Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తొలి తెలుగు రాతిరాత (శాసనం,లేఖనం) ''తొలుచువాండ్రు''న్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ రాతి రాతలోని 5 అక్షరాలు 80 నుంచి 85 సెం.మీల ఎత్తుతో, 180 సెం.మీ.ల వెడల్పున చెక్కబడ్డాయి.ఈ రాతిరాతను లిపిపరంగా 5వ శతాబ్దానికి చెందిందని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
'తొలుచువాండ్రు'ను తొలితెలుగు రాతిరాత(శాసనం)గా గుర్తించాలని కొత్తతెలంగాణ చరిత్ర బృందం డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 27, 2022న కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ నాయకత్వంలో, దీకొండ నర్సింగరావు గైడెన్సులో సభ్యులు బీవీ భద్రగిరీశ్, గుండం మోహన్ రెడ్డి, గుమ్మడిదల వేంకటరమేశ్, డా|| మండల స్వామి, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, కండాడై కృష్ణమాచార్యులు, బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మేడ్చల్ జిల్లా, కీసర గుట్టలోని 'తొలి తెలుగు రాతిరాత (శాసనం,లేఖనం) ''తొలుచువాండ్రు''న్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ రాతి రాతలోని 5అక్షరాలు 80 నుంచి 85 సెం.మీల ఎత్తుతో, 180 సెం.మీ.ల వెడల్పున చెక్కబడ్డాయి. ఈ రాతిరాతను లిపిపరంగా 5వ శతాబ్దానికి చెందిందని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ తమ 1981-82సం|| పు వార్షిక నివేదికలోని (1987ప్రచురణ) 18వ పేజీలో 5 అంశంగా శాసనం 'తొలుచువాండ్రు'గా ప్రకటించింది. కాని, ఈనాటికి ఈ లేఖనాన్ని తెలుగులో తొలి తెలుగు శాసనంగా పురావస్తుశాఖ శాసనవిభాగాలేవి ప్రకటించకపోవడం, శాసనపరిశోధకులు గణించకపోవడం శోచనీయమని సభ్యులు నిరసనను తెలియపరిచారు. ఇంత విలువైన రాతిరాత ముండ్లపొదల నడుమ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ శాసనమున్న స్థలంలో వారసత్వశాఖవారు ఈ ప్రదేశాన్ని సందర్శకులు దర్శించేవిధంగా చేసి, దారిచూపే ఒక బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.
తమ సందర్శన సందర్భంగా తొలి తెలుగురాతి రాత ముందర భద్రగిరీశ్, కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు ప్రచురించిన 'ఇంద్రేశం ఒక పురాచారిత్రక సందేశం'ను, డా||మండల స్వామి సంపాదకులుగా ప్రచురించిన కవితా సంకలనం 'పొగడ పూలదండ'ను బృందం కన్వీనర్ హరగోపాల్ ఆవిష్కరించారు. సభ్యులు ఈ ఆవిష్కరణలో భాగస్వాములైనారు.
- శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం