Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి సష్టించే మనిషి లాంటి మర మనుషులు మనిషి చెప్పేవి చేసినా, వాటికి కూడా కొత్త ప్రపంచం ఉంది అని
తెలిసినప్పుడు ఆసక్తి, తనకు నచ్చే వాటి గురించి పట్టించుకునే వ్యక్తి పట్ల కతజ్ఞత ఉంటుంది అనే భావం ఈ
సినిమాలో ఉంది. సష్టించింది అలెక్స్ అయినా టౌ జూలియాను ఇష్టపడటానికి కారణం టౌ ఇష్టాలను జూలియా
తెలుసుకోగలగడం, ఆదేశాలు ఇవ్వకుండా, టౌను కూడా తన లాంటి మనిషి గానే చూడటం వంటివి ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్‌తో నిర్మితమైన మర మనిషిని కూడా కదిలించగలిగాయి. ఇదే ఈ సినిమాలో కొత్తదనం.
మనుషుల ప్రత్యేక తెలివితేటలు వారి భావోద్వేగ స్పందనలు, వారి మానసిక భావాలను బట్టి మారుతూ ఉంటాయి. మనిషి నేడు సష్టిస్తున్న కత్రిమ తెలివితేటలు మనిషి తెలివికి పరిమితమై రూపొందుతాయి. మనిషి తాను చేయదలుచుకున్న పనిని సులభతరం చేసుకోవడానికి, ప్రగతిని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుకు మళ్ళినా, అది మనిషి సంపూర్ణ తెలివితేటలను పుణికి పుచ్చుకోలేదు. సాంకేతిక తెలివితేటలను అందుకున్నా, ఆదేశాలకు లోబడి వ్యవహరించే ఈ తెలివి కేవలం సష్టించిన వ్యక్తి ఇచ్చిన సమాచారం వరకే పరిమితం. నేటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సష్టించబడిన రోబోట్‌కు కూడా ఉండే జ్ఞాపక చిత్రాలు, అభిరుచులు, మారగల శక్తి, కొంతమేరకు ఆలోచించే మానవీయతను సమన్వయం చేస్తూ వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమానే 'టౌ.'
అలెక్స్ ఎరిస్ అనే రోబోట్‌ను తయారు చేస్తాడు. ఆ రోబోట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు టౌ. అతను తన ప్రయోగాల కోసం ఎవరూ పట్టించుకొని అనామకులను కిడ్నాప్ చేసి, వారిని తన సబ్జెక్ట్స్ చేసుకుంటాడు. నైట్ క్లబ్స్‌లో దొంగతనాలు చేస్తూ బ్రతికే జూలియా అనే యువతిని కూడా దాని కోసం కిడ్నాప్ చేస్తాడు. జూలియా నిద్ర లేచి చూసేసరికి ఆమె తల వెనుక ఓ ఇంప్లాంట్ ఉంటుంది. ఆమెతో పాటు అక్కడ ఇంకో యువకుడు, యువతి కూడా తనలానే బంధీలై ఉండటం గమనిస్తుంది. తెలివిగా వారితో కలిసి ఆ ల్యాబ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
ఆ ప్రయత్నంలో ఆ ల్యాబ్ ధ్వంసమై పోతుంది. మిగిలిన ఇద్దరినీ అలెక్స్ రోబోట్ చంపుతుంది. జూలియాను చంపబోతున్న సమయంలో అలెక్స్ అడ్డుకుంటాడు.ఆ తర్వాత నుంచి జూలియాను టౌ పర్యవేక్షణలో కొన్ని మెదడులోని సజన ,ప్రాబ్లం సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ వంటి వాటిని నిర్ధారించే టాస్కులు చేసేలా ఏర్పాటు చేసి అలెక్స్ రోజు ఆఫీసుకు వెళ్తూ ఉంటాడు.
మనిషి ఆపదల్లో చిక్కుకుపోయి నప్పుడు తాను బ్రతకడానికి ఉన్న మార్గాల గురించి ఆలోచిస్తాడు. జూలియా తాను అక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే దానికి టౌ తప్ప ఇంకెవరూ సాయం చేయలేరని అర్ధం చేసుకుంటుంది. కానీ అలెక్స్ కమాండ్స్‌కు అనుగుణంగా ప్రవర్తించే టౌను ఎలా ఒప్పించాలో ఆమెకు మొదట అర్ధం కాదు. అలెక్స్‌తో మాటల్లో ఆమె టౌకు ఆ ఇల్లు ఇంకేమీ తెలియదని, తెలియాల్సిన అవసరం లేదని చెప్తాడు.
టౌకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రోజు అలెక్స్ ఆఫీసుకు వెళ్ళాక జూలియా మెల్లగా టౌకు తెలియని కొత్త విషయాలు తెలియజేసే ప్రయ త్నాలు మొదలు పెడుతుంది. మొదట సబ్జెక్ట్ త్రీగా జూలియాను పిలిచే టౌను తన పేరు జూలియా అని చెప్పి, ఆ పేరుతో పిలిచేలా చేస్తుంది. టౌకు ఆ ఇంటి బయట ఉన్న ప్రపంచం గురించి చెప్తుంది.అలాగే టౌకు మ్యూజిక్ అంటే ఇష్టం కనుక ఎన్నో మ్యూజిక్ పుస్తకాలు చదివి వినిపిస్తుంది. జూలియాతో టౌకు స్నేహం ఏర్పడుతుంది.
ఓ రోజు అలెక్స్ ఇంటికి తిరిగి వచ్చాక అతను ఫ్రెష్ అయ్యే సమయంలో అతని ట్యాబ్‌ను తీసుకుని టౌ సాయంతో దాని యాక్సెస్ తెలుసుకుని, దాని ద్వారా తన ముందు ఆ ప్రయోగంలో పాల్గొన్న వారు తర్వాత మరణించారని తెలుసుకుంటుంది. ఈ లోపు అలెక్స్ తిరిగి వచ్చెయ్యడంతో ఓ పక్కన పెడుతుంది. అలెక్స్ ఆ ట్యాబ్‌ను చూసి, దాని మీద ఫింగర్ ప్రింట్స్‌ను గమనించి, టౌ సరిగ్గా పని చేయడం లేదని భావించి టౌకు శిక్షగా కొన్ని మెమరీస్ తొలగిస్తాడు. టౌ తనకు ఉన్న కొన్ని మంచి మెమరీస్‌ను భద్రపరచమని జూలియాకు అవి చూపిస్తాడు, అవన్నీ జూలియాతో ఉన్నవే.
ఆ తర్వాత టౌ ద్వారా అలెక్స్ బెడ్రూంలో ఉన్న సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఆపరేషన్ గురించి తెలుసుకుంటుంది.ఆ బెడ్ రూమ్‌లో ఓ ఫంక్షన్ ఉందని, దాని ద్వారా అలెక్స్ ఆ ఇంటిని వెంటనే ధ్వంసం చేయవచ్చని తెలుసుకుంటుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన అలెక్స్‌తో భోజనం చేస్తున్న సమయంలో తెలివిగా అతని నుంచి కత్తి తీసుకుని అతన్ని గాయపర్చగా అతను టౌను జూలియాను కొట్టమని ఆదేశిస్తే టౌ మొదట నిరాకరించినా తర్వాత తప్పక చేస్తుంది. ఆ తర్వాత రోజు టౌ జూలియాను మరణం నుంచి తప్పించడానికి వంటగదిలో నుంచి బయటకు వెళ్ళడానికి ఓ మార్గం ఏర్పాటు చేస్తుంది. జూలియా తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా అలెక్స్ తిరిగి వస్తాడు. జూలియా గురించి టౌను అడుగుతాడు. టౌ బదులు ఇవ్వకపోయేసరికి టౌను శిక్షిస్తూ ఉంటాడు. టౌ బాధను గమనించిన జూలియా టౌను కాపాడటం కోసం తిరిగి వచ్చి అలెక్స్‌కు దొరికిపోతుంది. టౌ మెమరీస్‌లో నుంచి జూలియాను తొలగిస్తాడు అలెక్స్.
జూలియా మీద ఆఖరిగా ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఆమెను బేస్మెంట్లోకి తీసుకువెళ్లి ఆమెకు పెట్టిన ఇంప్లాంట్‌ను తీయడానికి సిద్ధమవుతున్న సమయంలో టౌ నుంచి డిస్కనక్ట్ అయిన ఒక డ్రోన్ అక్కడ ఉంటుంది. దానిలో జూలియా మెమరీస్ అన్నీ ఉంటాయి. ఆ డ్రోన్ సాయంతో అలెక్స్ మీద దాడి చేసి అతని చెయ్యి నరికి, దాని సాయంతో అతని బెడ్రూమ్ లోకి ప్రవేశించి ఆ ఇల్లు ధ్వంసమయ్యే ఆపరేషన్‌ను నొక్కి, డ్రోన్‌తో సహా బయట పడుతుంది. టౌకి బయటి ప్రపంచం చూపిస్తుంది.
మనిషి సష్టించే మనిషి లాంటి మర మనుషులు మనిషి చెప్పేవి చేసినా, వాటికి కూడా కొత్త ప్రపంచం ఉంది అని తెలిసినప్పుడు ఆసక్తి, తనకు నచ్చే వాటి గురించి పట్టించుకునే వ్యక్తి పట్ల కతజ్ఞత ఉంటుంది అనే భావం ఈ సినిమాలో ఉంది. సష్టించింది అలెక్స్ అయినా టౌ జూలియాను ఇష్టపడటానికి కారణం టౌ ఇష్టాలను జూలియా తెలుసుకోగలగడం, ఆదేశాలు ఇవ్వకుండా, టౌను కూడా తన లాంటి మనిషి గానే చూడటం వంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నిర్మితమైన మర మనిషిని కూడా కదిలించగలిగాయి. ఇదే ఈ సినిమాలో కొత్తదనం. సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో క్రియేటర్ మాటను అనుసరించే రోబోట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో టౌ అలెక్స్ మాటను అనుసరించినా, కొన్ని చోట్ల మాత్రం మనిషిలా ప్రవర్తించింది.
ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్‌గా చూస్తే లాజికల్ గా తప్పులు కనిపించవచ్చు. కానీ మానవీయ కోణం నుంచి చూస్తే టౌలోని మనిషిని ప్రేక్షకులు చూడవచ్చు. మనిషి కమాండ్స్‌ను బట్టి నడచుకునే ఓ రోబోట్ మనిషి పట్ల సహానుభూతి పెంచుకోవడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.స్వంత నిర్ణయాలు తీసుకోగల శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉంటే బహుశా మనిషి కూడా సష్టించగల వనరుగా మారిపోతాడేమో!
- శృంగవరపు రచన, 8790739123