Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిలలు ఏర్పడడానికి 350 నుంచి 250కోట్ల సంవత్సరాల కాలం పట్టి ఉంటుంది. అవి తూగేరాళ్ళు కావడానికి మిలియన్ల సంవత్సరాలు క్షయకరణానికి గురౌతూనే ఉంటాయి.తూగురాయి రాయి క్షయకరణం యొక్క ఉత్పత్తి. ఈ తూగేరాళ్ళను గుర్తించి, అవి ఉన్నప్రదేశాలను పర్యాటకక్షేత్రాలుగా తీర్చిదిద్దాలి. అపురూపమైన, ప్రకతి వరప్రసాదాలైన ఈ రాళ్ళని దేశ సంపదలెక్క కాపాడుకోవాలి. అరుదైన వీటిని పోగొట్టుకుంటే ఎంతో విలువైన ప్రాకతిక విశేషం మళ్ళీ దొరకదు.
హైద్రాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (నజఖ) ఆవరణలో కనిపించే అపూర్వమైన, అద్భుతమైన తూగేరాయి (బాలెన్సింగ్ రాక్)ని 'పుట్టగొడుగురాయి (మష్రూమ్రాక్)' అని పిలుస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ శిలారూపం గురించి ప్రజలకంతగా తెలియదు. ఈ ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దితే.. ప్రసిద్ధమౌతుంది.
కణ్, కణ్ బండ (బాసన్లబండ, బిందెబండ) అని పేరున్న మ్రోగేరాయి, తూగురాయి బాసరవంటి తీర్థయాత్రా క్షేత్రంలో ఉన్నది. కనుక బాగా ప్రచారం పొందింది. బాగా విస్తరించి ఉన్న గ్రానైట్ పరుపుబండ మీద నలుమూలల పట్టకం వలె నిలబడి ఉంది. పైకి పోతున్నకొద్ది స్తూపం (సిలిండరికల్) ఆకారంలో ఉంది. కణ్, కణ్ లేదా టన్, టన్ అని మ్రోగే ఈ రాయిలో లోహసంబంధ ఖనిజాలు ఉండే అవకాశముంది. ఈ మ్రోగేరాయిని భద్ర పర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొట్టడంవల్ల గుంటలు పడ్డాయి.
సిద్ధిపేట జిల్లా aహస్తాల్‌పూర్‌లో, బుడిగెపల్లిలలో పెద్ద, పెద్ద తూగురాళ్ళు ఉన్నాయి. మహబూబునగర్ సమీపంలోని గుట్టమీద స్తంభంరాయి తూగురాయే. ఖాజీపేటలో కనిపించే పెద్ద, పెద్ద అంతస్తుల రాళ్ళు తూగురాళ్ళే.
మహాబలిపురంలోని వెన్నముద్దగుండు తూగురాయే. జబల్పూర్లో ఉన్న తూగురాయి కూడా ప్రసిద్ధమే.
ప్రపంచమంతటా గ్రానైట్ భూభాగంలో ఈ తూగేరాళ్ళు ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అట్లాంటి వాటిలో ఫిన్లాండ్లోని పెద్ద తూగేరాళ్ళలో 'కుమ్మకివి' తూగురాయి ఒకటి. హైద్రాబాద్‌తో సహా తెలంగాణలోని ఎక్కువభాగం 'పెనిన్సులార్ నీస్ కాంప్లెక్స్'కు చెందిన గ్రానైట్ బేస్మెంట్ మీదనే ఉన్నాయి.
ప్రాకతికంగా ఒకదానిమీద
ఒకటి రెండుగాని, అంతకన్న ఎక్కువ రాళ్ళుగాని పేర్చి ఉన్న గ్రానైట్ రాతిగుండ్లు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నిలబడివున్నట్టు కనిపిస్తుంటాయి. కాని, అవి నిలిచేది భూమ్యాకర్షణ శక్తివల్లనే (గ్రావిటీ) అన్నది శాస్త్రం. క్షయకరణ ప్రభావం వల్ల ఇన్ని రూపాలరాళ్ళు ఏర్పడుతుంటాయి. తెలంగాణాలో అగుపించే ఇటువంటి ప్రాకతిక విశేషశిలలకు రావసినంత గుర్తింపు రాలేదు. పట్టింపు లేనందువల్ల, క్వారీలు చేసేవారికి, ఇండ్ల నిర్మాణదారులకు వాటి గురించి తెలియనందువల్ల ఎన్ని తూగురాళ్ళు ముక్కలుగా పగులగొట్టబడ్డాయో తెలియదు. రోజు, రోజుకు విస్తరిస్తున్న నగరాల కారణంగా ఇటువంటి ప్రాకతిక విశేషశిలలు ఎన్ని అదశ్యమైనాయో... ఏమో.
శిలలు ఏర్పడడానికి 350 నుంచి 250కోట్ల సంవత్సరాల కాలం పట్టి ఉంటుంది. అవి తూగేరాళ్ళు కావడానికి మిలియన్ల సంవత్సరాలు క్షయకరణానికి గురౌతూనే ఉంటాయి. తూగురాయి రాయి క్షయకరణం యొక్క ఉత్పత్తి.
ఈ తూగేరాళ్ళను గుర్తించి, అవి ఉన్న ప్రదేశాలను పర్యాటకక్షేత్రాలుగా తీర్చిదిద్దాలి. అపురూపమైన, ప్రకతి వరప్రసాదాలైన ఈ రాళ్ళని దేశ సంపదలెక్క కాపాడుకోవాలి. అరుదైన వీటిని పోగొట్టుకుంటే ఎంతో విలువైన ప్రాకతిక విశేషం మళ్ళీ దొరకదు.
హైద్రాబాద్ మష్రూమ్ రాయి గురించి చౌడం పురుషోత్తం, బాసర కణ్ కణ్ బండ గురించి బీవీ భద్రగిరీశ్, బలగం రామ్మోహన్, గౌరీభట్ల నరసింహమూర్తులు, హస్తాల్పూర్ గుండు, బుడిగెపల్లి గుండు, మహబూబునగర్ స్తంభంరాయి గురించి శ్రీరామోజు హరగోపాల్ తెలియజేసారు.
ఈ తూగేరాళ్ళ భౌగోళిక నిర్మితిని గురించి శాస్త్రీయంగా వివరించింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారులు
డా|| చకిలం వేణుగోపాల్ రావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్): 98664 49348
సమాచార సేకరణ, చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్ : 9949498698