Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుట్టమీద పడిగెరాయి కింద ఒకేచోట ఎరుపురంగులో చిత్రించిన 9 వృత్తాలలో డిజైన్లతో రాతి చిత్రాలు గీయబడివున్నాయి. ఈ వృత్తాలలో కొన్నింటిలో ఆంతరిక వృత్తాలు (×అఅవతీ జఱతీషశ్రీవర), వాటికి బయటివైపు, లోపలి వైపు కిరణాలవంటి రేఖలు, ఒకదాని నుంచి మరొక వృత్తానికి విస్తరించిన అందమైన రేఖాచిత్రాలు ఈ రాతి చిత్రంలో కనిపిస్తున్నాయి. ఇటువంటి రాతిచిత్రాలు అరుదుగా కనిపిస్తాయి.
సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం శివారు అడివిలో 'శితారి (చిత్తారు)గట్టు మైసమ్మ' గుట్టమీద కొత్త రాతి చిత్రాలతావును మా బృందసభ్యుడు సదా శివానంద (నిజామాబాద్, కోనరావుపేట మం||) గుర్తించాడు.
పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి 5కి.మీ.లు నడిచిపోతే 150మీ.ల ఎత్తున్న గుట్ట వస్తుంది. ఈ గుట్టమీద పడిగెరాయి కింద ఒకేచోట ఎరుపురంగులో చిత్రించిన 9 వృత్తాలలో డిజైన్లతో రాతి చిత్రాలు గీయబడివున్నాయి. ఈ వృత్తాలలో కొన్నింటిలో ఆంతరిక వృత్తాలు (Inner Circles), వాటికి బయటివైపు, లోపలి వైపు కిరణాలవంటి రేఖలు, ఒకదాని నుంచి మరొక వృత్తానికి విస్తరించిన అందమైన రేఖాచిత్రాలు ఈ రాతి చిత్రంలో కనిపిస్తున్నాయి. ఇటువంటి రాతిచిత్రాలు అరుదుగా కనిపిస్తాయి. 6 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పున్న ఈ రాతిచిత్రాల కాన్వాస్‌ను స్థానిక గ్రామప్రజలు ముఖ్యంగా తెనుగు (ముదిరాజ్) కుటుంబాలవారు 'మైసమ్మ'గా కొలుస్తున్నారు. మొక్కులు చెల్లించు కుంటారు.
రాచకొండలో, మట్టంరాళ్ళ తండాలో, వేల్పుగొండలో వేర్వేరు రూపాలలో కనిపించిన రాతిచిత్రాలతో పోతిరెడ్డిపల్లి రాతిచిత్రాలు పోల్చదగినవి. ఈ రాతిచిత్రాలు చిత్రణశైలి, ఇతి వృత్తాన్ని బట్టి మత, ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవని ప్రస్తుతకాలానికి 1500 సం||ల క్రితం గీసినవని చెప్పవచ్చునని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
రాతిచిత్రాల నిపుణులు కొత్తతెలంగాణ చరిత్రబృందం సలహాదారులు బండి మురళీధర్ రెడ్డిగారి వివరణ:
appears decorative figures of same pattern of religious purpose on white background (of late historic period?). 3 figures in centre have slight difference, but pattern is same, one big centre figure contains inner circle and outer circle has rays type lines around, to its right smaller one too has inner circle, and left side smaller one circle line has rays lines small.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్
- శ్రీరామోజు హరగోపాల్
రాతిచిత్రాల నిపుణులు కొత్తతెలంగాణ చరిత్రబృందంసలహాదారులు
- బండి మురళీధర్ రెడ్డిగారి