Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఫ్రూట్స్ తినాలని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఎప్పుడూ లభించే వాటితో పాటు సీజనల్ వారీగా లభించే వాటిని కూడా తీసుకుంటే ఆయా కాలాలను బట్టి శరీరానికి రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు శక్తిని అందిస్తుంటాయి. అలాంటి వాటిలో చెప్పుకోదగినది నేరేడు...
ఈ పండును అనారోగ్యాల నివారణి అని, శక్తి ప్రదాయిని అని కూడా అంటారు. కొన్ని రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. దీని ఆకులు.. బెరడు కూడా శరీరానికి మేలు చేస్తాయి. మరి నేరేడు పండు తినడం వల్ల కలిగి ప్రయోజనాలేంటో ఓ సారి చూద్దాం...!!
శరీరానికి చలువ చేసే నేరేడు పండ్లు పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కట్ చేసి బయటకు పంపగలవు. అంతేకాదు చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపివేస్తాయి.
వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. కాలేయాన్ని శుభ్రపరిచి, పనితీరును క్రమబద్ధీకరిస్తుందని అధ్యయనాల్లో వెల్లడయింది.
మూత్ర సంబంధ సమస్యలకు దివ్యౌషధం అనే చెప్పాలి. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
నీరసం, నిస్సత్తువ వంటి వాటిని దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి, దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇస్తే, శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది.
అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కావున ఈ పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.