Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు. వాటి వాటి కాలాలను బట్టి వస్తుంటాయి. అలా వచ్చే సీజనల్ ఫుడ్స్ చాలానే వున్నాయి. అయినప్పటికీ కొన్నింటిపైన ఎక్కువగా ఇష్టపడరు. ప్రత్యేకించి శ్రద్ధ పెట్టరు. అలాంటి వాటిలో ఒకటే పచ్చి బఠాణీ... సీజన్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ బఠాణీలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈఈ అధిక మొత్తంలో ఫైటో న్యూట్రియెంట్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
ఈఈ ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటి యాక్సిడెంట్స్ వల్ల రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.
- ప్రోటీన్, ఫైబర్ పోషకాలు ఎక్కువ.
- కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఉపయోగించవచ్చు.
- ఎముకల పటుత్వానికి దోహదం చేస్తాయి.
- ఒమెగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
- ఆల్జీమర్స్, ఆర్థ్రరైటిస్ సమస్యలకు చెక్ పెట్టేందుంకు ఇందులోని పోషకాలు దోహద పడతాయి.