Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెన్నెల వేళ యమునాతీరంలో వినిపించే గోపాలుని వేణుగానమే సంగీతమంటే. రాసక్రీడల్లో మునికి తేలిన రాధ ప్రాణమే సంగీతమంటే. స్వరాలతో సావాసం చేస్తూ, అందులోనే సంతోషాన్ని చూస్తూ, మనసంతా ప్రేమావేశం కలిగి, ఓ కమ్మని సందేశాన్ని ఆస్వాదిస్తూ ఉండే యవ్వనమే ఓ సంగీతం.
వేసవి అనే కన్య వేడిమితో రగిలిపోయి, శిశిరంలా రాలిపోయి ఉన్నప్పుడు ఆ కన్యకు వసంతాల పచ్చదనాన్ని అద్దేదే సంగీతం. అంటే కోయిల స్వరమే వసంతమై వచ్చి చేరుతుందని ఇక్కడ అర్థం. కోయిల స్వరంలోనూ సంగీతముంది కదా అని ఇక్కడి భావన. సూర్యుడు తన ప్రతాపం చూపించినపుడు, ఈ భూమికే దాహం వేసి అల్లాడిపోయినపుడు ఆ దాహాన్ని తీర్చడానికి ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఆ అమతవర్షంలోను సంగీతనాదముంది.
లలితకళల్లో సంగీతానికి విశిష్టమైన స్థానముంది. ఆపాతమధురమైన సంగీ తానికి పశుపక్ష్యాదులు సైతం పరవశించి తలలూపుతాయి. కఠినమైన బండరాళ్ళు కూడా సంగీతానికి కరిగి నీరై పారు తుంటాయి. దిక్కులను కదిలించే, మేఘా లను కరిగించే మహత్తరశక్తి సంగీతానికుంది. సామవేదంలో చెప్పినట్టు సంగీతకళ ఆకలిని, దాహాన్ని కూడా తెలియనివ్వదు. మనసును ఆనంద పారవశ్యంలో ముంచేస్తుంది. హదయం ఆవేదనతో ద్రవించే వేళల్లో సంగీతం వింటే ఉపశమనం కలుగు తుంది. అలాంటి గొప్ప శక్తి కలిగిన సంగీతాన్ని గూర్చి కీర్తిస్తూ సాయిశ్రీహర్ష ఒక పాట రాశారు. 2007లో వచ్చిన 'పాట' సినిమాలోనిదీపాట. సినిమా పేరే సంగీతాత్మను సూచిస్తుంది. సంగీతాంశం ప్రధాన ఇతివత్తంగా కలిగిన సినిమా ఇది.
వెన్నెల వేళ యమునాతీరంలో విని పించే గోపాలుని వేణుగానమే సంగీత మంటే. రాసక్రీడల్లో మునికి తేలిన రాధ ప్రాణమే సంగీతమంటే. స్వరాలతో సావాసం చేస్తూ, అందులోనే సంతోషాన్ని చూస్తూ, మనసంతా ప్రేమావేశం కలిగి, ఓ కమ్మని సందేశాన్ని ఆస్వాదిస్తూ ఉండే యవ్వనమే ఓ సంగీతం. ఎప్పటికి చెదిరిపోని తీయని భావనలతో నిండి ఉన్నదే సంగీతం. అలాంటి సంగీతాన్ని వింటూ పులకించి పోవడమన్నది ఈ జన్మకు దొరికిన అమతవరమని ఈ పాట ద్వారా తెలుస్తుంది.
యువతరాన్ని ఓ కుదుపు కుదిపేసే మహత్తరశక్తి సంగీతానికే ఉంది. మనసులోతుల్లో దాగి ఉన్న ప్రేమను కదిలించే శక్తి కూడా సంగీతానికే ఉంది. ఆ మన్మథుడు విసిరే పూలబాణమూ సంగీతానికి ప్రతీకయే. అంతే కాదు అన్నింటికి అదే కేంద్ర బిందువు. అంత ర్యామికి ఆత్మబంధువూ అదే. సర్వకళలకు సంగీతమే మూలం. శ్రుతిలయలతో మనల్ని ఓలలాడించే అద్భుతమైన సంగీతానికి నమస్కరించాలి. వినాలే గాని ఈలోకంలో అణువణువున నిండి నిబిడీకతమైనది సంగీతం. అలాంటి సరిగమల సంగీతానికి నిరంతరం అభిషేకం చేయాలనిపిస్తుంది.
వేసవి అనే కన్య వేడిమితో రగిలిపోయి, శిశిరంలా రాలిపోయి ఉన్నప్పుడు ఆ కన్యకు వసంతాల పచ్చదనాన్ని అద్దేదే సంగీతం. అంటే కోయిల స్వరమే వసంతమై వచ్చి చేరుతుందని ఇక్కడ అర్థం. కోయిల స్వరంలోనూ సంగీతముంది కదా అని ఇక్కడి భావన. సూర్యుడు తన ప్రతాపం చూపించినపుడు, ఈ భూమికే దాహం వేసి అల్లాడిపోయినపుడు ఆ దాహాన్ని తీర్చడానికి ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఆ అమతవర్షంలోను సంగీతనాదముంది. అది చల్లదనమై, ప్రశాంతస్వరమై అంతటా ప్రసరిస్తుంది. సత్యసుందరమై, శుభాలను కూర్చి నిత్యసంతోషమై విరాజిల్లుతోంది. మధు వులు నిండిన సముద్రమై, కలియుగ చలివేంద్రమై పరవశింపజేసేది, ఆహ్లాద పరిచేది, నిత్యశోభలతో వినబడేది, అంతరాత్మకు మాత్రమే కనబడేది ఒక్క సంగీతమే.
సంగీతాల్లో కూడా హిందుస్థానీ, శాస్త్రీయం, కర్ణాటక, జానపదం ఇలా ఎన్నో శాఖలున్నాయి. ఏ స్వరస్థానమైనా సంగీతపాండిత్యానికి ఆస్థానమల్లే వెలిగేది హిందుస్థానీ. జానపద జావళీలు వంటి వన్నీ సంగీతమనే తోటలోని జాజికొమ్మలే. జజ్జనకర అంటూ చిందులేసే జాతర్లల్లో కూడా ఉరకలెత్తించే సంగీతముంది. అది ఏ విధాన అయినా, ఏ శాఖ అయినా మనసులను అలరించి, మనలను మైమరపింపజేసే సమ్మోహన మంత్రధ్వానం సంగీతం.
త్యాగరాజు కతులలో, క్షేత్రయ్య పదాలలో మారుమ్రోగేది, వారి భక్తిభావనలల్లో ఆరాధ్యపథమై సాగేది, వివిధ తాళలయల, గతుల, శ్రుతుల సమాహారమై చెలరేగేది, ఓంకారనాదమై ధ్వనించేది, సకలజగత్తునే తన మెడలో హారంగా దాల్చేది ఒక్క సంగీతం మాత్రమే. సంగీతాన్ని విని, పులకించిపోని మనిషంటూ ఉండడు. ఒకవేళ ఉంటే వాడు మనిషే కాదు. జడత్వాన్ని కూడా చలింపజేసేది సంగీతం. అలాంటి సంగీతామతాన్ని పంచిపెట్టిన మధురాతి మధురమైన పాట ఇది. సంగీతం గొప్పదనాన్ని సాహిత్యంలో అభివ్యక్తీ కరించి, దానికి సంగీతాన్నీ మేళవించి అందించిన అపురూపమైన, అనిర్వచనీయమైన పాట ఇది.
పాట
వెన్నెల యమునాతీరంలోన వేణుగానం సంగీతం/రాతిరివేళల రాసక్రీడల రాధప్రాణం సంగీతం/స్వరమే సావాసం పరమే సంతోషం జలమే దరహాసం పరమేను నీలాకాశం/మనసంతా ప్రేమావేశం మనసైన ఓ సందేశం యవ్వనమే సంగీతాంశం అదరని చెదరని సుమధుర కలశం
యువతను కుదిపే ఇంద్రజాలం/మమతను కదిపే మంత్రదండం/ మన్మథుడే విసిరిన బాణం మన సంగీతం/ అంతకు తానే కేంద్రబిందువు/ అంతర్యామికి ఆత్మబంధువు/ సర్వులకు కళలకు నెలవు స్వరజలపాతం/ శ్రుతిలయలే ఆ నాదం అభివందనమందాము/ సరిగమలే ఈ లోకం అభిషేకం చేద్దాము/ వేసవికన్యకు వాసంతాలను పచ్చని కానుకగా పంచేను మన సంగీతం/రవి తన తాపం చూపిన సమయం/ భువికే దాహం వేసిన నిమిషం/ దివి నుంచే అమతవర్షం కురిపించే సంగీతం మనది/ఈ సంగీతం సత్యసుందరం శివమై పొంగే నిత్యసంబరం/ విరితేనెలు చిందే సంద్రం కలిచలివేంద్రం/ ఏ స్థానం అయినా గాని సంగీత పాండిత్యానికి/ ఆస్థానమల్లే వెలిగి అలరించే హిందుస్థానీ/ జానపదము జావళమ్ము జాబిల్లి జాణలమ్ము/ సంగీతతోటల్లో జాజికొమ్మో/ జానపదుల రాతిరమ్మో జజ్జనకర జాతరమ్మో/ సంగీతజాముల్లో జాజుల్లో జేజేలమ్మో/ శ్రీ త్యాగయ్య కీర్తన ఆ క్షేత్రయ్య పదము/ ఆ ఆరాధ్యపథము వివిధ గతుల జతుల శ్రుతుల లయలతో../ ఈ సంగీతం ఆ ఓంకారం/సకలజగతి తన మెడలోని హారం.