Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ఆఫ్‌సైడ్ ఆవల విసిరిన బంతిని, శరీర సమన్వయంతో ఫైన్ లెగ్‌లో సిక్సర్‌గా మలువటం.. ఎవరూ ఊహించలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలక్షణ షాట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. మిస్టర్ 360 బ్యాటర్‌గా అభిమానుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. సెమీఫైనల్లో సూర్య నిరాశపరిచినా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ కితాబు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సూర్యకుమార్‌ను ఎంచుకున్నాడు బట్లర్. ' నాకు తెలిసిన ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాటర్. అతడు ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. స్టార్స్‌తో కూడిన జట్టులో అతడి ఆట అమోఘం. ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేసే ఇన్నింగ్స్‌లు ఆడాడు సూర్య' అని బట్లర్ కొనియాడాడు. టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ 189.68 స్ట్రయిక్‌రేట్‌తో నాలుగు అర్థ సెంచరీలు సహా 239 పరుగులు చేశాడు.