Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థ పెరుగుదల చేస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్తో విటమిన్ డి లోపం పరస్పర సంబంధం కలిగివుందని అధ్యనాలు తెలుపుతున్నాయి. సూర్యరశ్మికి గురికావడం వలన ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ స్రావం జరుగుతుంది. చిన్నతనంలోనే సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం మధుమేహం రాకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది.
సూర్యుడు జీవులకు ప్రధాన జీవనాధారం, జీవులకు శక్తి యొక్క సహజ వనరు. సూర్యరశ్మి అంటే సూర్యుడు ఇచ్చే విద్యుదయస్కాంత వికిరణం. సూర్య కాంతిలో కనిపించే కాంతి, కనిపించని అతినీలలోహిత కిరణాలు (ultra violate rays), పరారుణ కిరణాలు (ultra violate rays) ఉంటాయి. సూర్యరశ్మి వలన భూగ్రహం వేడెక్కుతుంది, జలచక్రాన్ని నడుపుతుంది తద్వారా భూమిపై జీవితాన్ని సుసాధ్యం చేస్తుంది.
మారిన జీవన శైలి వలన ప్రపంచ జనాభాలో 50 శాతం ప్రజలు విటమిన్ డి లోపం కలిగి ఉన్నారు. మనం సూర్యరశ్మికి గురైనట్టయితే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే పోషకం విటమిన్ డి. ఇటీవల కాలంలో చాలా మంది విటమిన్ డి లోపం బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. అధ్యయనాల ప్రకారం అమెరికా ప్రజలలో 40 శాతం విటమిన్ డి లోపం, 70-90 శాతం మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. మన రాష్ట్రంలో వద్ధుల జనాభాలో (60 ఏండ్లు పైబడినవారు) 56 శాతం, మహిళలు 70 శాతం మందికి విటమిన్ డి యొక్క తీవ్రమైన లోపం, విటమిన్ డి లోపం సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఆధునిక కాలంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇంటి లోపల ఎక్కువ సమయం గడపడం వల్ల సూర్యరశ్మి శరరీరానికి తక్కువగా తాకుట వలన విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ప్రజలు రోజువారీ ఆహారంలో సిఫారసు చేయబడిన కన్నా తక్కువ ఆహారం ద్వారా విటమిన్ డి తీసుకోకపోవటం తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరుకైన పరిసరాలలో, గాలి ప్రసరణ , వెలుతురు లేని అపార్ట్మెంట్లలో నివసించే వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుట సాధారణమైపోయింది. విటమిన్ డి ఆహారం నుండి మాత్రమే కాకుండా, ఎక్కువ శాతం విటమిన్ డి సూర్యరశ్మి నుంచి మనకు వస్తుంది. ఆహార పదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉండదు కనుక సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి మనకు అవసరం.
సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు (ultra violate rays) వలన చర్మంలో ఉండే స్టెరాల్ విటమిన్ డి వలె మార్చబడతాయి. విటమిన్ డి ఖనిజ శోషణతో పాటు అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అనేక క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. శరీరానికి కావలసిన కాల్షియం శోషించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. కాల్షియం చాలా ముఖ్యమైన పోషకం ఎందుకు అనగా బలమైన ఎముకలకు కాల్షియం అవసరం. ఆహారంలో విటమిన్ డి లోపించుట వలన ఎముకల బలహీనతకు కారణమవుతుంది. మన గుండె, కండరాల సంకోచం, నరాలు సరిగ్గా పనిచేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి కాల్షియం అవసరం.
స్త్రీలలో 30 -35 సంవత్సరాల వయస్సు నుంచి పురుషులలో 55 సంవత్సరాల వయస్సు నుంచి మొదలైన ఎముక ద్రవ్యరాశి కోల్పోకుండా ఉండాలంటే కాల్షియం అవసరం. రుతువిరతి తర్వాత మహిళల్లో ఎముకల వ్యాధి సంభవించింది. చిన్న పిల్లలో విటమిన్ డి లోపం వల్ల పిల్లల పెరుగుదల లోపిస్తుంది. ఎక్కువ కాలం పాలు తాగే శిశువులు విటమిన్ డి లోపానికి గురవుతారు తద్వారా వారు రికెట్స్ వ్యాధి భారిన పడతారు.
విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థ పెరుగుదల చేస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్తో విటమిన్ డి లోపం పరస్పర సంబంధం కలిగివుందని అధ్యనాలు తెలుపుతున్నాయి. సూర్యరశ్మికి గురికావడం వలన ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ స్రావం జరుగుతుంది. చిన్నతనంలోనే సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం మధుమేహం రాకుండా నిరోధించడంలో తోడ్ప డుతుంది.
సూర్యరశ్మి ఉన్నపటికీ విటమిన్ డి లోపం ఏర్పడుటకు మరొక కారణం కాలుష్యం. వాహనాల నుంచి, బొగ్గు కాల్చడం వలన సల్పర్ డై ఆక్సైడ్ వాయు వాతావరణంలో చేరడం వల్ల uv rays పరావర్తనం / విచ్ఛిన్నం చెంది భూమిపై చేరుకొక పోవడంతో అతినీలలోహిత కిరణాలు మన శరీరంలో పైన పడుటలేదు తద్వారా విటమిన్ డి మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల లోపం ఏర్పడుతుంది. మరోవైపు అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ఉత్తేజపరచబడి, క్యాన్సర్‌కు దారితీస్తుంది. DNAతో సహా కణాలకు నష్టం కలిగిస్తుంది. ఓజోన్ పోర ప్రమాదకర UV కిరణాల నుంచి రక్షణ కలిగిస్తుంది. వాహనాల నుంచి వెలువడే నైట్రస్ ఆక్సైడ్, పరిశ్రమలు ఉపయోగించే రసా యనాలు, ఎయిర్ కండీషనర్లో ఉపయో గించే రసాయనాలు, ఇతర కాలుష్య కారకాలు ఓజోన్ పొరకు నష్టం కలిగిస్తాయి.
విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు ఆకు కూరలు, కాబేజీ, ముల్లంగి, బీన్స్ వంటి కూరగాయలు. నారింజ, బాదం, జీడిపప్పు, మష్రూమ్స్, పాలు, కోడిగుడ్లు, చిస్, మాంసం, కాలేయం, చేప వంటి మాంసాహరం తినటం వలన సూర్య కాంతికి గురికావటం వలన విటమిన్ డి లోపం నివారించవచ్చు.
ఆధునిక ఇంటి నిర్మాణం కారణంగా ఇంటిలోకి సూర్యకాంతి రావటంలేదు దీనివలన విటమిన్ లోపంతో పాటు ఇంటిలోకి సూర్యరశ్మి రాకపోవుట వలన బ్యాక్టీరియ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ప్రజలు అనారోగ్యానికి గురికావడం వలన శ్రామిక సామర్ధ్యం తగ్గి దేశములో ఉత్పత్తి ఉత్పాదకత జీడీపీ క్షీణించి దేశ ఆర్ధిక వ్యవస్థఫై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు గహనిర్మాణం చేసేటప్పుడు ఇంటిలోకి సూర్యరశ్మి, గాలి వచ్చే విధంగా నిర్మించాలి తద్వారా ఆరోగ్యం పరిరక్షించడి ఆరోగ్య సమాజం ఏర్పాటు కుమార్గం సులభమవుతుంది ఎయిర్ కండీషనర్లు ఉపయోగం తగ్గుతుంది. ప్రకతి పరంగాలభించే సౌకర్యాలను శాస్త్రీయంగా ఉపయోగించుకునే వైఖరిని ప్రజలలో కలిగించి విటమిన్ డి లోపాన్ని నివారించాలి.
ప్రజలు ఆరోగ్యం కాపాడుకొనుటకు నిత్యవ్యాయామం నడక లేదా సైకిల్ ప్రయాణం జీవనశైలిలో భాగం కావాలి. పచ్చదనం పరిశుభ్రత సామాజిక బాద్యతకావాలి పరిశుభ్రత కు పెద్ద పీట వెయ్యాలి. వాతావరణాన్ని తక్కువ కాలుష్యం చేయు వాహనాలను ఉపయోగించాలి. కార్ల వినియోగాన్ని తగ్గించాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. మీ సమీపంలో ఉన్న తాజా ఆహార ఉత్పత్తులను ఉపయోగించాలి. ఈ విధంగా వాయి కాలుష్యం అరికట్టవచ్చు. వాహనాల కాలుష్యం అరికట్టుటకు ప్రభుత్వం తగు చెర్యలు చేపట్టాలి.
స్వచ్ఛంద సంస్థలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు అంగన్ వాడి ఆరోగ్య కార్యకర్తలు సూర్యరశ్మి ఉపయోగాలు విటమిన్ డి కొరత నివారణ పట్ల అవగాహన చైతన్య సదస్సులు నిర్వహించి ఆరోగ్యమే మహాభాగ్యము అన్న నినాదాన్నకార్యచరణగ అమలు చేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఉపక్రమించాలి.
- ప్రవీణ్ కుమార్ జాలిగామ , వ్యవస్థాపక అధ్యక్షుడు
సొసైటీ ఫర్ ది రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, 9704841734.
- నేదునూరి కనకయ్య, రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ పోరం, 9440245771