Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విషయ సముపార్జనకు క్లాసులు, నోట్సు, మెటీరియల్, డిస్కషన్స్ ఉపయోగపడితే, మాక్ టెస్టులు విషయ సమర్పణకు అవసరమైన నైపుణ్యాన్నిస్తాయి. వి ఆర్ ఏ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షల దాకా గత ప్రశ్న పత్రాలను దష్టిలో ఉంచుకొని సిలబస్ ఆధారంగా ప్రశ్నల వెయిటేజ్ ఆధారంగా మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించి ఇలా సంస్థలు నిర్వహించే నమూనా పరీక్షలే
అభ్యాస పరీక్షలు.
చదువులు పూర్తి అవడంతోనే జీవితంలో స్థిరపడేందుకు యువతీయువకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబం నుంచి సంక్రమించిన వత్తి, ఇష్టమైన వ్యాపారం, నేర్చుకున్న పనుల్లో స్థిరపడేవాళ్లు కొందరైతే, కచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకునేవాళ్లు మరికొందరు. ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువకులు కెరీర్ గైడెన్స్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తుంటారు. రాష్ట్ర కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇతర ప్రభుత్వ రంగసంస్థలు తమ రిక్రూట్మెంట్ కేలండర్ వారీగా నోటిఫికేషన్లు వెలువరిస్తుంటాయి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను దష్టిలో వుంచుకొని కోచింగ్ సెంటర్లు శిక్షణా తరగతులను ప్రారంభిస్తాయి. ఈ సందర్భంలో కోచింగ్ సెంటర్లు, కాంపిటిటివ్ ఎక్జామ్స్ మెటీరియల్ విక్రయదారులు పబ్లిషర్లు ఉద్యోగార్థుల కోసం చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రధాన నగరాల్లోనే కాకుండా జిల్లా తాలూకా మండల కేంద్రాల్లో పొద్దున్నుంచి రాత్రి దాకా కోచింగ్ క్లాసుల పేరిట అభ్యర్థులు ఎదుర్కొనే ఒత్తిడి, రాకపోకల్లో చేసే హడావిడి చెప్పతరం కాదు. ఎందుకంటే పోటీ పరీక్షలు ఒక రకంగా యుద్ధం లాంటివే. ఒక ఉద్యోగానికి వంద నుంచి వెయ్యిమంది పోటీపడుతుంటారు. కొన్ని సార్లు పోటీ లక్షల్లో కూడా ఉంటుంది. విజయం సాధించాలంటే ఎంతటి ప్రతి భావంతులైనా దరఖాస్తు చేసుకోవడం దగ్గర మొదలుకొని ఆఖరుదైన ఇంటర్వ్యూ దాకా అనేక వ్యూహాల (విన్నింగ్ స్ట్రాటజీస్)ను అభ్యర్థులు అనుసరిస్తుంటారు. వీటిల్లో పరీక్షలకు సన్నద్ధం (ప్రిపరేషన్) కావడమనేదే ప్రధాన వ్యూహం. ప్రిపరేషన్ భాగంగానే అభ్యర్థు లందరూ మాదిరి పరీక్షలు లేదా అభ్యాస పరీక్షలు (మాక్ టెస్టులు) తప్పక రాయాల్సి వుంటుంది.
మన దేశంలో పబ్లిక్ ప్రైవేట్ అన్నీ కలిపి వెయ్యి యూనివర్సిటీలున్నాయి. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు 66లక్షలు, పోస్టుగ్రాడ్యుయేట్లు 15లక్షలు మొత్తం 81 లక్షలమంది అభ్యర్థులు ఈ విశ్వవిద్యాలయాల నుంచి ఉత్తీర్ణులై బయటకువస్తున్నారు. వీళ్ళతోపాటు ఓ ఎనమిది కోట్లమంది పట్టభద్రులు ఇప్పటికే ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారు. అంటే ఇంచుమించు ఓ పది కోట్లమంది దాకా జాతీయ స్థాయిలో జరిగే వివిధ పరీక్షలకు పోటీపడుతుంటారు. వీళ్లే మళ్లీ ఎవళ్ల రాష్ట్రంలో వాళ్లు రాష్ట్రస్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరవుతుంటారు. అది ఏ స్థాయి పరీక్ష అయినా ఏ ఉద్యోగానికి సంబంధించిందైనా విజయం సాధించాలనే తపన అభ్యర్థులకుండాలి. ప్రిపరేషన్ అంటే క్లాసులు వినడం, సంబంధిత అకాడమీ పుస్తకాల్లోంచి నోట్సు రాసుకోవడం, మెటీరియల్స్ తిరగేయడం, గ్రూప్ డిస్కషన్స్ మాత్రమే కాదు. వీటికి తోడు అభ్యాస పరీక్షలు లేదా మాదిరి పరీక్షలు రాయడం ప్రిపరేషన్లో అత్యంత కీలకం. వివిధ పోటీ పరీక్షల్లో కంటెంట్ ప్రిపరేషన్‌తో పాటు మాక్ టెస్టులు వీలైనన్ని ఎక్కువ రాసినందునే తాము నియామకం పొందగలిగామని విజేతలు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో 'మాక్ టెస్టు'ల గురించిన సంపూర్ణ అవగాహన ప్రతి ఉద్యోగార్థికీ అవసరం. తాము రాసే పరీక్ష ఏదైనా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను రెండు భాగాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. మొదటిది విషయ సముపార్జన (Acquiring of content), రెండోది విషయ సమర్పణ (Presentation of content). విషయ సముపార్జనకు క్లాసులు, నోట్సు, మెటీరియల్, డిస్కషన్స్ ఉపయోగపడితే, మాక్ టెస్టులు విషయ సమర్పణకు అవసరమైన నైపుణ్యాన్నిస్తాయి. వి ఆర్ ఏ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షల దాకా గత ప్రశ్న పత్రాలను దష్టిలో ఉంచుకొని సిలబస్ ఆధారంగా ప్రశ్నల వెయిటేజ్ ఆధారంగా మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించి ఇలా సంస్థలు నిర్వహించే నమూనా పరీక్షలే అభ్యాస పరీక్షలు. ఈ మాక్ టెస్టులు ప్రధానంగా అభ్యర్థులకు తాము సముపార్జించిన విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించకోవడానికి, టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి, పరీక్ష రాసేటప్పుడు ఏరకమైన పొరపాట్లు తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ముంబయికి చెందినTEDx Speaker, CATKing Educare Founder & CEO సుమిత్ సింగ్ గాంధీ మాక్ టెస్టులను 'పోటీపరీక్షల ఛేదనాస్త్రాలు'గా, 'ముందు జాగ్రత్తల కోశం'గా అభివర్ణించారు. మాక్ టెస్టులు రాయడం వలన అభ్యర్థులకు ఏడు రకాల ప్రత్యేక ప్రయోజనాలుంటా యంటున్నారు సుమిత్ గాంధీ. అవి 1. పరీక్ష రోజుకు మీకో ఐడియా వస్తుంది (Get an Idea of D Day), 2.ప్రిపరేషన్ మీద ప్రతిభా ప్రదర్శన పట్ల విశ్లేషణా సామర్థ్యం అబ్బుతుంది (Analyse preperation and performance),, 3.విభిన్న వ్యూహాలపై పట్టు వస్తుంది (Try different strategies), 4.సమయ స్ఫూర్తి/ సమయ సద్వినినియోగం పట్ల అవగాహన ఏర్పడుతుంది(Efficient use of time) 5.బలాలు బలహీనతలు ఏమిటో తెలుస్తాయి (Know your mastery and areas where you fall short), 6.పరీక్షల భయాన్ని తత్తరపాటును పోగొడతాయి (Reduces pre-exam nervousness), 7. పరీక్ష పరీక్షకు అభ్యర్థి సాధించిన ప్రగతిని పరిరక్షిస్తాయి (Keep a track of progress). వీటికి తోడు పరీక్ష గదిలో ఎదురయ్యే ప్రతి అవాంతరాన్ని సులభంగా ఎదుర్కొనే శక్తి (capacity)ని, యుక్తి (Logic)ని కూడా మాక్ టెస్టులు ఇస్తాయంటారు సుమిత్ గాంధీ. పరీక్ష రాయాలనే ఉత్సాహాన్ని (Ease of participating) కల్పించడంతోపాటు పరీక్షలను శక్తివంతంగా ఎదుర్కొనే (Power to participate)అనే మానసిక స్థాయిలను మాక్ టెస్టులు కల్పిస్తాయి. ఆత్మవిశ్వాసం (Self Confidence), స్వీయౌన్నత్యం (Self Esteem) మాక్ టెస్టుల ద్వారా యువతకు అలవడతాయి. విన్నింగ్ స్ట్రాటజీస్లో అతిముఖ్యమైన The goodness of fitness మాక్ టెస్టుల మూలంగా సిద్ధిస్తుంది. If you dont pass the mock test, you will find it difficult to pass the real exam అనే పోటీపరీక్షల శిక్షణా నిపుణుల సునిశిత వాక్కును యువత సదా తమ ఎదుగుదలకు సానుకూలంగా స్వీకరించాల్సి వుంది.
Practice makes man perfect అనే సూక్తి మనం వింటున్నదే .మాక్ టెస్టులు Trail Exams కావడం వల్ల ఒకే విషయం పై ఎన్నిరకాల ప్రశ్నలు ఏవిధంగా అడుగుతారో తెలుస్తుంది. ఏ పోటీ పరీక్షలోనైనా అడిగే ప్రశ్నల్లో 1.విస్పష్టమైన ప్రశ్నలు (Open questions),, 2.పరిశోధనాత్మక ప్రశ్నలు (Probing questions), 3.ప్రధాన ప్రశ్నలు (Leading questions), 4. బరువైన ప్రశ్నలు (Loaded questions), 5.నిలువరించే ప్రశ్నలు (Funnel questions), 6.తిప్పి అడిగే ప్రశ్నలు (Recall and process questions), 6.పాండిత్య ప్రశ్నలు (Rhetorical questions) ఉంటాయి. వీటిల్లో వేటికి ఎట్లా సమాధానాలు రాయాలో అర్థమవుతుంది. మాక్ టెస్టులు అభ్యర్థులకుproblem solving techniques and toolsగా పనికొస్తాయి.
ప్రశ్నల అంతరార్థాన్ని గుర్తించడం, తార్కిక శక్తి(Logical skills)ని ఉపయోగించడం ద్వారా అభ్యర్థులకు ఉత్తమ ఉద్వేగ మేధస్సు (High emotional intelligence), నిర్ణాయక శక్తి (Decesion making) పట్టువడుతుంది.ముఖ్యంగా ప్రశ్నలు-సమా ధానాలను సమస్యలు- పరిష్కారాలు (Issues-Solutions) అనే విపులార్థంలో వివేచించుకునే ముందస్తు ప్రక్రియగా మాక్ టెస్టులు అభ్యర్థులను సానబడతాయి. ఒకప్పుడు మాక్ టెస్టులు offlineలో పరీక్షా కేంద్రాల్లోనే మాత్రమే జరిగేవి. ఎక్కడో నగరాల్లో ముఖ్య పట్టణాల్లో నిర్వహించబడేవి. భౌతికంగా వెళ్లడమనేది అభ్యర్థులకు దూరభారం ఆర్థిక భారంతో కూడుకున్నది కావడం వల్ల అనుకున్నంత మంది హాజరయ్యేవాళ్లు కాదు. టెక్నాలజీ ఇప్పుడు onlineలో మాక్ టెస్టులు రాసేందుకు సౌకర్యాలను కల్పించింది. ఇంట్లో కూర్చొని లేదా ఊళ్లో ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని కంప్యూటర్ ద్యారా రోజుకు ఎన్ని పరీక్షలైనా అభ్యర్థులు రాయొచ్చు. పోటీపరీక్షలకు సంబంధించిన సమస్త మానసిక ఆందోళనలు (The pressure to perform, Anxiety disorder, Obsessive - Cumplsive disorder,The fear of failure)ను మాక్ టెస్టులు రాయడం ద్వారా అభ్యర్థులు
సునాయసంగా అధిగమించ గలుగుతారు. పట్టుదలతో శ్రమించి మెదడులో నిక్షిప్తం చేసుకున్న సబ్జెక్టు నంతా అసలు పరీక్షలో తగురీతిన ప్రదర్శించడానికి మాక్ టెస్టులు ఓ రాచ మార్గం. ఉద్యోగి ఎంపికలో ఇంటర్వ్యూ చాలా మటుకు నామమాత్రమే. రాత పరీక్ష (డిస్క్రిప్టివ్ కావొచ్చు, ఆబ్జెక్టివ్ కావొచ్చు)లో సాధించిన మార్కులే ఎంపికలో నిర్ణాయక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మంచి స్కోరు రావడానికిPAI (Perform Analyse Improve అనే Score Keyగా మాక్ టెస్టులు పోటీపరీక్షల్లో సఫలీకతం కావడానికి విద్యార్థులకు ఉత్త మోత్తమ సాధనాలు. యువ కిశోరాలూ! ఉతికిన చొక్కాకు ఇస్త్రీ అవసరమైనట్టు నెలలు సంవత్స రాల తరబడి విని చదివి ఆర్జించిన మీ విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి మాక్ టెస్టులు మంచి ఉత్తేజాన్నీ అద్భుతమైన కాల్పనికతనూ ఇవ్వగలవు. పాల్గొని చూడండి.
- డా|| బెల్లి యాదయ్య, 9848392690