Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు మనసు తారస పడితే ప్రేమ కౌగిలింతమై మాట్లాడుకుంటది. సష్టినిండా ప్రేమామతం పారుతుంది గనుకే మనిషి మనుగడ , మానవ సంబంధాలు బలంగా కొనసాగుతూ, జీవనదిని తలపొసేలా ప్రేమ సాగుతుంది. ప్రేమ అందరినీ ఆకర్షించి అలరించే అనుభూతి. ప్రేమ నిత్య యవ్వన సంజీవిని. ప్రేమకి కుల మత ప్రాంత విభేదాలు ఉండవంటాడు ఉప్పరి తిరుమలేష్.
ప్రేమ మదిలో జ్ఞాపకాలై నిలుస్తూ యాదిలో కవనమై మొలుస్తుంది ప్రేయసి రూపమే నా కవిత్వం
తన ఎదలోతుల నిండ ఎన్నోజ్ఞాపకాలు గోడలు కట్టుకొని , ఆ గోడకు ఆమె రూపాన్ని చిత్రించుకుంటడు. ఆమె పూయించిన ప్రేమ కవిత్వ కిరణాలతో నిత్యం జ్వలిస్తుంటాడు. అలాంటి ప్రేమనే హదయ అంతంగంలో నిండుగా నింపుకొని ప్రేమ అలల ఊటలను ఊరించాడు ఉప్పరి తిరుమలేష్. ఒక్కోక్క జ్ఞాపకాన్ని మొగ్గలలోకి ఒంపి ప్రేమామతాన్ని పంచాడు.తన హదయం పొద్దుమీద పొడిచే వేకువ జాము వెన్నెల తన ప్రేయసే అని, ఆమెని అక్షరాలతో ప్రేమభిషేకం జేసిండు. రాలిపోయిన గత జ్ఞాపకాలను ఒక్కోక్కటిగా తన మదిలోంచి తెంపి ప్రేమతోటలో మొగ్గలుగా పూయిస్తుండు.ఒక మొగ్గలో ఇలా అంటడు.
తాను ప్రేమలేఖ అవుతూ
నా రూపురేఖలను మార్చింది
నీ ప్రేమలేఖ నా జీవిత రేఖ
తాను ప్రేమకు గుర్తుగా పువ్వు ఇస్తేనే పానాన్ని పండులా కోసిస్తం.ప్రేమలేఖను ఇస్తే, ప్రేమను ఆమోదిస్తే, ఆమెనే తన జీవిత భాగస్వామిగా ఎవరైన ఊహించుకుంటరు. లేఖలకు కాలం చెల్లిపోయింది కానీ , స్మార్ట్ ఫోన్ లు రాకముందు ఎన్నో ప్రేమ హదయాలు ప్రేమలేఖలకై కనులను పువ్వుల్ల విచ్చుకోని ఎదురుచూసేవాళ్ళు. కవి కూడ అలాంటి లేఖకై ఎదురుచూసిన దశ్యం ఈ మొగ్గలో కనిపిస్తుంది.
ఉప్పరి తిరుమలేష్ ఇప్పటికే ''చిరు మొగ్గలు'' ''బతుకమ్మ మొగ్గలు'' వంటి సామాజిక అస్తిత్వ మొగ్గలు తెలంగాణ సమాజానికి అందిచిన మొగ్గల కవిగా సుపరిచితుడే . ''తొలకరి జల్లు'' లాంటి వచన కవిత్వ సంపుటి రాయడం జరిగింది. భీంపల్లి శ్రీకాంత్ గారు ఏ నిమిషాల్లో మొగ్గలకు పాదులు తీసి బీజం వేశారోగాని తెలుగు నేలంతా మొగ్గలు విచ్చుకొని పరిమళాలను పంచుతున్నాయి . ప్రేమ కలవరింతలో కవి కలం, ఒక స్వప్నవేణువై హదయ వీణను మీటుతుంది.
తాను ఒక స్వప్నమై నన్ను చేరి
చిరకాల నేస్తమై ఎదలో నిలిచింది
కలల చేరి కలకాలం నిలిచేది ప్రేమ
కనులనిండ కలయై ఎద సరస్సులో చేరి, నిత్యం నా నీడై నా వెంటే నడుస్తుందటడు. ప్రతిక్షణం కండ్లల్లో ప్రేమ మొగ్గై పూసి అందరినీ మరిపించే గుండె తోడైందంటడు తిరుమలేష్.
నీ ధ్యాసలోనే ప్రేమ మొగ్గల సంపుటి నిండా ఆర్తి ఉంది . ఆమె కోసం పడిన తపన ఉంది. ఆమె దూరమైనప్పడు కండ్లనిండ సెలయెరై దుంకిన దుఃఖమున్నది. ఆమెను దేవతను జేసి ప్రపంచమంతా ప్రేమ విహారం జేసిన సందర్భాలున్నాయి. తీపి జ్ఞాపకాల సుట్టు వాలిన మనసుంది. ఇలా ఉప్పరి తిరుమలేష్ అనుభవాలు హదినిండ పుష్పించిన ప్రేమ మొగ్గల మకరందాన్ని ఆస్వాదించాలంటే కనులను పువ్వుల్లా విప్పి చదవండి. మీ మదిని స్పర్శిస్తది . ఆత్మీయ మిత్రుని ప్రేమతో అభినందిస్తూ మరేన్నో మొగ్గలు నీ మౌనం నుండి పుట్టాలని కోరుకుంటున్నాను.
(నీ ధ్యాసలోనే.. (ప్రేమ మొగ్గలు), రచయిత : ఉప్పరి తిరుమలేష్, పేజీలు : 40, వెల : రూ.30/-, ప్రతులకు : ఉప్పరి తిరుమలేష్, ఇం. నెం. 11 - 11, శ్రీకృష్ణ నగర్, అమరచింత మండల కేంద్రం, వనపర్తి జిల్లా - 509130.)
- బోల యాదయ్య,
సెల్: 9912206427