Authorization
Mon Jan 19, 2015 06:51 pm
A Room without books is like a body without soul అని మార్గస్ సిసిరో చెప్పినట్లు ప్రతి ఒక ఇంట్లో గ్రంథాలయం ఉండాలనే భావనను వెలిబుచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో పట్టణ నగర కేంద్రాలలో గ్రంథాలయాలు స్థాపించి విజ్ఞాన సమాజ అభివద్ధికి ప్రభుత్వ వ్యవస్థలు తోడ్పడాలి. అలా చేయాలంటే ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో గ్రంథాలయ చట్టాలు ఏర్పాటు చేసి గ్రంథాలయ వ్యవస్థను పరిపుష్టం చేయాలి.
పౌర గ్రంథాలయ చట్టం ఆవశ్యకత గురించి చర్చిస్తే పౌర గ్రంథాలయాలకు ప్రభుత్వం నుండి గ్రాంటులు మంజూరు చేసి గ్రంథాలయాల అభివద్ధికి కషి చేస్తుంది. అదేవిధంగా ప్రజల నుండి ప్రభుత్వం గ్రంథాలయ పన్నును వసూలు చేసి గ్రంథాలయాల స్థాపనకు, ఉన్నతికి, కనీస వనరులు సమకూర్పుతో పాటు జనాభాకు అనుగుణంగా నూతన గ్రంథా లయాల ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు రూపొంది స్తాయి. ప్రజలకు ప్రస్తుతావసరాలకు కావలసిన సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించడం కూడా విధిలో భాగమే.
భారతదేశంలో ప్రప్రథమ గ్రంథాలయ చట్టాన్ని తీసుకుని వచ్చిన ఘనత అవిభక్త మద్రాసు రాష్ట్రానికి దక్కింది. ఈ గ్రంథాలయ చట్టం అమలులోకి రాక పూర్వం పశ్చిమ బెంగాల్, బీహార్ తిరువనంతపురం, కొచ్చిన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు చాలా సంవత్సరాలుగా గ్రంథా లయ చట్టం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 1948వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రం నందు ఈ చట్టం అమల్లో రావటానికి చాలా మంది ప్రముఖులు కషి చేశారు. వారిలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కె.వి కష్ణస్వామి అయ్యర్, యస్.యం.ఫౌజిల్, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ వంటి వారున్నారు.
వారితో పాటు నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలచారి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుబ్బరాయన్ గారికి 1947 సంవత్సరంలో గ్రంథాలయ చట్టం అమల్లోకి తీసుకు రావాల్సిందిగా గ్రంథాలయ కార్యకర్తలు విన్నవించుకున్నారు.
1947వ సంవత్సరంలో ఎస్.ఆర్.యు సపూర్, శ్రీనివాస్ రెడ్డి గారి సహాయ సహకారాలతో శ్రీ టీ.ఎస్ అవినాష లింగం చెట్టియార్, సర్.రామస్వామి మొదలియార్, సర్ మహమ్మద్ ఉస్మాన్, టి.ఆర్.వెంకట రామశాస్త్రి మద్రాస్ గ్రంథాలయ కార్య కర్తలు, అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమ రామారావు, పాతూరి నాగభూషణం, శ్రీ వావిలాల గోపాల కష్ణయ్య వంటి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ సభ్యుల సహాయ సహకారాలతో కార్యరూపం దాల్చింది.
మొట్టమొదటి గ్రంథాలయ చట్టం సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు రూపొందించడంలో ప్రధాన భూమిక పోషించిన వారు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. భారతదేశ గ్రంథాలయ చరిత్ర ో వారి పేరు చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. 1947 డిసెంబర్ 9న గెజిట్‌లో ప్రకటించింది. 1948లో ఆమోదించబడిన చట్టం రూపం దాల్చింది.
ఈ చట్ట ప్రకారం ఇంటి పన్ను ఆస్తి పన్నుపై రూపాయికి ఎనిమిది పైసల చొప్పున వసూలు చేయాలి. గ్రంథాలయాల వ్యాప్తి బాధ్యత లోకల్ లైబ్రరీ అథారిటీ వారికి అప్పగించారు. జిల్లా గ్రంథాలయ శాఖ, గ్రంథాలయాల అభివద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నవి. గ్రంథాలయాలు సర్వతో ముఖాభివద్ధికి చొరవ చూపడం గ్రంథాలయ చట్టం బాధ్యత.
1953 సెప్టెంబర్ 30 నాటికి మునుపే అనగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే ఆంధ్ర ప్రాంతంలో 11 జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాల స్థాపనకు ప్రయత్నాలు చేశారు. 1953 నాటికి శాఖ గ్రంథాల యాల స్థాపన పూర్త యింది. ఇవిగాక 976 సహాయక గ్రంథాలయంలో 336 నిర్వి రామంగా పని చేశాయి.
రెండవ పౌర గ్రంథాలయ చట్టంగా హైదరాబాద్ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టం గణతికెక్కింది. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వం మొదటగా గ్రంథాలయాలకు, తెలుగు భాషాభివద్ధికి, అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వాతంత్రానంతరం పౌరుల విజ్ఞాన, వికాసంతో పాటు అక్షరాస్యతను పెంపొందించేందుకు గ్రంథాలయ చట్టం అవసరమని భావించి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయోద్యమ నాయకులు శ్రీధర్ వామన నాయక్, గోపాలరావు ఎగ్బోటే, ఉజ్లంకర్, ఆర్.యస్.శాస్త్రి, పవన్ కుమార్, అబ్దుల్ హైదర్ మొదలైన గ్రంథాలయ సభ్యుల సహకారంతో ఉజ్లంకర్ హైదరాబాద్ గ్రంథాలయ డ్రాఫ్టు బిల్లును రూపొందించింది.
హైదరాబాద్ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టం కోసం భారతదేశ గ్రంథాలయ పితామహులు డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథం అమూల్య సలహాలు సూచనలు ఇచ్చారు. ఆనాటి విద్యా శాఖ మంత్రి శ్రీ గోపాల్ ఎగ్బోటే సహాయ సహకారాలు అందించారు. 27-8-1954 హైదరాబాద్ పౌర గ్రంథాలయ బిల్లును గెజిట్‌లో ప్రవేశపెట్టారు.
శాసనసభలో 1955 ఫిబ్రవరి 12న పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభృతులు వెంకటరామారావు, కె.అనంత రెడ్డి, డి.జే.ఆనందరావు, శ్రీమతి మజుమా బేగం మొదలైనవారు తగు సూచనలు సలహాలు చేశారు. తదనంతరం ఈ బిల్లును ఆమోదించారు. 1955 సెప్టెంబర్ 1 నుండి ఈ పౌర గ్రంథాలయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది హైదరాబాద్ రాష్ట్ర పౌర గ్రంథాలయ చరిత్ర.
ఈ చట్టాన్ని అనుసరించి సహాయక గ్రంథాలయాలు (ప్రైవేటు గ్రంథాలయాలు/ స్వతంత్రంగా నడిపే గ్రంథాలయాలు) పత్రికలకు రూ.150/-, పుస్తకాలకు రూ.300/- దాటకుండా ప్రభుత్వం సహకారం అందించింది. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికే స్వతంత్రంగా నడుపబడుతున్న శ్రీ కష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, బాపూజీ వచనాలయం, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయంలకు తగిన సహాయ సహకారాలు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర పౌర గ్రంథాలయాల చట్టాలు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం 1960లో అమలులోకి వచ్చింది. ఏప్రిల్ 1, 1960 నాటికి సహాయ గ్రంథాలయాల సంఖ్య 75. ఆంధ్ర ప్రాంతంలో పన్నెండు వందల గ్రంథాలయాల వరకు ఉన్నవి. ఆంధ్ర ప్రాంతంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాలు 11, శాఖా గ్రంథాలయాలు 182, పుస్తక పంపిణీ కేంద్రాలు 294, సహాయక గ్రంథాలయాలు 986, ప్రత్యేక బాల గ్రంథాలయాలు 11 మొత్తం 1484 గ్రంథాలయాలు ఉన్నవి.
తెలంగాణ ప్రాంతంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పది, శాఖా గ్రంధాలయాలు 27, పుస్తక పంపిణీ కేంద్రాలు 20, సహాయక గ్రంథాలయాలు 75 మొత్తం 132 కలవు. ఏప్రిల్ 1 1960 నుండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం శ్రీ వావిలాల గోపాలకష్ణయ్య, శ్రీ కల్లూరి సుబ్బారావు శాసన సభ్యుల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయ చట్టం రూపుదాల్చింది. శ్రీ ఎఫ్.ఎన్ గార్డెనర్ చెప్పినట్లు Generally the act it is a great improvement on the Madras act and correct many of its defects ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్ట గొప్పతనాన్ని తెలియజేశారు.
1960 గ్రంథాలయ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా అసఫియా గ్రంథాలయంలో పరిగణలోని వచ్చింది. రాష్ట్రానికి గ్రంథాలయ పరిషత్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా దానికి ఒక చైర్మన్‌ను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల బాగోగులను చూసేందుకు అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా ఒక డైరెక్టర్ పౌర గ్రంథాలయాలకు రాష్ట్ర స్థాయిలో నియమించాలని సూచించింది.
జిల్లా స్థాయిలో జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ నియామకం, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ ఉండాలని అదేవిధంగా అదేవిధంగా మండల స్థాయిలో మండల గ్రంథాలయ పరిషత్ లేదా లోకల్ లైబ్రరీ అథారిటీలు ఉండాలని వాటిలో మెంబర్లుగా నియమించాలని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రంథాలయాలను ఒక శాస్త్ర యుక్తమైన పద్ధతులు నడపాలని సూచించడం జరిగింది.
అదేవిధంగా గ్రంథాలయాల్లో పనిచేస్తున్న గ్రంథ పాలకులకు తర్ఫీదు ఇవ్వాలని, మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తర్ఫీదు ఇవ్వాలని, ప్రతి నెలా గ్రంథాలయాల పనితీరుపై, గ్రంథ పాలకుల పనితీరుపై సభలు సమావేశాలు నిర్వహించాలని సూచించింది.
2014 నుండి నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రాంతానికి నూతన గ్రంథాలయ చట్టం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని భావించి ప్రభుత్వం జీ.ఓ. యం.యస్ నెం.35, 21.12.2015 డ జీ.ఓ. యం.యస్ నెం.16, 22.04.2016 అనుసరించి, 1960 ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్టాన్ని 21 డిసెంబర్ 2015 నాడు మోడిఫైడ్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ లైబ్రరీ ఆక్ట్ ఫర్ తెలంగాణ స్టేట్.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గ్రంథాలయ చట్టం అనుసంధానం చేయబడింది. గ్రంథాలయాలకు రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం నుండి లేదా ప్రజల నుండి శిస్తూ / పన్ను రూపంలో వసూలు చేసిన ఆదాయాన్ని గ్రంథాలయాలకు కచ్చితంగా కేటాయించాలని, గ్రంథాలయాలకు నూతన భవనాలు, పక్కా భవనాలు, నూతన గ్రంథాలయ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం నుండి ముఖ్యంగా రాజా రామ్మోహన్రారు లైబ్రరీ ఫౌండేషన్ అందించే సహాయ సహకారాలు పొందాలన్న గ్రంథాలయాల చట్టం ఒక చారిత్రక అవసరం అనేది నగ సత్యం. రాష్ట్ర జనాభాననుసరించి గ్రంథాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ 2003, 2005, 2010 మొదలగు మానిఫెస్టోల ప్రకారం తొలుత ఐదు వేల జనాభా ఉన్న గ్రామాల్లో ఒక్కో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, తదుపరి రెండు వేల జనాభా ఉన్న గ్రామాల్లో ఒక్కో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామానికి ప్రభుత్వ గ్రంథాలయం ను లేదా కనీసం పుస్తక డిపాజిట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇదే విషయాన్ని మన దేశంలో ఉన్న రాజా రామ్మోహన్రారు లైబ్రరీ పౌండేషన్ నిర్వాహకులు కూడా అనుసరిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు.
ఇప్పటివరకు భారతదేశంలో 28 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలకు గాను పౌర గ్రంథాలయ చట్టాలు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాలు అనగా గోవా 1.67 శాతం, కేరళ 5 శాతం, కర్ణాటక 6శాతం, ఆంధ్రప్రదేశ్ డ తెలంగాణ 8 శాతం, తమిళనాడు 3శాతం ప్రభుత్వం ప్రజల నుండి పన్ను రూపంలో వసూలు చేస్తున్నాయి. మిగతా 14 రాష్ట్రాలు ప్రభుత్వం నుండి నేరుగా గ్రంధాలయ శాఖలకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందిస్తాయి. వచ్చిన ఆర్థిక సహాయాన్ని గ్రంథాలయాల ఉన్నతికి, గ్రంథాలయాల అభివద్ధికి కేటాయిస్తున్నాయి.
రాజా రామ్మోహన్రారు లైబ్రరీ ఫౌండేషన్ సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో గ్రంథాలయ చట్టాలు చేసి పౌర గ్రంథాలయ వ్యవస్థకు తోడ్పడాలి. కానీ దేశంలో 20 రాష్ట్రాల్లో మాత్రమే పౌర గ్రంథాలయ చట్టాలు అమలు అవుతున్నవి. కానీ పలు రాష్ట్రాలలో (డిల్లీ, కేరళ, కర్నాటక, మణిపూర్, మేఘాలయ, కొన్ని ఈ శాన్య రాష్ట్రాలలో తప్పితే) గ్రంథాలయాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు మినహాయింపు కాదు.
రెండు తెలుగు రాష్ట్రాలలో గత మూడు దశాబ్దాలుగా నూతన గ్రంథాలయాల ఊసేలేదు. కానీ గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ గ్రంథాలయాల స్థాపన జరుగుతుంది. కానీ మరొక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయాల పరిస్థితి, గ్రంథ పాలకుల పరిస్థితులు ఆశాజనకంగా లేవు.
ఏది ఏమైనా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో గ్రంథాలయ చట్టాలు చేయవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ఆ చట్టాలు అమలు తీరును జాతీయ వ్యాప్తంగా ఒక కమిటిని నియమించి వాటి ఫలితాలు ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
A library is a hospital of the mind అన్నట్లు గ్రంథాలయాలు ప్రతి గ్రామంలో ఏర్పరిచి విజ్ఞాన వంతమైన ఆదర్శవంతమైన చైతన్యవంతమైన ఆలోచనాత్మకమైన సజనాత్మకమైన బలమైన పౌర సమాజ స్థాపనకు ప్రభుత్వాలు పునాదులు వేయాలని ఆశిద్దాం.
పుస్తకం వర్ధిల్లాలి గ్రంథాలయాలు వెలుగొందాలి.
భారతదేశంలో మొట్టమొదటి గ్రంథాలయ చట్టం మద్రాస్ పౌర గ్రంథాలయ చట్టం (1948), ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్టం (1960), కర్ణాటక రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టం (1965), మహారాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టం (1967), పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టం (1979), మణిపూర్ పౌర గ్రంథాలయ చట్టం (1988), హర్యానా పౌర గ్రంథాలయ చట్టం (1989), కేరళ పౌర గ్రంథాలయ చట్టం (1989), మిజోరాం పౌర గ్రంథాలయ చట్టం (1993), గోవా పౌర గ్రంథాలయ చట్టం(1993), గుజరాత్ పౌర గ్రంథాలయ చట్టం (2001), ఒరిస్సా పౌర గ్రంథాలయాల చట్టం,(2001) ఉత్తరాఖండ్ పౌర గ్రంథాలయ చట్టం (2005), ఉత్తరప్రదేశ్ పౌర గ్రంథాలయంలో చట్టం (2006), రాజస్థాన్ పౌర గ్రంథాలయ చట్టం (2006), లక్షద్వీప్ పౌర గ్రంథాలయ చట్టం (2007), బీహార్ పౌర గ్రంథాలయాల చట్టం (2008), చత్తీస్ఘడ్ పౌర గ్రంథాలయాల చట్టం (2008-09), అరుణాచల్‌ప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్టం (2009), తెలంగాణ పౌర గ్రంథాలయ చట్టం (1960) మాడిఫైడ్ అండ్ అడాప్టెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్టం 2014-15 లో చేయబడింది.
- డా. రవికుమార్ చేగొని, 9866928327
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం