Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయిత :
కటుకోజ్వల మనోహరాచారి
పేజీలు: 128, వెల : 100/-
ప్రతులకు : వసుధా మనోహరాచారి
ఇంటి నెం. 5-3-190,
సాయిరాం కాలనీ,
కోరట్ల- జగిత్యాల జిల్లా- తెలంగాణ
ఫోన్: 9441023599
ఈ కథా సంపుటిలో 14 కథలు ఉన్నాయి. డా|| పత్తిపాక మోహన్, డా|| వెల్దండి శ్రీధర్, సువర్ణా వినాయక్‌లు రాసిన ముందు మాటలు ఈ కథల్లోని సారాన్ని తెలియజేస్తాయి. చాలా కథలు నీతి ప్రభోదకంగా ఉన్నాయి.
పాఠ్యపుస్తక రచయితగా, శిక్షకుడిగా, విషయ నిపుణిడిగా సేవలందిస్తున్న మనోహరాచారి బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే విధంగా సమకాలీన అంశాల పట్ల అవగాన పెంపొందించేలా ఈ కథలు రాశారు.
ఈ కథల్లో సమస్యలు చెప్పటమే గాక పరిష్కారాలు సూచించడం రచయిత ప్రతిభకు నిదర్శనం చాలా కథలు- వృద్ధుల సంక్షేమం వారి పట్ల జాలి - కరుణ కనిపించేవే... 'క్రాంతి దూతలు, దూరతీరాలు' కథలు మనిష ికేంద్రంగా సాగే సంస్కార వంతమైన కథలు
'ఆత్మీయులు', 'సక్కుబాయి- ఓ బారు ఫ్రెండ్' అనే రెండు కథలూ ప్రేమ- కామం చుట్టూ తిరుగుతాయి.
ప్రపంచీకరణ పల్లెను ధ్వంసం చేసిందనడానికి ''పల్లెతనం'' కథ నేటి జీవితాలకు అద్దం పడుతుంది. నిలకడలేని మనుషులు, కరువు- భూ ఆక్రమణ దందాలు.. కుటిల రాజకీయాలు...చెప్పారు. మానవీయ విలువలు తప్ప అన్నీ నేర్పే కార్పొరేట్ విద్య- విద్యా సంస్థల గురించి చెప్పే రెండు మంచి కథలున్నాయి. 'పసిమనుసులు', 'బడిబాట' కథల్లో పిల్లలు ఎలా యంత్రాల్లో మారుతున్నారో చెప్పారు.
సొంతిల్లు వుండాలి, సొంత యిల్లు లేకుంటే 'చనిపోయిన శవాన్ని రోడ్డుపై ఉంచే (దు)స్థితి తెలిపే కథ 'చేయూత'.. 'మందు భాగ్యుడు కథలో లాకౌడౌన్ సమయంలో రాంబాబు అనే వ్యక్తి మందు కోసం వైన్ షాపుకు వెళ్ళడం- రెండు వేలు పెట్టి బాటిల్ కొనడం, కానిస్టేబుల్ లాకప్‌లో వేస్తానని స్టేషన్‌కు తీసుకెళ్ళడం... లాఠీ దెబ్బలకు, వైన్‌షాపు అడ్రస్ చెప్పి ఇల్లు చేరడం-ఫ్రెండ్ లింగమూర్తి ఫోన్ చేసి వైన్ షాపు సీజ్ వ్యవహరం చెపుతాడు. సప్రజలకు తాగుడు అలవాటు చేయడం వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఫైన్లు కట్టంచకోవడం విడ్డూరం. ఇలా మానవీయ గాథల్ని తేలిగ్గా అర్థం అయ్యేలా చెప్పిన చక్కటి కథల సంపుటి ఇది.
- తంగిరాల చక్రవర్తి, 9393804472