Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణం మారిపోయింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే వున్నాయి. వాతావరణంలోని తేమకు ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు పడుతుంటాయి. ఫలితంగా పిల్లల నుండి పెద్దల వరకు రోగనిరోధక శక్తి తగ్గి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వీటితోపాటు కోవిడ్ ప్రభావమూ ఉండనే ఉంది. ఈ పరిస్థితులకు అనుగుణంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం తప్పనిసరి. అందుకే రోజువారీ ఆహారంతో పాటు మరికొన్నింటిని కూడా తీసుకుంటుంటే ప్రస్తుత పరిస్థితిని అధిగమించవచ్చు. అవేంటో తెలుసుకుందామా...!
నారింజ : ఎక్కువ ఆమ్లత్వం కలిగిన నారింజ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. ఐరన్ లోపం.. రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.
పుట్టగొడుగులు : ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుట్టగొడుగుల్లో తక్కువ కేల రీలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బును తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు రోజూవారీ డైట్లో చేర్చుకోవడం మంచిది.
బీట్రూట్ : బీట్రూట్ను హిమోగ్లోబిన్ పెంచేందుకు ఎక్కవగా ఉపయోగిస్తారు. కానీ ఇందులో పొటాషియంతో పాటు ఇతర ఖనిజాల వంటి పోషకాలుంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నియంత్రించడంలోనూ సహాయ పడుతుంది. రోజువారీ ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది.
బచ్చలి కూర : ఇందులో విటమిన్ సి, ఇ తో పాటు అనేక రకాల పోషకాలు నిండి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
పెరుగు : పెరుగు రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయ పడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పెరుగు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బ్రోకలీ : విటమిన్ సి పుష్కలంగా ఉండే బ్రోకలీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిని రోజూవారీ డైట్లో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పుచ్చకాయ : వేసవిలో తినే వాటిలో పుచ్చకాయ ఒకటి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది. ఇందులో ఉండే గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.