్మించ తలపెట్టిన తెహ్రీ డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా భాగీరథి నది ఒడ్డున 1995లో 45 రోజులు సత్యాగ్రహ దీక్ష చేశారు. ఈ ఒత్తిడి ఫలితంగా డ్యాం నిర్మాణం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం కోసం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు రివ్యూ కమిటీని నియమించారు. తదుపరి చర్యలు డిమాండ్ చేస్తూ 74 రోజులపాటు ఢిల్లీకి మార్చ్ నిర్వహించారు.
దేశవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు సుందర్‌లాల్ బహుగుణ మద్దతు నిచ్చారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో పర్యటించారు. పర్యా వరణ పరిరక్షణ కోసం వారు చేసిన కషిని గుర్తిస్తూ వివిధ పలు అవార్డులతో సత్కరించాయి. 1981లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించగా తిరస్కరించారు. 1986 లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు, 1987లో ప్రత్యామ్నాయ నోబెల్‌గా పరిగణించబడే రైట్ లైవీహుడ్ అవార్డు, 2009లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
తన అనుభవాల సారాన్ని రంగరిస్తూ సుందర్ లాల్ బహుగుణ 'దర్తీ కీ పుకార్', ఇండియాస్ ఎన్విరాన్మెంట్ : మిత్ అండ్ రియాలిటీ, ద రోడ్ టు సర్వైవల్, ఎన్విరాన్మెంట్ క్రైసిస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పుస్తకాలు రచించారు. ప్రస్తుతం అనేక రకాల జంతు సంబంధ వ్యాధులు ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కూడా ఈ రకమైన వ్యాధే. పర్యావరణం విధ్వంసమే జంతు సంబంధ అంటు వ్యాధులు పెరగడానికి కారణమని నిపుణులు తేల్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుందర్ లాల్ బహుగుణ అదే కరోనా వ్యాధితో మరణించడం అత్యంత బాధాకరం. అయినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ చేసే కషికి వారి జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది. వారి మరణానికి నివాళులర్పిస్తున్నాం...
పట్టణ, నగర ప్రాంతాలు
పట్టణ ప్రాంతాలు మొత్తం భూమిపై 1 శాతం కాగా, ప్రజలు మాత్రం 50 శాతంగా ఉన్నారు. ఇవి పర్యావరణపరంగా సున్నిత ప్రాంతాలు. అవసరాల కోసం అడవులు, గడ్డిభూములు, మంచినీటి ప్రాంతాలు, చిత్తడి నేలల్ని నివాస ప్రాంతాలుగా, పరిశ్రమలు, రోడ్లు, వాణిజ్యం కోసం ఉపయోగిస్తున్నారు. పరిశ్రమలు, ఇళ్ళనుంచి వెలువడే వ్యర్థాలు, ట్రాఫిక్, నీటి కాలుష్యం, మృత్తిక, వాయు కాలుష్యం పెరుగుతున్నాయి. ఇతర ప్రకృతి వ్యవస్థల కంటే అతివేడి, వర్షపు నీరు ఇంకక పోవడం ఇక్కడ సాధారణం. పట్టణ ప్రాంత ప్రకృతి వ్యవస్థ పెరుగుతూ ఉంటే దాని ప్రభావం ఇతర వ్యవస్థలపై పడి అవి క్షీణిస్తాయి. భార లోహాలు, ఎరువులు, క్రిమిసంహారాలు, ఫార్మా పరిశ్రమల వ్యర్థాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అందుకే ఈ ప్రకృతి వ్యవస్థలో పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలి. పార్కులు, పాఠశాలలు, కార్యాలయాల ఖాళీ స్థలాల్లో పచ్చదనాన్ని పెంచాలి. సుస్థిరమైన ప్రణాళికలు అమలు చేయాలి. వ్యర్థాల సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకోవాలి.
ఎంతెంత దూరం?
పర్యావరణ విధ్వంసం వల్ల జరుగుతున్న నష్టం ప్రపంచానికి అర్థమవుతున్నా, ఆ స్థాయిలో నష్ట నివారణ చర్యలు లేవు. ఎన్ని తీర్మానాలు చేసినా, కార్యచరణ ప్రకటించినా ఆయా దేశాల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేని పక్షంలో ప్రయోజనం ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వం సానికి, కాలుష్యానికి కారణమవుతున్న పారిశ్రామిక దేశాలు, నష్ట నివారణ తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీని వల్ల మూడో ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా పని చేసే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు పర్యావరణ పరిరక్షణ వైపుగా చర్యలు తీసుకోకపోగా, విస్తృత స్థాయిలో సహజ వనరుల్ని కొల్లగొడుతున్నాయి. ఈ భూగోళంపై, పర్యావరణపై ప్రజలందరికీ హక్కుంది. దానిని పరిరక్షించేలా ప్రజలు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా వారికి అవగాహన పెంచే బాధ్యత పురోగామి, అభ్యుదయ శక్తులపై ఉంది.