Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన బాల సాహిత్యాన్ని ప్రచురిం చాలని సంకల్పించి బాల సాహిత్యాన్ని రాయించింది. అందులో భాగంగా వీరి బాల గేయ సంపుటి వానకారు 1959లో మాడపాటి హనుమంతరావు పంతులు నేతృత్వంలోని బాల సాహిత్య రచనాలయం పక్షాన ప్రచురించబడి, నేటికీ అరవై మూడు సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలిసినా గుర్తింపుకు నోచుకోలేదు. ఈ పుస్తకాన్ని మళ్ళీ 2017లో పిల్లలలోకం పక్షాన డా||వి.ఆర్. శర్మ అచ్చువేయగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ద్వితీయ భాష తెలుగు పుస్తకంలో వీరి గేయం చోటు చేసుకోవడం విశేషం.
పిల్లల కోసం రాసిన ఒక గేయ సంపుటి ఇటీవల 2017లో షష్టిపూర్తి చేసుకుంది. అయితే చరిత్రలో నమోదు కాకపోవడం వల్ల ఈ విషయం ఈ తరానికి అంతగా తెలియదు. ఆ సంపుటి పేరు 'వానకారు', కర్త సాహిత్య విద్యా ప్రవీణ తిగుళ్ల వేంకటేశ్వర శర్మ. ఈయన 9-4-1931లో నేటి కామారెడ్డి జిల్లా బిక్కునూరు శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రంలో సనాతన వైదిక కుటుంబంలో పుట్టారు. సంస్కృతాంధ్రాలతో పాటు, చిత్రలేఖనం, సంగీతం, రగస్థల కళలో నిష్ణాతులు. నేను గత వారం గంగుల శాయిరెడ్డి వ్యాసంలో పేర్కొన్న 'బాల సాహిత్య రచనాలయము, హైదరాబాద్'తో సన్ని హిత సంబంధాలు నెరిపారు.
1957లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన బాల సాహిత్యాన్ని ప్రచురిం చాలని సంకల్పించి బాల సాహిత్యాన్ని రాయించింది. అందులో భాగంగా వీరి బాల గేయ సంపుటి వానకారు 1959లో మాడపాటి హనుమంతరావు పంతులు నేతృత్వంలోని బాల సాహిత్య రచనాలయం పక్షాన ప్రచురించబడి, నేటికీ అరవై మూడు సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలిసినా గుర్తింపుకు నోచుకోలేదు. ఈ పుస్తకాన్ని మళ్ళీ 2017లో పిల్లలలోకం పక్షాన డా||వి.ఆర్. శర్మ అచ్చువేయగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ద్వితీయ భాష తెలుగు పుస్తకంలో వీరి గేయం చోటు చేసుకోవడం విశేషం.
పిల్లల కోసం రాసినా, పెద్దల కోసం రాసినా ప్రతి రచనలో తెలంగాణ తనం వీరి గేయాల్లో అణువణువునా చూడొచ్చు. 'గుడి కిందికి దిగివచ్చిన / గోపురాలో యన్నట్లుగ / బడి ముందుగ వీధిలోన/బతుకమ్మలు గనబడినవి.... బోరగిల్లియున్న పెద్ద/ బొంగరాలో యన్నట్లుగ బ బడి ముందుగ వీధిలోన / బతుకమ్మలు గనబడినవి' అంటూ తెలంగాణ సబ్బండ సంస్కృతికి ప్రతీకయైన బతుకమ్మను బాలల కావ్యంలో పూదిచ్చి దిద్దిన కూరాడు 'వానకారు'.
ఆరున్నర దశాబ్దాల నాటి తెలంగాణ పల్లెలు, బాలలు, వాళ్ళ ఆటలు, పాటలు, పండుగలు, పబ్బాలు ఇలా ఒక్కటని కాదు అనేక అంశాలకు అడ్డంగా నిలిస్తుందీ వానకారు. ఇంకా, వానలు కురిసి, చెరువులు, కుంటలు నిండుగా నిండి పల్లె, ఊరు, వాడ సంతోషంగా జరుపుకునే అనేక పండుగలవాతావరణాలను, శ్రామిక జీవన సౌందర్యాన్ని గురించి చక్కగా వర్ణిస్తాడు రచయిత ఈ కావ్యంలో, పదిహేడు శీర్షికల్లో వచ్చిన ఈ సంపుటిలోని గేయాలకు చిత్రాలను 'రాజు' అనే చిత్రకారుడు వేశాడు. తనను గురించి తెలియడం లేదు. దీనిని నేను కావ్యంగా పేర్కొనడానికి కారణం ఇందులోని గేయాలన్నింటిలో 'వానకారు' అనే ఏక సూత్రత ఉండడం. 'అంత చిన్నది కాదు / అంత పెద్దది కాదు / అందముగ గనిపించు / అది యొక్క యూరు' అట. ఆ వూరిలోని బాలల చాలా బుద్దిమంతులు, క్రమశిక్షణ గలవారట, అందుకే వాళ్ళు, 'చక్కగా బాలకులు / సమయానికే వచ్చి చావడిలో గూర్చుండి / చదువె కొంటారు', అంతేకాదట, 'చదువు పూర్తయినాక/ సాయంత్ర మక్కడనె' ఆడుకుంటారట. ఆ ఊరిలో గోవిందు, గోపాలు అనే పిల్లలు, వాళ్ల మిత్రులు, వారి ఆటపాటలు, సరదాలు, సందళ్లు, సంతోషాలు, చదువులు, సృజనశీలత వంటివాటితో పాటు గ్రామీణ జీవనంలో మమైకమై నిలిచిన వ్యవసాయ సంస్కృతిని బాలల నేపథ్యంగా సుందరంగా చూపిస్తారు కవి తిగుళ్ల. అంతేకాదు, పాటలతో పదాలు, సంస్కృతిని, తెలంగాణ జీవద్భాషను పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ఉపాధ్యాయకవి ఇప్పటి తరానికి తెలియని ఎన్నో పదాలను పరిచయం చేశారు. వాటిలో జంగిడి, పెబ్బె, గూనధార, జగిలి, అలుగు, మంద, చావడి, గుంట,
జాలె, తూము, గున్నలు, చెంబు, చేగోళ్ళు, దేవడీ, గోటీలు, బాపనయ్య, పొద్దుగూక వంటివి కొన్ని.''
బర్రెలెన్నియొ మింట / పాలిచ్చుచుండగా / పాల ధారలు చాల / జాలువారినట్లు' వానకారు ముగిస్తుండంటాడు కవి.
పనితో పాటు చదువు, చదువుతూ పని అన్నది గ్రామీణ జీవనంలోని సాధారణాంశం. దానిని 'తల్లితండ్రులు మెచ్చుకొనగ పొలములోని పనులలోన / చిన్న చిన్న చేతులతో / చిన్నవారు తోడుపడిరి' లాంటి అందమైన అంశాలు ఇందులో అడుగడుగునా కనిపిస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ సంస్కృతితో ముడిపడిన జీవితాలకు వాన రావడమే ఒక పెద్ద పండుగ. ఆ వాలవల్ల పంటలు బాగా పండి, పాడిపంటలు దండిగావుంటే ఇక పండుగలకు కొదవుండదు. అటువంటి చేగోళ్ళ పండుగను గురించి చెబుతూ 'చేగోళ్ళ పండుగే/ వచ్చింది వచ్చింది / చిన్నవారికి సెలవు/ వచ్చింది వచ్చింది. చేగోళ్ళ కడివయాలు/ గేగోళ్ళ గడియాలు/ చిన్నవారందరీ/ చేతులకు గనబడెను' అంటూ చేగోళ్ళ పండుగ గురించి చెబుతారు. తెలంగాణలోని నిన్న మొన్నటి పిల్లమైన మనకు ఈ గేయం ఆనాటి యాదిని తెస్తుంది. కేవలం ఒక్క చేగోళ్ళ పండుగ గురించే కాదు, 'పొలాల అమవాస్య', 'నాగుల పంచమి పండుగ', 'శ్రీ కృష్ణాష్టమి పండుగ', 'వినాయక చవితి పండుగ', 'బతుకమ్మ పండుగ', 'దసరా పండుగ' వంటి తెలంగాణ ప్రజలు జరుపుకునే ప్రతి పండుగను ఈ వానకారులో గేయాలుగా మలిచిన అచ్చ తెలంగాణ బాల సాహితీమూర్తి కవి తిగుళ్ల వేంకటేశ్వరశర్మ.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548