Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలిసారిగా భైంసాలో బౌద్ధం ఆనవాళ్ళు లభించడం విశేషం. బుద్ధవిగ్రహం చెక్కిన ఎరుపురంగు ఇసిక రాతి రాతిఫలకం 19అం,10అం. ఎత్తు, వెడల్పులున్నది. బుద్ధుని శిల్పం 10అం,8అం. కొలతలు కలిగి ఉన్నది. బుద్ధుని శిల్పం ప్రతిమాలక్షణాలను బట్టి క్రీ.శ.3వ శతాబ్దానికి చెందినదిగా చెప్పవచ్చు. నాగార్జునకొండ, ఫణిగిరిలలో లభించిన బుద్ధునిశిల్పాలతో పోలివుంది. బుద్ధుడీ శిల్పంలో 'ధర్మచక్రపరివర్తన' ముద్రతో కనిపిస్తున్నాడు.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం దం సభ్యులు, నిర్మల్ కోటల మీద పరిశోధనలు చేస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కటకం మురళి సోన్ బా, త్రిశరణ్, అక్షరు, శుభం, మహేందర్లతో కలిసి భైంసా పట్టణంలోని సిద్ధార్థనగర్ బుద్ధవిహార్ వెనక చెరువులో బుద్ధుని శిల్పాన్ని గుర్తించారు. భైంసాలో రైతు సోన్ బా తనతోటలో గతంలో పెద్ద ఇటుకల దిబ్బ ఉండేదని, తెలియక తొలగించామని చెప్తున్నాడు. భైంసాలో బౌద్ధులున్నారు. బౌద్ధవిహారం కూడా ఉంది. ఆ పరిసరాల్లోనే 14అంగుళాలు, 9అంగుళాలు, 4అంగుళాలు పొడవు, వెడల్పు, మందాలున్న పెద్ద ఇటుక లభించింది. ఇది సాతవాహనకాలానికి (క్రీ.శ.1వ శతాబ్దం) చెందినది. భైంసాలో క్రీ.పూ. నుంచి బౌద్ధధర్మం ఉందని లభించిన ఆనవాళ్ళు రుజువుపరుస్తున్నాయి.
తొలిసారిగా భైంసాలో బౌద్ధం ఆనవాళ్ళు లభించడం విశేషం. బుద్ధవిగ్రహం చెక్కిన ఎరుపురంగు ఇసిక రాతి రాతిఫలకం 19అం,10అం. ఎత్తు, వెడల్పులున్నది. బుద్ధుని శిల్పం 10అం,8అం. కొలతలు కలిగి ఉన్నది. బుద్ధుని శిల్పం ప్రతిమాలక్షణాలను బట్టి క్రీ.శ.3వ శతాబ్దానికి చెందినదిగా చెప్పవచ్చు. నాగార్జునకొండ, ఫణిగిరిలలో లభించిన బుద్ధునిశిల్పాలతో పోలివుంది. బుద్ధుడీ శిల్పంలో 'ధర్మచక్రపరివర్తన' ముద్రతో కనిపిస్తున్నాడు. ధ్యానా భంగిమలో కూర్చున్న బుద్ధుని శరీరంమీద సంఘాతి (పైవస్త్రం), తలపై ఉష్ణీషం, తలవెనక కాంతిపరివేషం చెక్కబడివున్నాయని ఇది బుద్ధుని శిల్పమని కొత్త తెలంగాణ చరిత్రబందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ నిర్ధారించారు. స్థపతి, చరిత్రకారుడు, బౌద్ధశిల్ప నిపుణులు ఈమని శివనాగిరెడ్డి బుద్ధ విగ్రహం కాల నిర్ణయం చేసారు.
క్షేత్రపర్యటన, పరిశోధన
- కటకం మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్, నిర్మల్, 8143770602,
కొత్త తెలంగాణ చరిత్రబందం సభ్యులు
విషయవ్యాఖ్య : శ్రీరామోజు హరగోపాల్,
9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం