Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం దాల్చిన సమయంలో మామూలు రోజుల కంటే ఎక్కువ న్యూట్రీషియన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తుంటారు. అంతేకాదు, తీసుకోనే ఆహారం పట్ల జాగ్రత్త కూడా తప్పనిసరి.. సహజరగా బొప్పాయి, పైనాపిల్, ద్రాక్ష వంటివి తినకూడదని ఆంక్షలు పెడుతుంటారు. మిగిలిన ఫ్రూట్స్ పట్ల ఎక్కువ ఆంక్షలు ఉండవు. అలాంటిదే బేరి పండు.. ఇది సీజనల్‌గా అందు బాటులో ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి9, కె, సి, ఎ లు ఎక్కువ. క్యాల్షియం, కోబాల్ట్, కాపర్, జింక్, ఐరన్, పొటాసియం, ఫాస్పరస్, పెక్టిన్, ఫైబర్, సల్ఫర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని తినేపుడు కాస్త జాగ్రత్త అవసరం. శుభ్రంగా కడిగి, బ్యాక్టీరియా, ఇతర మైక్రోబ్స్ లేకుండా జాగ్రత తీసుకోవాలి. ఇక వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం...
మలబద్దక నివారణకు : బేరిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం నివారించడంలో బాగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, బిపి, కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుంది.
ఆకలిని తగ్గించడంలో... : ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల తియ్యదనంగా ఉంటాయి. దీని వల్ల ఇతర ఆహారాల మీద ఆసక్తి, స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది.
శక్తి కోసం : ఇది తక్కువ ఫ్యాట్ కలిగిన పండు మాత్రమే కాదు, శక్తిని పెంచేదిగా ఉపయోగపడుతుంది. ఒక ఫ్రూట్లో 100 క్యాలరీలు వుంటాయి. కాబట్టి, గర్భిణీలకు అవసరమయ్యే క్యాలరీలు ఒక పండు ద్వారా పూర్తిగా అందుతాయి.
ఎముకల దృఢత్వం కోసం... : కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే మినిరల్స్ ఎముకలకు కావల్సిన బలాన్ని చేకూరుస్తుంది.
గుండెకు.. : పొటాషియం ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. తల్లితో పాటు బిడ్డకు కూడా కావాల్సిన మినరల్స్‌ను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇన్ఫెక్షన్స్ నివారణ : ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, బ్రొంకైటిస్, నిద్రలేమి, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది.
ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవచ్చు.