Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత కాలం నాటి ఇండ్లు...పచ్చని వాతావరణం.. పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇవి ఎక్కడో కోనసీమ అందాలు కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలోనవి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌కు ఈ గ్రామం పోటీ పడింది. దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ ఘనత దక్కించుకునేందుకు పోటీలో ఉండగా భూదాన్ పోచంపల్లి గ్రామం ఒకటిగా నిలిచింది.
పట్టుచీరలకు ప్రపంచ ఖ్యాతి గాంచిన, భూదాన ఉద్యమానికి నాంది పలికిన భూదాన్ పోచంపల్లికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించింది. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ తయారైన చేనేత చీరల ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి చేనేత పట్టు, ఇక్కత్, రాజ కోటి చీరలు నూతన డిజైన్లతో ప్రపంచ నలు దేశాల ప్రజలను ఆకర్షించాయి. పోచంపల్లిలో కొన్ని వందల కుటుంబాలు చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పోచంపల్లిని సందర్శించి ఇక్కడ తయారవుతున్న వస్త్రాలను పరిశీలిస్తారు. ఇక్కడ అనేక చిత్రాలు, షార్ట్ ఫిలింలను చిత్రీకరించారు. ఇక్కడున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
భూదాన ఉద్యమానికి నాంది పలికిన వినోబాభావే, వి.రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ఇక్కడ నెలకొల్పారు. భూదాన గంగోత్రిగా వెలసిన వినోబాభావే ఆశ్రమంలో బోధన ఉద్యమ చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పోచంపల్లి టూరిజం పార్క్‌లో చేనేత వస్త్ర తయారీ విధానాన్ని సందర్శకులు తెలుసుకునే విధంగా ఉంది. పోచంపల్లి, రేవన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువులో పర్యాటక దినోత్సవం సందర్భంగా బోటింగ్ ఏర్పాటు చేశారు. చెరువుకట్టపై మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 101 చారిత్రాత్మక కట్టడమైన 101 దర్వాజల భవనానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రతిపాదనలను పంపారు. అగ్గిపెట్టెలో పట్టే చేనేత వస్త్రాన్ని తయారు చేసిన ఇక్కడి కార్మికుల కళా నైపుణ్యం ఎంతో గొప్పది.
కేరళను తలపించే అందాలు..
పాత కాలం నాటి ఇండ్లు...పచ్చని వాతావరణం.. పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇవి ఎక్కడో కోనసీమ అందాలు కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలోనవి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌కు ఈ గ్రామం పోటీ పడింది. దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ ఘనత దక్కించుకునేందుకు పోటీలో ఉండగా భూదాన్ పోచంపల్లి గ్రామం ఒకటిగా నిలిచింది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే తొలిసారి భూదానోద్యమం ప్రారంభ మయ్యింది. అప్పటి వరకు మాములు పోచంపల్లిగా పిలవబడే ఈ గ్రామం భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి కెక్కింది. అంతే కాదు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆనాటి నిజాం నవాబుతో పాటు ఇతర అరబ్ దేశాలకు రుమాలు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన ఘనత భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఉంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేనేత కార్మికుల ప్రతిభ మూలంగా సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకుంది.
చీరలో 121 కలర్స్, 121 డిజైన్లు
చేనేత కళాకారుడు భోగ బాలయ్య అద్భుత సృష్టి
పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేత కళాకారుడు 121 రంగులు, 121 డిజైన్ల చీరెను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. ఇక్కత్ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేండ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేండ్ల కలను సాకారం చేసుకొన్నాడు. ఈ చీరె పూర్తిగా వాస్ట్ కలర్స్, వాషబుల్, ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం. 121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్ ఇక్కత్ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించారు. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్ చీరెను చూసి అభినందించారు. చేనేతలో నూతన ఆవిష్కరణలు, కళల ద్వారా చేనేత పరిశ్రమ పదికాలాల పాటు మనుగడలో ఉంటుందని భోగ బాలయ్య అన్నారు.
- గాదె రమేశ్, 9553892401