Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు 45 సంవత్సరాల కిందటి సంఘటనలు కధీకరించారు. వెంకట్రావ్-1976 ఆంధ్రసచిత్ర వార పత్రికలో ప్రచురణ అయిన ''సంపాద'' కథతో ఈ సంకలనం ప్రారంభమై.. విలువలు' అనే కథతో ముగుస్తుంది. ఇది వినూత్న కథసంకలనం 1996లో ప్రచురణమైంది. రచయిత స్వగతం 21 పేజీలు ఆసక్తిగా పాఠకుల్ని చదివిస్తుంది. ప్రముఖుల అభిప్రాయాలు చివర వున్నాయి. 22 కథలు ఈ సంపుటిలో వున్నాయి.
రామారావు భార్యకు చీరను యజమాని సుబ్బరామయ్య ఇచ్చిన లంచంలోంచి తీసి బహుమతిగా ఇంటికి తీసుకెళ్ళడం కథాంశంగా రాసిన 'సంపాదన''కథ కష్టపడేవానికి జీతం పెంచని ఓనర్ల మనస్తత్వాన్ని తెలియజేస్తోంది.
భర్త ఇష్టమైన మామిడి పళ్ళు... కొత్త షర్టు కొనే భార్య రాధపై కోపం ప్రదర్శించే శేఖర్లో భార్యను ప్రేమించే గుణం వుంటుంది. ఆమెకు చీర కొని తెస్తాడు. అదీ అతని చెల్లి కోసం కొన్నది. ఇలా మధ్య తరగతి వేతన జీవుల బాధలు, ఇబ్బందులు చూపే కథ ''ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది''. ఇది 1978లో ఆంధ్ర ప్రతిక ప్రచురణే!!
కోళ్ళఫరంలో పని చేసే నరసయ్య కటిక బీదతనం యజమాని పెదనాయుడిపై ఫిర్యాదు చేయలేని పరిస్థితి అక్రమ కరెంట్ దొంగిలించే నాయుడి చర్య వల్ల గేద చనిపోవడం- గేద కళేబరం కటిక వాని దగ్గరకు -నరసయ్య బాధతో తన కోళ్ళ ఫారం వుద్యోగానికి వెళ్ళడంతో కథ ముగుస్తుంది. గ్రామాల్లో సామాన్య పని వాళ్ళపై యజమానులు చేసే దౌష్టం కథలో కనిపిస్తుంది. గ్రామాల్లో సామాన్య పని వాళ్ళపై యజమానులు చేసే దౌష్ట్రం కథల్లో చెప్పే ప్రయత్నం బాగుంది.
రోడ్డు మీద బొమ్మలు గీసుకొని యాచక వృత్తి చేసే కిట్టుగాడికి చెల్లని పావలా ఇచ్చి అతని దగ్గర ఉన్న 20 పైసలు తీసుకొని మోసం చేస్తాడు షావుకారు. అది చెల్లని నాణం అని నూకలు ఇవ్వని కిరాణా కొట్టు వాళ్ళ కిట్టును దొంగగా తిడతారు. చివరికి ఆ పావలా ఇచ్చిన షావుకారు అది చెల్లని నాణం అంటాడు. బలంగా కొట్టి కిట్టుగాడి వుసురు తీస్తాడు... మున్సిపాలిటి బండి వచ్చి ఆగుతుంది తెల్లారి. కథ - ముగుస్తుంది. గణేష్ పాత్రో రాసిన నాటిక 'పావలా' గుర్తు కొస్తుంది. పాఠకులకు ఇలా అన్ని కథలూ మధ్య తరగతి మనుషులు.. పేదలు... చుట్టూ తిరుగుతాయి. ప్రముఖ కథ- నవలా రచయిత పి. చంద్రశేఖర్ అజాద్ ఈ కథలు సంకలనానికి ముందుమాట రాసారు. అన్ని కథలూ ఏక బిగువున చదివిస్తాయి .
- తంగిరాల చక్రవర్తి , 9393804472