Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరివెంటి కృష్ణమూర్తి సారధ్యంలోని యువ భారతి సంస్థ జంటనగరాల్లో చేసిన సాహిత్య సేవ, కృషి గురించి రాస్తే బండెడు కాగితాలు కావాలి.'మహతి' వ్యా సంకలనం మొదలుకుని యువ భారతి వేసిన గ్రంథాలు నేటికీ ప్రామాణికాలుగా వెలుగు తున్నాయి. ఈ కోవలోనే పిల్లల కోసం ప్రచురించిన ఇరివెంటి మరో పుస్తకం 'వెలుగు బాటలు'. ఇది తమ జీవితం, ఆచరణ, ఆర్శాలు, మార్గదర్శనం, స్ఫూర్తివంటి వాటితో జాతికి దారిచూపిన కొందరు మహనీయుల గురించి పిల్లలకోసం వారి స్థాయిలో రాసిన గ్రంథం.
డా|| ఇరివెంటి కృష్ణమూర్తి పేరు వినగానే గుర్తుకు వచ్చేది 'కవి సమయాలు' పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం. కథా రచయిత, విమర్శకులుగా ప్రసిద్ధులైన ఇరివెంటి పిల్లల కోసం చక్కని బాల సాహిత్యాన్ని అందించారు. సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని, అందులోనూ బాల సాహిత్యం జాతి వికా సానికి ఉపయోగపడుతుందని నమ్మి రచనలు చేసినవారాయన. ఇరివెంటి కృష్ణమూర్తి జూలై 12, 1930న పాలమూరు జిల్లా కల్వకుర్తి తాలూకా రఘునాథపల్లిలో పుట్టారు. రాములమ్మ, రాఘవశాస్త్రి దంపతులు తల్లితండ్రులు. కృష్ణాష్టమి రోజున పుట్టారు కాబట్టి వీరికి కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.
'దశరూప దర్శనం', 'కవి సమయాలె', 'చాటువులు' వాట్భూషణం భూషణం', 'వీచికలు' వంటి రచనలు చేసిన ఇరివెంటి కథలు, వ్యాసాలు, వచన కవిత్వం రాశారు. సంస్కృతాంధ్రాలతో పాటు ఉర్దూ, హిందీ, ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ప్రౌఢ రచనలతో పాటు పిల్లల కోసం 'దేశమును ప్రేమించు మన్నా', 'లక్షణుడు', 'వెలుగు చూపే తెలుగు పద్యాలు', 'అడుగు జాడలు', 'వేగు చుక్కలు' మొదలైన పుస్తకాలు రచించారు. ఇవేకాక వీరి రచనలు ప్రాథమిక, సెకండరీ స్థాయి పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉండేవి. 'కవి సమయాలు' వంటి ప్రౌఢ రచనలు చేసిన ఇరివెంటి పిల్లల్లో సత్ప్రవర్తనతో పాటు దేశభక్తి పెంచేందుకు తోడ్పడేవిగా తన రచనలు మలిచారు.
'దేశమును ప్రేమించుమన్నా...' పుస్తకంలో గురజాడ దేశభక్తి గేయాన్ని వివరించారు. పిల్లల్లో కులమతాల
కతీతంగా ఉండాలని, కష్టాలు, కన్నీళ్లు ఎన్నివచ్చినా తొణకక, బెణకకుండా ఉండాలని చైతన్యాన్ని కలిగించే దిశగా ఈ రచన చేశారు. అన్నింటికి మించి తెలివితేటల్లో మనం ఏ దేశానికి తీసిపోము అన్న అంశాన్ని ఇందులో వివరించారాయన.
ఇరివెంటి పిల్లల సేవా భావం, కర్తవ్యదీక్ష, త్యాగనిరతిని పిల్లల్లో పెంపొందించేందుకు రాసిన పుస్తకం 'లక్ష్మణుడు'. రామాయణ, భారత, భాగ వతాలు భారతీయ జీవనవిధానంతో విడ దీయలేనివి. అందులో రామాయణంలో త్యాగానికి, సత్యానికి, ఆచరణకు, నిబద్ధతకు ఆనవాళ్ళుగా నిలిచిన పాత్రలు అనేకమున్నాయి. వాటిని పరిచయం చేయడంవల్ల పిల్లల్లో బాల్యంలోనే సత్యధీక్ష, జాగ్రదావస్థ వంటివి పెంపొం దించేందుకు దీనిని ఆయన రచించారు.
వీరి మరో పిల్లల పుస్తకం 'వెలుగు చూపే తెలుగు పద్యాలు'. నన్నయ్య నుంచి సి.నారాయణ రెడ్డి వరకు వచ్చిన అనేక పద్యాలను ఏర్చికూర్చి పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాటిని అరటిపండు ఒలిచిపెట్టినట్టు వివరించారు ఇరివెంటి. 'గంగిగోవుపాలు గరిటెడైనను చాలు', 'విద్య యొసగును వినయంబు', 'విద్య నిగూఢ గుప్తతమగు విత్తము పూరు షాలికిన్' వంటి పద్యాలను ఆయన వివరిచిన పద్ధతి అద్భుతంగా ఉంటుంది.
ఇరివెంటి కృష్ణమూర్తి సారధ్యంలోని యువ భారతి సంస్థ జంటనగరాల్లో చేసిన సాహిత్య సేవ, కృషి గురించి రాస్తే బండెడు కాగితాలు కావాలి. 'మహతి' వ్యా సంకలనం మొదలుకుని యువ భారతి వేసిన గ్రంథాలు నేటికీ ప్రామాణికాలుగా వెలుగు తున్నాయి. ఈ కోవలోనే పిల్లల కోసం ప్రచురించిన ఇరివెంటి మరో పుస్తకం 'వెలుగు బాటలు'. ఇది తమ జీవితం, ఆచరణ, ఆర్శాలు, మార్గదర్శనం, స్ఫూర్తివంటి వాటితో జాతికి దారిచూపిన కొందరు మహనీయుల గురించి పిల్లలకోసం వారి స్థాయిలో రాసిన గ్రంథం. అన్నింటికి మించి పేదరికం వంటి అనేక ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి జీవితంలో తాము అనుకున్న స్థానానికి ఎదిగిన ఎందరో మహనీయులను ఆయన పరిచయం చేస్తారిందులో. భారతజాతి గర్వించే గొప్ప ఇంజనీర్, 'బారతరత్న' సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితంలోని స్ఫూర్తిని కలిగించే అనేక అంశాలు, సంఘటనలను ఇందులో వివరిస్తారు రచయిత. అంతేకాదు, సంఘసంస్కర్త, బ్రహ్మజమాజీకులు రఘుపతి వెంకటరత్నం నాయుడు, మహామనీషి కందుకూరి వీరేశలింగం పంతులు గార్ల సమగ్ర వ్యక్తిత్వం, మూర్తిమత్వంతో పాటు భారతీయులు తప్పక చదవాల్సిన రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల గురించి ఇందులో చెబుతారు. 'అడుగు జాడలు' పుస్తకం కూడా ఇటువంటిదే. మహత్మా గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి ఇందులో హీరోలు. వాళ్ళ గురించిన అనేక కొత్త విషయాలు ఇందులో చెబుతారు ఇరివెంటి. 'వేగుచుక్కలు' జాతికి దారి చూపిన వేగుచుక్కలైన సర్దార్ వల్లభ్భారు పటేల్, కందుకూరి వీరేశలింగం పంతులు, హరికథా పితామహుడు ఆదిబట్ల నారాయణదాసు, మాలపల్లి కర్త ఉన్నవ లక్ష్మీనారాయణల వ్యక్తిత్వాలను ఇందులో చదవవచ్చు. ఇరివెంటి గురించి రాస్తూ శ్రీమతి పప్పుల శైలజ అన్నట్టు ఇరివెంటిగారి పుస్తకాలు'.. కేవలం పిల్లలేకాదు పెద్దలు కూడా చదివి ఆచరించడగ్గ మంచి విలువలు కలిగిన పుస్తకాలు' అన్న మాటలు అక్షరాల అక్షర సత్యాలు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548