Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత కవిత్వం అంటూ టాగ్లైన్ ఇచ్చారు గాని వాస్తవంలో ఇది జ్వలిత కవిత్వం... పాలకుల్ని ప్రశ్నించే తత్త్వం కవిలో ఎల్లప్పుడూ ఉండాల్సిన లక్షణం... లక్ష్యం.... మనల్ని ఆలోచింపజేసే అద్భుత కవితలెన్నో ఈ సంపుటి నిండా ఉన్నాయి. ముల్కి బుక్స్ (నల్గొండ) ద్వారా ప్రచురణ అయిన ఈ కవితా సంపుటిలో కవి వేముల ఎల్లయ్య 1984-2020 సం|| మధ్య రాసిన కవితలున్నాయి. కొన్నింటిని చూద్దాం!. 'గత్తర' అనే కవితలో కవి ఒక చోట ఇలా రాసారు. (పేజీ 264) ''మంత్రుల మతులవ్ అనిల్అంబాని ముఠా మోర్దందా
రిలేయన్స్ ఎగదోపిడి రైతు కుదేల్.../ రైతు బిల్లు పార్లమెంట్ సాక్షిగా గది నల్లచట్టం! సాదా సీదా మనషుల కవాతు ఢిల్లీ గద్దెకదిలల్లో.. అంటారు కవి... అలాగే మరో అద్భుత కవిత ''పిల్లల బాగోతం'' (పేజీ - 76)లో చివరి చరణాలు ఆలోచింపజేస్తాయి.
''అయ్యమ్మ మురిపెం సోలెడు ఒడ్లు దానం! బెల్లం పుట్నాలు కోమటి కొట్టు ఇచ్చింది. బాగోత గమ్మతి పలహారం పంచిన పొరలుగవ్వీ గంతులు గాదులే! లేగదూడల లెల్లాయిలే లెల్లో... బాగోత కవిత్వం వర్థిల్లూ...'' అంటారు.
అలాగే ''ఉపాళి'' (పేజీ -56) కవితలో... ''తెలుగు వీర కాటమ రాజుల కథ ఉపాలి / బీరీ నీడుగుర్రం ఉరికిన నాడాడెక్కే అడుగు పుల్లవి గొడవగోవుల తెగే తలలు- గోసంగి కత్తుల గొడ్ల కాపాడే సైన్స్ ఎత్తులో వీరుడే అంటారు.
'రోహిగ్య' కవిత అంతర్జాతీయ స్థాయిగలది. శరణార్థులపై రాశారు. ''ప్రపంచమే ప్రాణ గొండి ఐక్యరాజ్య సమితా..| సావుకు సంతకం బలిమి పత్ర శాడిస్ట్ ఐక్యత దేవ్లాడిన దొరకని కనికరం మనుషులమింగే / భూమి కుంగే గడియను రోహిగ్యా సనార్తీ'' (పేజీ 51), యింకా ఈ సంపుటిలో 'కటిక తిత్తి','మలినం ఎత్తని కులం', 'అలికిడి అడుగులు' 'విషకౌగిలి', 'కట్టడి', 'జగిలి', 'యుద్ధ గడియా', 'తోలై లేస్తున్న భూమి', 'నిమాషి', 'వాకపల్లి' లాంటి కవితలు చాలా శక్తి వంతమైన భావాల్తో రాసారు. అగ్రకుల దౌష్ట్యం పాలకుల మోసాలు , రాజకీయ పన్నాగాలు... ఫాసిస్ట్ భావాలు... భూస్వామ్య పెత్తనం... ఇలా ఎన్నో అంశాలు కవిత్వీకరించారు.
- తంగిరాల చక్రవర్తి, 9393804472