Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిశిరకాల తారల పుంజం
పుంజుకుంటోంది.
జనసమ్మర్ధం మీద మిక్కిలిగా
చంద్రకాంతి మెరుస్తోంది.
నదిలో మండూకశశి
మునగకుండా ఈదుతోంది.
చేదుమూలికలు పొడిచేసి
కుందేలుచంద్రిక
నిత్యజీవన కషాయం చేస్తోంది.
ఆ ఓషధి నా మనసుని
మరింత చేదుగా చేస్తుంది.
ఆ వెండి సోయగం
నా జుత్తుని మరింత తెల్లగా చేస్తుంది.
దేశమంతా యుద్ధంతో
నిండిపోయిందని నాకు తెలుసు.
పడమర ఎడారుల్లోని
శిబిరాల సైనికులకు
వెన్నెలంటే విలువే లేదు.
- అనువాదం: పి.శ్రీనివాస్ గౌడ్
9949429449
దు ఫు, చీనా కవి (712 - 770)