Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ఆలిండియా టెన్నిస్ టోర్నీ
హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్ఓటీఏ) 11వ ఆల్ ఇండియా మాస్టర్స్ టోర్నీలో మెన్స్ డబుల్స్ 50 ప్లస్ విభాగంలో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్కాంత్ జోడీ విజేతగా నిలిచింది. మెన్స్ 40 ప్లస్ విభాగంలో పోటీపడిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నాకౌట్ దశలో వాకోవర్తో నిష్క్రమించాడు. సికంద్రాబాద్ క్లబ్ వేదికగా నాలుగు రోజుల పాటు 30-70 ఏండ్ల వరకు విభాగాల వారీగా నిర్వహించిన ఆల్ ఇండియా టోర్నీ సోమవారం ముగిసింది. విజేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వి. నాగిరెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 'అన్ని వయసుల వారు ఒక్కచోటకు చేరి క్రీడాస్ఫూర్తితో పోటీపడటం సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 350 మంది ఆటగాళ్లకు వసతి, భోజన సౌకర్యం కల్పించి ఆల్ ఇండియా టోర్నీని విజయవంతంగా నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసిఏషన్ ప్రతినిధులకు అభినందనలు. భవిష్యత్లో ఇటువంటి టోర్నలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను' అని వి. నాగిరెడ్డి అన్నారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హెచ్ఓటీఏ అధ్యక్షుడు, మాదాపూర్ అదనపు డిసిపి నర్సింహారెడ్డి, సికింద్రబాద్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం డిఐజి చంద్రశేఖర్ రెడ్డి ఆల్ ఇండియా మాస్టర్స్ టోర్నీకి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.