Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామీణ సాంప్రదాయ వత్తులలో కుమ్మరి వత్తి అతి ప్రాచీనమైనది పర్యావరణ రక్షణలో, ఆర్ధికాభివద్ధిలో కీలక భూమిక పోషిస్తుంది. మట్టి కుండల పరిశ్రమ సంప్రదాయం భారతదేశంలో మన నాగరికత వలె ప్రాచీనమైనది. కుండల తయారీ 5000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ యుగం నుండి మొదలయింది. మానవ నాగరికతకు కుమ్మర వత్తి తొలిమెట్టు కుండ ఆయువు పట్టు. సంస్కతి సాంప్రదాయాలకు కుమ్మర వత్తి చారిత్రిక ప్రతిబింబంగా వెలుగొందింది. సింధు లోయలో తవ్వకాల నుండి చేసిన ఆవిష్కరణల ఆధారంగా ఈ ఆధునిక కాలపు మట్టి వస్తువులు భారతదేశపు పూర్వీకుల నుండి ఉద్భవించాయని స్పష్టమ వుతోంది.
పురాతన కాలం లో పేద ప్రజలు, కొంతమంది ధనవంతులు మట్టివస్తువులు నిత్య జీవితంలో ఉపయోగించే వారు. మట్టి కుండలు ధాన్యాలు నిల్వ, నీరు నిల్వ చేయుటకు, ఆహారం వండుటకు, నీటి పారుదలకు మట్టి పైపులను మొదలైన వాటిని ఉపయోగించే వారు (గోలకొండ కోటలో మంచినీటి సరఫరా మట్టి పైపుల ద్వారా జరిగిన ఆధారాలు వున్నాయి). భారతదేశంలో కుండల పరిశ్రమ ఒక ప్రధాన కుటీర పరిశ్రమగా వెలుగొందింది. ఆర్థిక వ్యవస్థ స్వయం సమద్ధిలో కీలక పాత్ర పోషించింది, ఆదాయ సష్టి ఉపాధి కల్పన ఆర్థిక ప్రగతి పురోగతిలో బహుముఖ పాత్ర పోషింది. పర్యావరణ అనుకూలమైన మట్టి పాత్రలు ప్రజారోగ్యం సంరక్షించడంలో ఉపయోగపడతాయి.
కుండల ఆకారాలు, అలంకరణలు, స్థానిక సంప్రదాయాలు అందుబాటులో ఉన్న బంకమట్టి రకాలతో ప్రభావితం అవుతాయి. ఇలా కొన్ని కుమ్మరి సమూహాలు ప్రత్యేకమైన కుండల రకాన్ని అభివద్ధి చేశాయి. విభిన్న సంస్కతులతో కుండల శైలి మారిపోయింది. వివిధ ప్రాంతంలోని కుండలకు విభిన్న శైలులు ఉన్నాయి. మట్టి పాత్ర ఒక సంస్కతి అభివద్ధి చెందిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఇవే పురాతన కాలం నాటి పద్ధతులను అర్థం చేసుకునేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులకు సహాయపడుతున్నాయి.
మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక స్థానిక కుమ్మరి ఉంటాడు. కుమ్మరి అద్భుతమైన గహౌపకరణాలు, స్థానిక ప్రజలకు ఉపయోగపడే ఇతర వస్తువులు తయారు చేస్త్తారు. మన దేశంలో మట్టి దీపాలు, కుండలు వినియోగించకుండా ఏ పండుగ లేదా ఆచారం లేదు. మట్టి వస్తువు ఉపయోగించకుండా చాలా వరకు శుభకార్యాలు పరిపూర్ణం కావు. మనిషి పుట్టినప్పుడు ఉపయోగించే మావికుండ నుండి పెళ్ళిలో ఇరువేణి కుండలు అంత్యక్రియలకు ఉపయోగించే కుండ ఇలా మట్టి వస్తువులు మన జీవితంలో భాగమైపోయినాయి. కుండల తయారీ భారతీయ గ్రామంలో అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ సంబంధాల కలయికను చూపిస్తుంది. మట్టి వస్తువులు గొప్ప సాంప్రదాయాలు ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో కనిపిస్తాయి.
నగరీకరణలో అంతమవుతూ...
పట్టణీకరణ ప్రభావంతో లోహ, ప్లాస్టిక్ వస్తువుల పైన మక్కువ కారణంగా కుమ్మరి వత్తి వేగంగా మందగించింది. మట్టి వస్తువులకు వైవిద్యం లేకపోవుట వలన మార్కెట్ డిమాండ్ గణనీయంగా క్షీణించింది. సాంకేతికత కొరత, తక్కువ స్థాయి ఉత్పత్తిని కలిగి ఉన్న కుమ్మరి వత్తి యంత్రంతో తయారు చేసిన ఉత్పత్తుల నుండి వారు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఆధునిక ఉత్పత్తుల అమ్మకాలకు షో రూమ్‌లు, అవుట్లెట్లు, మార్కెట్లు సంవత్సరమంతా ఆర్ధిక లాభాలు గడిస్తున్నాయి. అవి వారి వ్యవస్థాపకతను స్థాపించడానికి సహాయ పడతాయి.
కానీ కుమ్మరి వత్తిదారులు ప్రకటనలు, అమ్మకాలు, ప్రమోషన్, మార్కెటింగ్ పరిశోధనల కోసం ఎక్కువ ఖర్చు చేయలేరు. కుమ్మర వత్తి పారిశ్రామికీకరణ పట్టణీకరణ ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోయే దశకు ఈ వృత్తి చేరుకున్నది. అందువల్ల మట్టి కుండలు తయారు చేయుటకు ఆధునిక పద్ధతిలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మట్టి వస్తువుల ఆవిష్కరణ అవసరం.
కుమ్మరి వత్తి ఆధునీకరణకు అవకాశాలు తక్కువగా వున్నాయి ఎందుకంటే కుమ్మరి వత్తి పనిచేసే వారికి సరైన శిక్షణ, అధిక ఉత్పత్తి వ్యయం, సరైన సాధనాలు, సొంత మార్కెటింగ్ నెట్వర్క్ లేకపోవడం. వారి మట్టి వస్తువులు నాణ్యత కారణంగా ఉత్పత్తిని పారితోషిక ధరలకు అమ్మడం చాలా కష్టం. బేరసారాల బలహీనత, డబ్బుకు తక్షణ అవసరం కారణంగా వారు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మవలసి ఉంటుంది. ఆర్థిక అవసరాలు బలహీనత కారణంగా వారు దళారులకు, మధ్యవర్తులకు తక్కువ ధరలకు విక్రయించుట వలన కుమ్మరి వత్తిదారులు దోపిడీకి గురవుతున్నారు. వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఆదాయం, ఉపాధి కోసం యువతరం ఇతర పనులు వైపు వెళుతుంటే, కుమ్మరి వత్తి నైపుణ్యం, శ్రమ కొరత కారణంగా విస్తరణ, అభివద్ధికి అవరోధంగా పరిణమించింది.
వీరి కుటుంబంలోని వారందరూ ఎల్లప్పుడూ మట్టి వస్తువుల ఉత్పత్తులను రూపొందించడంలో నిమగమై ఉంటారు. అయినప్పటికీ కుండల పరిశ్రమ నుండి వారి కొద్దిపాటి ఆదాయం జీవనోపాధికి సరిపోక, వ్యవసాయ కార్యకలాపాలలో కూడా పాల్గొంటారు. అంతేకాదు ఇతర రంగాలలో కూలీలుగా పని చేసేందుకు వెళ్ళవలసి వస్తున్నది. యువతరం అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలకు జీవితాలను నెట్టుకొస్తున్నారు. మరికొందరు ఉద్యోగాల కొరకు వలసలు పోతున్నారు. అయినప్పటికీ మిగిలిన ఉన్న కొద్ది పాటి వృత్తిదారులు ఈ హస్తకళాకారులు పరిపూర్ణ అంకితభావం, ప్రేమతో వత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతదేశంలో 260 మిలియన్లకు పైగా ప్రజలు పేదకంలో నివసిస్తున్నారు. పేదరికానికి కారణాలు నిరుద్యోగం, తక్కువ ఆదాయం, అప్పుల పెరుగుదల. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివద్ధి చెందడం అభివద్ధి చెందుతున్న దేశానికి ప్రధాన మైనది. గ్రామం ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చేతి పనులు, కుండల పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ఆర్థికాభివద్ధిలో ఉపాధి కల్పించే సరళమైన అవసరాలు కలిగియున్న మట్టి కుండల పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయంలో కష్టకాలంలో కుండల పరిశ్రమ చేతివత్తుల వారితో పాటు ఇతర రంగ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది తక్కువ పెట్టుబడి, తక్కువ ఇంధనం, స్థానిక వనరులు ఉపయోగంతో ఉపాధిని అందిస్తుంది అంతేకాకుండా, భారతదేశం మొత్తం జీడీపీలో, విదేశీ ఆదాయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
పర్యావరణ అనుకూలమైన మట్టికుండ తయారీలో పునరుత్పాదక వనరు అయిన మట్టిని ఉపయో గిస్తారు. మట్టితో వస్తువులు తయారు చేయడం ఉపయో గించడం వల్ల కానీ, పారవేయడం వల్ల కానీ అపాయకర వ్యర్థాలను ఉత్పత్తి చేయదు. ఉత్పత్తిలో తక్కువ శక్తి వినియోగించుట దీని ప్రత్యేకత. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలలో మట్టి వస్తువులు ప్రధానమైనవి.
మట్టి కుండలో నీరు ఆరోగ్యకరం. కుండలో వండుట వలన ఆహారంలోని పోషకాలకు నష్టం వాటిల్లదు. మట్టికుండలతో క్షామ పీడిత ప్రాంతాలలో వ్యవసాయం చేయవచ్చు. సాంప్రదాయేతర శక్తిని, సౌరశక్తి ఉపయోగించి కుండలు కాల్చుటకు వాముకి కావలసిన ఇంధనం పొందవచ్చు. మట్టితో రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లు, ఇతర ఆధునిక పరికరాల అభివద్ధి చేయుట వలన సహజ వనరులను, విద్యుతను పొదుపు చేయవచ్చు. ఈ వత్తి భూగర్బ జల మట్టాన్ని పెంచుతుంది మరియు ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మహిళలకు, గ్రామీణ యువతకు ఉపాధి కల్పన తద్వారా గ్రామిణార్ధికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చేకూరుతుంది.
కుమ్మరి వస్తువుల ఉత్పత్తికి భారీ డిమాండ్ ఉంది, నిరుద్యోగ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, అంచనాలను అందుకోలేకపోతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముడి పదార్థాల లభించకపోవుటం, సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు, మార్కెటింగ్ ప్రతి దశలో సమస్యలను ఎదుర్కోవటం వంటివి ముఖ్యంగా చెప్పుకోదగినవి. కుమ్మరి వత్తి అంతరించి పోవుటకు సాంకేతిక పురోగతి లేకపోవటంతో పాటు ఆధునిక ఉత్పాదక పద్ధతులు లేకపోవుట అని చెప్పవచ్చు.
కుదేలౌతున్న కుమ్మర వత్తిని ప్రభుత్వం ఆదుకోవాలి. కుమ్మరి వత్తిదారులను అభివద్ధి చేసే పథకాలు, వత్తి కొనసాగించడానికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టడం వంటి వాటిలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. వారికి మౌలిక సదుపాయాలు కల్పించి సాంకేతిక పరిజ్ఞానం మెరుగు పరుచుకు నేందుకు తోడ్పాటునందించాలి. మార్కెటింగ్, రవాణాకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి. శిక్షణ కోసం మార్గదర్శకాలను అభివద్ధి చేయాలి. కంప్యూటర్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలను పరిచయం చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలోజీని, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఈ వత్తి అభివద్ధికి ఉపయోగించాలి. దేశవ్యాప్తంగా కుమ్మరి వత్తిపై మరింత పరిశోధనలు జరగాలి. ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వస్తువులను ఉపయోగించడం ద్వారా మట్టి కుమ్మరి వత్తి ప్రోత్సహించాలి.
భవిష్యత్ తరాలలో యువతరానికి పెరుగుతున్న అనేక ఇతర ఆర్థిక అవకాశాలు రాబోయే సంవత్సరాలలో కుమ్మరి వత్తిని కొనసాగించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని అధిగమించేందుకు శాశ్వత పద్ధతిలో నూతన విధానాలను అమలు చేయాలి. అధునాతన సాంకేతిక అవకాశాలను కుమ్మరి వత్తి దారులకు కల్పించాలి. కుమ్మరి వత్తిలో యువతను ఆకర్షించే విధంగా విద్యా విధానంలో మార్పులు ప్రవేశపెట్టి అమలు చేయాలి.
యూనివర్సిటీ స్థాయిలో, కళాశాలలో, పాఠశాల స్థాయిలలో పాటరీ కోర్సులు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి, పాటరీ పరిశోధన అభివద్ధి విస్తరణ అంశాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రభుత్వం ప్రోత్సహించాలి. కుమ్మరి వత్తిని పునరుద్ధరించడం అంటే మన సనాతన సాంప్రదాయ సంస్కతి నాగరికతలను పునరుద్ధరించడమే, కుల వత్తుల పునర్జీవనంతో ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో పురోగమించేలా ప్రభుత్వాలు సమగ్రమైన చర్యలు చేపట్టాలి.
- ప్రవీణ్‌కుమార్ జలిగామా
సెల్: 9704841734