Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ కొలనులో వర్షించిన ''భావ తరంగాలు''
కవి : సురేంద్ర రొడ్డ
పేజీలు : 160- వెల: 160
ప్రతులకు : కవి పేరుతో
ఇ.నెం. : 507,
గరుడ గేట్వే అపార్ట్మెంట్స్
ఉప్పరపల్లి, చెక్పోస్ట్, తిరుపతి, ఏపీ.
సెల్: 9491523570
మొహమ్మద్వలీ లాంటి గజల్ కవులు (1667-1717) ప్రేమ గురించి ఆనాడే అద్భుత కవిత్వం వెలువరించారు. మన తెలుగులో కృష్ణశాస్త్రి, తిలక్ లాంటి వారు ఒక తరాన్ని ఉర్రూతలూగించారు. ఈనాటి యువతకి చక్కటి ప్రేమ కవిత్వం సందేశం రాసారు. ఈ కవితల్లో, ప్రేమించలేదని యాసిడ్ దాడులు, కత్తులతో నరకడాలు, చూస్తున్న కాలంలో నిజమైన ప్రేమికులు ఎలా ఉండాలో చెబుతారు. కవి.
డా|| కంపెల్లె రవిచంద్రన్/ డా|| కలువగుంట రామమూర్తి, లాంటి సాహితీవేత్తల అభిప్రాయాలూ పాఠకుల్ని ప్రేమభావాల్లోకి కొనిపోతాయి. ''భావ తరంగాలు'' లోని కొన్ని ముఖ్య కవితలు మచ్చుకి చూద్దాం!
మరచిపోను/ నిన్ను మరణం వరకూ-
శ్వాసిస్తుంటాను/ నీ జ్ఞాపకాన్ని' అంటారు కవి. అదీ భార్య, భర్తల బంధం. చలం భావాజాలం కనిపించే కవితలు కొన్ని ఆకర్షిస్తాయి. యువ పాఠకుల్ని (పేజీ. 55) క్షణమాగు, ప్రియా// నీవు నడచుదారంతా - నా హృదయాన్ని, తివాచీగా పరచనీ అంటారు. నేటియువ ప్రేమికుల్లో వుండేది చాలా వరకు ఆకర్షణే - వ్యామోహమే అంటారు. ఒక కవితలో- తత్త్వికత జోడిస్తూ రాసిన, ఈ కవిత ఆలోచింపచేస్తుంది. (పేజీ.133)
ఆకర్షణే తప్ప / ఆర్థ్రత లేదు- వ్యామోహమే తప్ప/ ఆప్యాయత లేదు. అవసరమే తప్ప/ అనురాగం లేదు! ఓ ప్రేమా నీవు ఎక్కడమ్మా? అంటారు. వసివాడని పసిపాపలమై / కొన్ని రోజులైనా/ మనం బ్రతకాలి అనే ఆకాంక్ష గొప్పది. (పేజీ . 152), స్త్రీ మూర్తిని ప్రేమతో- ఆరాధనా భావంతో ఉన్నతంగా చూడాలి అనే ఈ ''భావ తరంగాల్లో'' ఎన్నో మంచి కవితలున్నాయి.
- తంగిరాల చక్రవర్తి
9393804472