Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నర్గీస్‌దత్ సినిమా చరిత్రలోనే గొప్ప మహిళా నటియే కాకుండా.. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత కోసం 'నర్గీస్ దత్ ఫౌండేషన్' ఏర్పాటు చేసి, భారతీయ మహిళల ఆత్మకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిగా ఆమె శాశ్వతమైన గుర్తింపు పొందింది. నటనలో కీర్తి శిఖరం వద్ద ఉన్న సమయంలో కుటుంబం కోసం నటనను వదులు కోవడమే కాకుండా, పక్షవాతం పడిన, పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ నర్గీస్. ఆమె చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు 1980లో రాజ్యసభలో స్థానం సంపాదించేలా చేసాయి''.
టామ్ బాయ్ నుండి ఆన్-స్క్రీన్ లెజెండ్ వరకు
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నర్గీస్, జూన్ 1, 1929న కోలకతాలో పంజాబ్‌కు చెందిన ఒక ముస్లిమ్ కుటుంబంలో జన్మించింది. నర్గీస్ అసలు పేరు 'ఫాతిమా రషీద్'. తరువాత 'నర్గీస్'గా స్థిరపడిపోయింది. నర్గీస్ తల్లి అలహాబాదుకు చెందిన ప్రఖ్యాత శాస్త్రీయ గాయని జద్దన్‌బాయి హుస్సేన్, తండ్రి రావల్పిండి సంపన్న కుటుంబానికి చెందిన మోహన్‌చంద్. జద్దన్బాయిని వివాహమాడిన తర్వాత ముస్లిం మతాన్ని స్వీకరించి అబ్దుల్ రషీద్‌గా పేరు మార్చుకున్నారు. వీరి కుటుంబం బొంబాయిలో స్థిరపడటానికి ముందు కొంతకాలం కలకత్తాకు వెళ్లింది. అక్కడ యుక్త వయస్సులో ఉన్న నర్గీస్‌ను అందరూ టామ్బారు అని పిలిచేవారు. జద్దన్‌బాయి తొలి భారతీయ సినిమాలలో నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు పొందారు. తల్లి నటి కావడంతో నర్గీస్‌కు 5ఏళ్లు నిండగానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 1935 సంవత్సరంలో ''తలాష్-ఇ-హక్'' సినిమాలో బాలనటిగా ఓ చిన్న పాత్రలో నటించినప్పటికి, నటన జీవితం మాత్రం 1942లో వచ్చిన ''తమన్నా'' చిత్రంతో ప్రారంభమైంది. ముంబైలోని క్వీన్ మేరీస్ పాఠశాలలో విద్యను పూర్తి చేసిన తరువాత, మెడిసిన్ చేయాలనుకుంది. కానీ దర్శకులు మెహబూబ్‌ఖాన్ ప్రోద్బలంతో స్క్రీన్ టెస్ట్‌లో సెలక్ట్ అయ్యి 1943లో 14ఏళ్ళ వయసులో మెహబూబ్ ఖాన్ సినిమా 'తక్దీర్'లో నటించింది. అనంతరం మూడు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్లో, దాదాపు అరవై చిత్రాల్లో నటించిన నర్గీస్ కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలతో పాటు, విమర్శకుల ప్రశంసలు పొందిన అనేక చిత్రాలలో నటించింది. వీటిలో చాలా సినిమాలు నర్గీస్ రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే. 1950వ సంవత్సరం నాటికి నర్గీస్ దత్ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. అందులో హుమాయున్ (1945), అనోఖాప్యార్, ఆగ్, అంజుమన్(1948), అందాజ్, బర్సాత్, దారోగాజీ, రుమాల్(1949), ఆవారా (1951), దీదార్(1951), శ్రీ420 (1955), చోరీచోరీ (1956) ఉన్నాయి. మెహబూబ్ ఖాన్ 1957లో నర్గీస్ నాయికగా నిర్మించిన ''మదర్ ఇండియా'' ఘన విజయం సాదించింది. నర్గీస్ 28ఏళ్ల వయస్సులోనే తల్లి పాత్రను ధరించి మెప్పించారు. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడటంతో పాటు, చిత్రంలోని నటనకు నర్గీస్‌కు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చి పెట్టింది. నర్గీస్ నటించిన 'ఆV్‌ా' సినిమా తెలుగులో 'ప్రేమ లేఖలు' పేరుతో విడుదలై తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఆమె కుమారుడు సంజరుదత్ మొదటి చిత్రం రాకీ విడుదలకు కొద్దిరోజుల ముందు, తన 51వ ఏటా 1981 మే 3వ తేదీన నర్గీస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
నర్గీస్ రాజకపూర్ల ప్రేమ
రాజ్‌కపూర్ తన సినిమా షూటింగ్ కోసం స్టూడియో వెతుక్కునే ప్రయత్నంలో నర్గీస్ వాళ్ళమ్మ జద్దన్‌బాయి సలహా కోసం వాళ్లింటికి వెళ్ళినపుడు నర్గీస్‌ను చూసి ఆమె అందానికి ముగ్ధుడ య్యాడు. నీలి కళ్ల అందగాడైన రాజ్కపూర్ని చూసిన నర్గీస్ సైతం ఆయన పట్ల ఆకర్షితురా లయ్యింది. వారిరువురు ఒకరికొకరు పరిచయ మయ్యే నాటికి నర్గీస్ వయసు 20, రాజ్ కపూర్ వయసు 22. అప్పటికే నర్గీస్ ఎనిమిది హిట్ సినిమాలను ఇచ్చింది. రాజ్‌కపూర్ మాత్రం ఇబ్బందిలో ఉన్నాడు. ఆ సమయంలో తను నటిస్తున్న 'ఆగ్' సినిమాలో నర్గీస్ కోసం ఒక పాత్రను సష్టించాడు. అనంతరం వచ్చిన 'బర్సాత్' సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమానుబంధం బలపడింది. రాజ్‌కపూర్ సొంత నిర్మాణ సంస్థ 'ఆర్కే ఫిల్మ్స్' తీసిన అన్నీ చిత్రాల్లో నర్గీస్ నటించింది. ఆ ఇద్దరు జంటగా 16 సినిమాల్లో నటించి సక్సెస్ జోడీగా గుర్తింపు పొందారు. ఒక దశలో 'ఆర్కే ఫిల్మ్స్'లో తప్ప బయటి బ్యానర్స్‌లో నర్గీస్ నటించదు అనే అప్రకటిత శాసనాన్ని రాజ్ కపూర్ అమలు చేశాడని ఇండిస్టీలో చెప్పుకునేవారు. అయితే 'ఆర్కే ఫిల్మ్స్' ఆర్థిక కష్టాల్లో వున్నపుడు రాజ్‌కపూర్ అనుమతితో బయటి సినిమాల్లో నటించి ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంతో పాటు తన నగలను అమ్మి 'ఆర్కే ఫిల్మ్స్' ఖజానాలో జమ చేసేదట. నా పిల్లలకు నా భార్య తల్లి అయితే 'ఆర్కే ఫిల్మ్స్'కి తల్లి నర్గీస్ అని రాజ్‌కపూర్ తరచుగా సినీ పెద్దలతో చెప్పేవాడట. అయితే వీరిద్దరి ప్రేమ ఒకటి కావడానికి రెండు కారణాలు అడ్డుపడ్డాయి. అదివరకే రాజ్‌కపూర్‌కి పెళ్లి కావడం, నర్గీస్ మతం. ఈ ఇరువురి ప్రేమకి అడ్డంకి అయ్యాయి. తమ ప్రేమ సుఖాంతం అవుతుందనుకున్న ఇద్దరికీ నిరాశే ఎదురయ్యింది. దీంతో నర్గీస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తన డిప్రెషన్ తగ్గడానికి 'మదర్ ఇండియా' సెట్లో తన సహ నటుడు సునీల్ దత్‌ని ఊరటగా మలచుకుని అతనికి దగ్గరవ్వడమే కాకుండా, పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజ్‌కపూర్ 'ఆర్కే ఫిల్మ్స్' కార్యాలయంలో నర్గీస్ ఉపయోగించిన వస్తువులను, గదిని అపురూపంగా చూసుకుంటూ రోజంతా మద్యం సేవిస్తూ ఏడుస్తూ గడిపేవాడు. ఇలా ఈ ఇద్దరి ప్రేమ గమ్యం చేరకుండానే ముగిసిపోయింది.
మజిలీ చేరని లవ్ స్టోరీస్
అయితే కొన్నాళ్ళ తర్వాత రాజ్‌కపూర్ ఎప్పటిలాగే తన కథానాయికలతో ప్రేమ కలాపాలు సాగిస్తూ అటు కుటుంబం దూరం కాకుండా చూసుకున్నాడు. నర్గీస్ ప్రేమలో పడిన మరో నటుడు దిలీప్‌కుమార్ మాత్రం నర్గీస్ జ్ఞాపకాలతో చాలా కాలం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. వయసు దాటిపోయాక 1966లో సైరాబానును చేసుకున్నాడు. విచిత్రమైన ఈ లవ్‌స్టోరీలో ఎవరి ప్రేమా సక్సెస్ కాలేదు. ''ప్యార్ హువా.. ఇక్ రార్ హువా హై.. ప్యార్ సె ఫిర్ క్యో దర్తా హై దిల్.. కహతా హై దిల్ రస్తా ముష్కిల్ మాలుమ్ నహి హై కహా మంజిల్..'' అన్నట్లుగానే వీరి ప్రేమ మజిలీ చేరకున్నా అందరూ హ్యాపీగానే వున్నారు.
నర్గీస్, సునీల్ దత్ల వివాహం
నర్గీస్ తన ''మదర్ ఇండియా'' సహనటుడు సునీల్ దత్‌ను 1958లో వివాహం చేసుకుంది. మదరిండియా షూటింగ్ సమయంలో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో, మంటల్లో చిక్కుకున్న నర్గీస్‌ను సునీల్ దత్ కాపాడటంతో అందుకు బదులుగా ఆమె తన జీవితాన్ని ఇచ్చింది. ఆ సినిమా షూటింగప్పుడే వాళ్లిద్దరి ప్రేమ గుప్పుగుప్పుమంది. సినిమా విడుదలకు ముందే ఇద్దరు ఒక్కటయ్యారు. సునీల్‌దత్ తనకంటే ఒక ఏడాది చిన్నవాడైనప్పటికి నర్గీస్ హిందూ మతాన్ని స్వీకరించి అతన్ని వివాహమాడింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, వీరిలో సంజరు దత్, ప్రియా దత్, నమ్రత దత్. సంజరు దత్ నటుడుగా, ప్రియా దత్ రాజకీయాల్లో రాణిస్తున్నారు.
సునీల్‌దత్‌తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసి, తన భర్తతో కలసి ''అజంతా ఆర్ట్స్ కల్చర్ ట్రూప్''ను ఏర్పాటు చేసింది. నాటి ప్రముఖ నటులు, గాయనీ గాయకులను భాగస్వాముల్యను చేస్తూ, సరిహద్దు ప్రాంతాలలో సైనికులకు వినోదాన్ని అందించేందుకు ఈ సంస్థ ద్వారా స్టేజ్ షోలను నిర్వహించింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఢాకా నగరంలో ప్రదర్శనలిచ్చి సైనికులను అలరించారు. 1972లో నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సలహాతో నర్గిస్ ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాఃః సంస్థను ప్రారంభించి దివ్యాంగుల సేవారంగంలో కార్యక్రమాలను ప్రారంభించారు. పిల్లల పక్షవాత సంబదిత వ్యాదులు ఫిట్స్ లక్షణాలున్న వారికి సేవలను అందిచాలనే లక్ష్యంతో ఈ సంస్థకు మొదటి పోషకురాలయి, సంస్థ కోసం చేసిన కషికి ఒక సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు పొందగల్గింది.
నర్గీస్ దత్ ఫౌండేషన్
1981లో నర్గీస్ చివరి కోరిక మేరకు సునీల్‌దత్ ఃనర్గీస్ దత్ ఫౌండేషన్ః ను, నర్గీస్‌దత్ మోమోరియల్ కాన్సర్ హాస్పిటల్‌ను స్థాపించి పేషంట్లకు సేవలు అందించారు. ఃనర్గీస్ దత్ ఫౌండేషన్ః ద్వారా గత 40 సంవత్సరాలుగా ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత రంగంలో సేవలందిస్తుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని వికలాంగ పిల్లల సంరక్షణ, పునరావాసం, విద్యలో గణనీయమైన కషి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దురదష్టవశాత్తు, ఆమె చివరి కోరిక సాకారాన్ని ఎక్కువ కాలం చూడలేకపోయింది. నర్గీస్ మరణానతరం ఆమె భర్త సునీల్‌దత్‌తో పాటు స్నేహితులు, ఇపుడు నర్గీస్ పిల్లలు ఆమె కలను సజీవంగా ఉంచే భాద్యతను చేపట్టి లక్ష్యం దిశగా పయనం కొనసాగిస్తున్నారు.
నర్గీస్ దత్ పేర జాతీయ అవార్డు
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ ప్రతి ఏటా ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల విభాగంలో నర్గీస్‌దత్ పేర జాతీయ అవార్డు నెలకొల్పి, ఆమె గౌరవార్థం ఃఃనర్గీస్దత్ జాతీయ సమైక్యత అవార్డుఃః ను జాతీయ సమైక్యతపై రూపొందించబడిన చలనచిత్రానికి బహుకరిస్తున్నారు. 1965లో 13వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలలో నెలకొల్పబడిన ఈ అవార్డును ఇప్పటివరకు అన్నీ భారతీయ బాషలలో నిర్మితమైన 46 చిత్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కింద ఎంపికైన చిత్రానికి 50 వేల నగదుతో బాటు రజత కమలం, ప్రశంసా పత్రం అందిస్తున్నారు.
నర్గీస్ పై పుస్తకాలు
నర్గీస్ జీవిత చరిత్రపై పలు పుస్తకాలు వెలువడ్డాయి. 1994 లో టి.జె.ఎస్.జార్జ్ ఃఃది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నర్గీస్ఃః అనే పేరున పుస్తకాన్ని వేలువరించగా, 2007లో, నర్గీస్ కుమార్తెలు ప్రియా దత్, నమ్రతా దత్ లు కలసి వారి తల్లిదండ్రుల జీవితాల గురించి ఃఃమిస్టర్ అండ్ మిసెస్ దత్ మెమోరీస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ఃః అనే పుస్తకాన్ని ప్రచురించారు. అదే సంవత్సరం కిశ్వర్ దేశారు డార్లింగ్జీ, ది ట్రూ లవ్ స్టోరీ ఆఫ్ నర్గిస్ సునీల్ దత్ పుస్తకాలు విడుదల అయ్యాయి. 2018లో వచ్చిన నర్గీస్ కుమారుడు సంజరుదత్ బయోపిక్ చిత్రం ఃసంజుఃలో నర్గీస్ పాత్రను మనీషా కొయిరాలా పోషించించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
పురస్కారాలు
1957లో నర్గీస్ మదర్ ఇండియా సినిమాలో నటనకు గాను ఃఫిలింఫేర్ ఉత్తమనటిః అవార్డు అందుకున్నారు. ఈ సినిమా ఃఆస్కార్ అవార్డుః కు నామినెట్ చేయబడింది.
1958 లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సినిమా రంగానికి చెందిన తొలి నటి నర్గీస్.
1968లో రాత్ ఔర్ దిన్ సినిమాలో నటించిన నర్గీస్ జాతీయ ఉత్తమనటి అవార్డుతో, ఊర్వశి పురస్కారం అందుకున్న తొలి నటీమణి.
1958లో చేకొస్లోవేకియాలో జరిగిన చలన చిత్రోత్సవంలో మదర్ ఇండియా సినిమాలో నటనకు కార్లోవివేరీ ఉత్తమ నటి అవార్డుఃః సాధించిన తొలి నటి.
2001లో హీరోహోండా కంపెనీ, స్టార్‌డస్ట్ సినీపత్రిక ఃఃబెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది మిలీనియంః పురస్కారాన్ని ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌తో కలిపి ప్రదానం చేశాయి.
1993 డిశంబర్ 30 వ తేదీన భారత తపాలా శాఖ నర్గీస్ దత్ జ్ఞాపకార్థం ఒక రూపాయి విలువ గల పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
(జూన్ 1 న జయంతి సందర్భంగా..)
- పొన్నం రవిచంద్ర
9440077499