Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబ్‌స్ట్రాక్ ఐటీ జీవితాలకి నానీల ఇంప్లిమెంటేషన్ ''సాఫ్ట్వేర్ నానీలు''.“Softwareµµ is a collection of instructions and data that tell a computer how to work” అని సాఫ్ట్‌వేర్‌కు నిర్వచనం.అయితే ఈ నిర్వచనాల వెనుక, మనకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి పిక్సల్ వెనుక ఎన్నో మెదళ్ల కలబోత, ఎంతోమంది మనుషుల శ్రమ, చాలా ఏండ్ల కషి, మహౌత్కష్ట పరిణామక్రమం ఉందని చలా తక్కువ మందికే తెలుసు. ఇవన్నీ గుర్తు చేయడానికే మన భాషలో, మన మాండలికంలో కుడికాల వంశీధర్ 'సాఫ్ట్వేర్ నానీలు' సంపుటి తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్ పరిభాషలో అదొక ప్రోడక్ట్ లాంచ్.
కీబోర్డ్ పెదాలమీద మునివేళ్లతో ముద్దులు పెడుతుంటాం. మేనేజర్ల అత్యుత్సాహానికి, క్లయింట్ అమాయకత్వానికి మధ్యలో ఎక్కడో నలిగిపోయే అన్యాయపు బ్రతుకులు బ్రతుకుతుంటాం. మా కష్టాలు, సుఖాలు అన్నీ అందరికంటే బాగా నిత్యం మమ్మల్నే చూస్తున్న ఆ కంప్యూటర్ స్క్రీన్‌కి, ఇంక్రిమెంట్ మీటింగ్‌లో అన్నీ విని చివర్లో అర్థంకాకుండా నవ్వే హెచ్ఆర్లకు, అస్తవ్యస్తంగా అడిగినా విసుక్కోకుండా సమాధానం చెప్పే గూగుల్‌కి మాత్రమే తెలుసు. ఇదిగో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నానీలు పుస్తకం చదివినవాళ్ళకి కూడా తెలుస్తుంది.
మేము అర్ధరాత్రి అపరాత్రి అంటూ లేకుండా అద్దాల అవతల క్లయింట్‌తో కాన్ఫరెన్స్కాల్ మాట్లాడుతోనో, ఆన్సైట్ కోసం టీం లీడర్లకు పార్టీ ఇస్తూనో మేల్కొనే ఉంటాం. అయిదు రోజులు మా మెదళ్ల నుంచి కారే +దీల కొద్దీ స్వేద్యాన్ని మేము మాత్రమే చూస్తాం. అలాంటి విషయాలను ఈ నానీల సంపుటి ద్వారా అందరితో పంచుకోగలుగుతున్నాం. .
''మగతలో/కీప్యాడ్‌పై చెయ్యి పడింది/అల్లుకున్న/అక్షరాలు కవిత్వమైనై'' అంటూ మొదలుపెట్టాడు వంశీ తన నానీల సాఫ్ట్‌వేర్‌లో. ''ప్రేమ గుండెల్లో పుట్టాలి. గూగుల్‌లో కాదు... జ్ఞాపకాలు మనసులో ఆర్కైవ్ అవుతాయి.'' ఇలాంటి మాటలు అనడంలో ఎంత భావుకత. ఈ నానీల ఫైల్ ఓపెన్ చేస్తే ముందుగా ఆకట్టుకునే నానీ ''కొన్ని పరిచయాలు / దూరమవుతాయి/ వాడని పాస్వర్డ్ /మరచిపోయినట్టు''. నిజమేగా ఎన్ని మెయిల్ ఐడీలను, ఎన్ని స్నేహాలను కాలపుదండేనికి వేలాడదీసి ఇటువైపు వచ్చేసాం. కీబోర్డ్ కలంతో కంప్యూటర్ కాగితాల్ని నింపే నేటి చేతుల్ని చూపిస్తూ ''వందల డాక్యుమెంట్లు రాస్తాడు పెన్నూ కాగితం చేతిలో లేకుండానే'' అంటాడు.
ఒక నానీలో కళ్లు మాట్లాడుకోవడానికీ, వైర్లెస్ టెక్నాలజీకి కవితాత్మకమైన లంకె పెడతాడు వంశీ. మరొక నానీలో ''సాంకేతికత/ చంద్రమండలం చేరుకుంది/ భూగోళం/ దుఃఖసముద్రమయ్యింది'' అంటూ బాధపడతాడు.
''గూగుల్‌లో/ అన్నీ దొరుకుతున్నాయి/ ఆమె దుఃఖానికి/ కారణం తప్ప'' ఎంత గొప్ప భావన ఇది. ఎంత మంచి కవిత్వం ఇది. ఇది చదివాక అందరూ గుండెల్లో వెతుక్కోవాలి, గూగుల్‌లో కాదు. ''కష్టాలనుదాటే వేతనజీవికి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఉండదంటాడు'' కవితాత్మకంగా ఒకనానీలో.
''కంప్యూటర్లను కలుపు తుంది / అంతర్జాలం / భావాలు కలవడమే /జటిలం''. అయితే అదే అంతర్జాలం నెమ్మదిస్తే భావాలు మిశ్రమమై గుండె వేగమవుతుంది అదికూడా చమత్కరిస్తాడు. ''రోజుకూలీకి /ఎక్కువ /వెట్టిచాకిరీకి తక్కువ/ ఇదండీ సాఫ్ట్వేర్ ప్రపంచం'' అదండీ విషయం ఒక్కమాటలో తేల్చేసాడు వంశీ. అర్థమైందిగా మా జీవితం. చురకనానీలు వచ్చి మేమున్నాము అంటాయి అప్పుడప్పుడు. ''మూడు పదులకే/ఇరవై పేటెంట్స్ సాధించాడు/ఇక్కడ/ పేరెంట్స్‌ని మరిచాడు'' చాలామంది భుజాలు తడుముకుంటారేమో. వంశీ నానీలు వినోదాత్మకంగా కూడా ఉంటాయి. మచ్చుకు ''వారి ఆతిధ్యం/ గొప్పది/ టీ టిఫిన్ కన్నా ముందే/ వైఫై పాస్వర్డ్ ఇచ్చారు'', ''ఇతరుల దష్టిలో / సాఫ్ట్వేర్ ఉద్యోగులు / స్వదేశంలోనే / ప్రవాసులు'', ''మీ ఫోన్ అందుకోలేదు / మన్నించాలి / ఫేస్బుక్లో బిజీగా ఉన్నా / గమనించాలి'' ఇలా సాగుతాయి.
ఇంకా ఈ నానీల్లో కంప్యూటర్ పనిలో బడి బిడ్డ ఏమైపోతాడో అని అవ్వ రందిబడుతుంది. బ్రహ్మాండ్నా చూపించే స్క్రీన్ దర్పంగా నిలబడుతుంది. బగ్స్ సుపరిమళాల పువ్వులై పూస్తాయి నిండిన జంక్ ఫైల్స్ సహనం తప్పుతాయి. బ్లూటూత్ తనలోతానే మాట్లాడుకుంటుంది. ఫేస్బుక్ చెదలు మస్తకాలను కుడతాయి. ఇంకారాని మీసాలు వీసాలై ఎగిరి పోతాయి. ఇలా ఇంకా ఎన్నో చేస్తాయి. ''కమలం కాదు/కలువా కాదు/పగలూ రాత్రీ విచ్చుకుంటుంది/ లాప్టాప్'' అంతేగా మనుషులు సాయంత్రానికి బడలికతో వడిలిపోతే కంప్యూటర్ షిఫ్ట్ బటన్ నొక్కుకుంటుంది.
ఈ సంపుటి అంతా సాఫ్ట్వేర్ జీవుల జీవితగాథనూ, కంప్యూటర్ పురుగుల ఆత్మకథను వంశీ ఒక్కడే రాశాడు. Incognito modeలో రహస్యచేదనోద్యమం చేసి బెడిసికొట్టిన సాఫ్ట్వేర్ బంధాలను దాటి ఆత్మీయతా ఫవర్ బ్యాంక్‌లను కనెక్ట్ చేసుకుంటాడు. అయితే ఈ పుస్తక రూప కల్పన కోసమే వంశీ ప్రత్యేకంగాjava language లో సాఫ్ట్వేర్ తయారుచేసి సాఫ్ట్వేర్ నానీలు పేరుకి సార్థక్యం తీసుకొచ్చాడు. ఈ పుస్తకం వంశీలో ఉన్న రెండురకాల ఉత్కష్ట ప్రతిభలకు ప్రత్యక్ష సాక్షం. మొదటిది కవిత్వం అయితే రెండవది ఱఎఎవఅరవ immense coding knowledge.
సాఫ్ట్వేర్ నానీలు
రచన: కుడికాల వంశీధర్
పేజీలు : 80,
వెల: : 120,
ప్రతులకు :
కుడికాల వంశీధర్,
2-108/7/38/1, ఫ్లాట్ 38,
బి.ఎల్. నగర్, స్ట్రీట్ 3% 4, బోడుప్పల్, బంగారు మైసమ్మ గుడి దగ్గర, హైదరాబాద్
- గౌతమ్ లింగ, దక్షిణాఫ్రికా,
+ 27 745657589