Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడం చాలా ఆవశ్యకమైన అంశం. అందులోనూ వర్షాకాలం.. రోజు వారీ భోజనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొన్ని పదార్థాలు మనకు హాని కలిగించేవి ఉన్నాయి. వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు తీసుకోకున్నా సమస్యలేదు కానీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
కాఫీ : నిద్ర లేవగానే కమ్మని కాఫీ తాగితే ఆ రోజంతా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇది కాఫీ ప్రియులు చెప్పే మాట. కానీ ఇందులో ఉండే కెఫిన్ నిద్రపై, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పరిమితంగా తాగితేనే ఆరోగ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు కాఫీలో కలుపుకునే చక్కెర వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఈ చక్కెర మోతాదు ఎక్కువైతే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిపైనా ప్రభావితం ఉంటుంది.
ఉప్పు : మన రోజు వారీ భోజనంలో ఉప్పు సర్వ సాధారణమే. ఫాస్ట్ఫుడ్ బేకరీ ఐటమ్స్ అంటే మక్కు చూపని వారుండరు. వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువ ఉపయోగించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే ఉప్పును పరిమితంగా తీసుకోవాలి.
ఫ్రైడ్ ఫుడ్ : స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిని దూరం పెట్టేందుకు ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్, ఫ్రైడ్ చికెన్, ఫిష్ ఫ్రై వంటివి చేసుకోవడం సాధారణ విషయం. కానీ ఈ ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. సాధ్యమైనంత వరకు వీటిని దూరంగా ఉంచితేనే ఉత్తమం.