Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేం' అధికారాన్ని చెలాయిస్తాం అనే పెద్దన్నల రాజ్యాలన్ని 'కరోన|కు గజగజ వణికాయి. ఇంకా వణుకుతున్నాయి. రెండేళ్ళుగా ఇంటికే పరిమితమైన విద్యార్థిలోకాన్ని 'విద్యాల యాలు' మళ్ళీ అక్కున చేర్చుకున్నాయి. వలసజీవులకు మళ్ళీ ఉపాధిని అందిస్తూ- భవిష్యత్‌కు భరోసానిచ్చి వెళ్ళింది. కదిలే కాలం!! మేం. ఏం చేసినా చట్టం చెల్లుతుంది అని విర్రవీగే కేంద్ర పాలకులకు రైతాంగ 'పోరాట' పటిమచూపి చట్టాల్ని మళ్ళీ వెనక్కి తీసుకునేలా చేసింది. భారతరైతాంగ ఐక్య ఉద్యమం. ఐక్యపోరాటాలు, నియంతల్ని కట్టడి చేస్తాయనే సందేశాన్ని అందించింది.
కోటి ఆశలతో 2022 వచ్చేసింది. గ్మ్రీషం వీడిన వసంతంలా తెల్లటి మంచు దుప్పటి తొలగిస్తూ అరుణారుణ కిరణాలు ప్రకృతి కాంతపై ప్రసరిస్తున్నాయి. విషాదాలు - విజయాలు-కర్తవ్య బోధలు- చేసి గత సంవత్సరం వెళ్ళిపోతోంది.
కాల ప్రయాణం కొత్త మలుపు తిరుగుతోంది. ఒమిక్రాన్ విషపు పురుగును తోడు తెచ్చుకొంటూ కొత్త క్యాలెండర్ అతిధిగా మన ఇంటి గోడలపై చేరింది. కరోనా రక్కసి, కవుల్ని- కళాకారుల్ని, రచయితల్ని రాజకీయ నేతల్ని, మేధావుల్ని, మనకు దగ్గరైన బంధు-మిత్రుల ముఖ్యుల్ని కాటు వేసింది. ఇంకా ఒమిక్రాన్ రూపంలో మాటువేసింది. మూడో నేత్రంలా ముడోవేవ్కు కాలుదువ్వుతోంది.
2021 ప్రపంచానికి ఎన్నో గుణ 'పాఠాలు' నేర్పి వెళ్ళింది. మనిషికి మానవత్వం, దానగుణం, దయ, పొరుగువారికి తోడ్పడే మనస్తత్వం బలంగా చెప్పి వెళ్ళింది. కరోనావైరస్కు విరుగుడు మందూ అందించింది.
'మేం' అధికారాన్ని చెలాయిస్తాం అనే పెద్దన్నల రాజ్యాలన్ని 'కరోనాకు గజగజ వణికాయి. ఇంకా వణుకుతున్నాయి. రెండేళ్ళుగా ఇంటికే పరిమితమైన విద్యార్థిలోకాన్ని 'విద్యాలయాలు' మళ్ళీ అక్కున చేర్చుకున్నాయి. వలసజీవులకు మళ్ళీ ఉపాధిని అందిస్తూ, భవిష్యత్‌కు భరోసానిచ్చి వెళ్ళింది. మేం. ఏం చేసినా చెల్లుతుంది అని విర్రవీగే కేంద్ర పాలకులకు రైతాంగ 'పోరాట' పటిమచూపి మెడలు వంచి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించింది. భారతరైతాంగ ఐక్య ఉద్యమం. ఐక్యపోరాటాలు, నియంతల్ని కట్టడి చేస్తాయనే సందేశాన్ని అందించింది.
సంపన్న శక్తులకు - కార్పొరేట్ యాజమాన్యానికి బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం శ్రమించి- అలసి సొలసి స్వార్థం కోటలో నిదురించే పాలకుల్ని మేల్కొలుపుతుంది. ఎన్నికల అధికారసుందరి!! ఎవరి స్వార్థం వారిది- పల్లెల్లో భూస్వాములు- పట్నంలో పెద్ద బాబులు. చేసే శ్రమ దోపిడీకి తోడు కాషాయరంగుసన్యాసుల మత దోపిడీ, గతం కంటే మిన్నగా సాగుతోంది!!
రైతుబంధు- దళితబంధు లాగే ఆకలి బంధు పథకాల కోసం అన్నార్తి ఆశగా ఎదురు చూస్తున్నాడు. కొత్త సంవత్సరాన్ని ఆబగా చూస్తూ!! పేదగుండె గుడిసెలో నిత్యనిరీక్షణ....
'అందరికి అన్నం' అడిగే వాడు రాజద్రోహి అయ్యే (దు)స్థితిని 2021- కాస్త తప్పించి... అంతా అతని వైపు తిరిగి చూసేలా చేసింది!!
'నీ ఫోను' ట్యాప్ చేసే దొంగను వెతికి పట్టించి వెళ్ళిపోయింది జీవితాన్ని కావలి కాసే కాలం!!
పెట్టుబడి దారీ సమజాం కమ్యూనిస్టు సమాజం.. ఎలా వుంటాయో ప్రపంచానికి తెలియజేసింది కరోనా కాలం!! వేదనపడే జీవుల్ని ఆదుకునేవాళ్ళెవరో ఎరుక చేసింది.
అది క్యూబా కావచ్చు, లావోస్ కావచ్చు, కొరియా కావచ్చు, వియాత్నం కావచ్చు! చైనా కావచ్చు! అంతెందుకు మన దేశంలోని చిన్న రాష్ట్రమైన పెద్ద సందేశం అందించిన కేరళకావచ్చు!! ఐ.రా.స. లాంటి సంస్థ ఆ రాష్ట్ర వైద్య మంత్రిని ఆహ్వానించి అభినందించడం గొప్ప విషయం.
మీటూ లా... డబుల్ టూ
దొంగ, ద్వంద్వ రాజకీయాలు నడిపే అధినేతల్ని కంటిముందు నిలబెట్టిన కాలం విశ్వానికే పెద్ద కాపాలాదారు!! సమస్త రుగ్మతల రూపు మాపే జన ప్రయోజన సిద్ధాంతాన్ని ప్రపంచం అంతా చదివించే కాలమా!! నీకు వందనం!!
'పోరాటం' దేన్నైనా సాధించుకోగలదు. అనే గొప్ప పాఠాన్ని మరోసారి తెలియజెప్పింది 2021. 'మహిళకు మాతృగర్భంలోనే రక్షణ' అనుకొనేదశలో ఐరాస వేదికపై సంపన్నవర్గాలపై సివంగిలా సింహగర్జన చేసిన గ్రేటాథంబర్గ్ను రేపటి చరిత్రకు ఒక ఆశాకిరణంలా అందించింది.!!
మతం, మతోన్మాదాల్ని తిప్పికొట్టాలనే మాహత్తర సందేశం అందిస్తూ నిష్క్రమించింది 2021
మనిషి, మానవత, ప్రకృతి, పర్యావరణ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య, విశ్వశాంతి ఆకాంక్షను కొత్త చట్టంలా మోసుకొచ్చింది 2022.
''అంతా బాగుండాలి! అందులోనేనుండాలి'' అనే భావనకు స్వాగతగీతికైన కొత్త సంవత్సరమా! కోటి కాంతులే కాదు - కోటి ఆశల ఆకాంక్షలతో నీకు స్వాగతం' పలుకుతున్నాము. 2022కు స్వాగతం సుస్వాగతం.
క్యాలెండర్ కథ
క్రీ.పూ 4236 ఈజిప్టియన్స్ క్యాలెండర్ కనుగొ న్నార(ట)? నాగరికత ప్రారంభమైన రోజుల్లో సూర్యోదయం- సూర్యాస్తమయాల్ని బట్టి మనిషి రాత్రి-పగలు గుర్తించారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావడానికి ఏడాది కాలం పడుతుందని గుర్తించాడు. ఇలా కాలమానం బట్టి భూమి పైగల శీతోష్టస్థితిని బట్టి పంటలు పండిచడం.. కాలాన్ని- కాలమానం చేయడం ఆరంభించాడు.
క్రీ.పూ. 2000 సం||లో బాబిలోనియన్లు మార్చి 23న కొత్త సంవత్సరం వేడుకలు జరిపేవార(ట)? క్రీ.శ. 5వ శతాబ్థంలో వరాహమిహిరుడు చైత్ర మాసాన్ని సంవత్సరాదిగా గణించి - లెక్కిం చాడు. క్రీ.శ. 57వ సంవత్సరంలో విక్రమనామశకం ఆరంభమైనట్టు భారత క్యాలెండర్ చెప్పింది. ఇప్లాం మొహరాంతో నూతన సవత్సరం ఆరంభం అఆన్నరు. భౌద్దులు-ఏప్రిల్ మాసం మొదట పున్నమిరోజు నూతన సంవ త్సరం జరుపుకుంటారు. ప్రాంతాలూ, దేశాలు, మతాలు వేర్వేరు నూతన సంవత్సరాలు ఏర్పాటు చేసుకొన్నాయి.
అసలు సరైన క్యాలెండర్‌కు ఒక రూపమిచ్చిన వ్యక్తి రోమన్ పాలకుడైన జూలియస్ సీజర్-జ్యోతిష్యశాస్త్రవేత్త సౌసీజన్ సహాయంతో సీజన్ ఒక క్యాలెండర్ రూపొందించింది. ప్రపంచానికి అందించాడు. ఏడాదికి 365 రోజులు లెక్కగట్టి క్యాలెండర్ తయారు చేశాడు. దీన్నే సౌరమాన క్యాలెండర్ అన్నారు.
ఈజిప్టు - రోమన్- హిబ్రూ, మయన్, ఇథియోపియన్- జూలియస్, చైనీస్, గ్రెగిరిన్ ఇత్యాది వన్నీ సౌరమాన క్యాలెండర్లే...
ముస్లింలతో పాటు మరి కొంతమంది చంద్రుని గమనం ఆధారంగా క్యాలెండర్ అనుసరిస్తారు. క్రీ. శ. 1582లో గ్రెగ్రోరియన్ సౌరమాన అధారితంగా రూపొందించిన క్యాలెండర్ నేటికీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారు. తొలుత ఈ క్యాలెండర్ 10 నెలలే ఉండది.- ఏడాదికి 300 రోజులే వుండేది. పాంపిలుయస్ రాజు జనవరి-ఫిబ్రవరి మాసాల్ని జత చేసి ఏడాదికి 365 రోజులుగా నిర్ణయించి సరికొత్త క్యాలండర్ రూపొందించారు. తర్వాత 4 ఏండ్లకు ఒకసారి వచ్చే లీపుసంవత్సరం ఈ కాల గణన దేశానికి ఒక రకంగా వుండేదిజ ఆనాడు ఒక దేశంలోనూ పలు రకాలుగానూ వుంది. కొందరు చంద్రమానాన్ని-మరి కొందరు సౌరమానాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు.
మార్కెట్ ఎకనామీ -రాజ్యమేలుతన్న నేటి కాలంలో కొత్త క్యాలండర్లు, గ్రీటింగ్‌లు డైరీలు, పెన్ను ఇతర బహుమతుల వ్యాపారం కోట్లలో వుంటుంది. అమెరికన్ జె.సి హాక్స్లీ క్రీ.పూ. 1843లో గ్రీటింగ్ కార్డు తయారు చేస్తాడు. లండన్ మ్యూజియంలో ఆ తొలికార్డు నేటికీ వుంది.!!. ఏ మేరి క్రిస్టియన్ అండ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు యు'' అని దానిపై రాసి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది, సిక్కులు డిసెంబర్లో, జైనులు నవంబర్‌లో కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటారు. ఆర్మేనియంలో జులై-9, ఆగేయ ఆసియా దేశాల్లో- నేపాల్‌లో ఏప్రిల్ 14, రోమన్స్ మార్చి -1న, చైనా- ఫిబ్రవరి 4న , క్యూబా జనవరి 25న మొరాకో అక్టోబర్ 3, రష్యన్లో సెప్టెంబర్ 1న, ఈజిప్టియన్లు జనవరి 7న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
లౌకిక ప్రజాతంత్ర భావాల్తో మత సహనం... దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి, సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులపై నిరరతర పోరాటం, శ్రమజీవన సౌందర్యంలో ఆదర్శ భారత పౌరుడుగా కొనసాగాలనే లక్ష్యంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా సాగుదాం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472