Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు
దుబాయ్: 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విలువైన ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. టోర్నీ చరిత్రలో రెండు సార్లు అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లితో పాటు విలక్షణ బ్యాటింగ్‌తో అందరి మన్ననలు పొందిన సూర్యకుమార్ యాదవ్‌లు విలువైన ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు 12వ ఆటగాడిగా జాబితాలో చోటు లభించింది. ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు జట్టులో నిలిచారు. కెప్టెన్ జోశ్ బట్లర్, ఓపెనర్ అలెక్స్ హేల్స్, పేసర్ మార్క్‌వుడ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ శామ్ కరణ్‌లు జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చోటు సాధించగా.. రన్నరప్ పాకిస్థాన్ నుంచి షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్లు జట్టులో ఉన్నారు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నోకియాకు సైతం చోటు లభించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అత్యంత విలువైన జట్టు : అలెక్స్ హేల్స్, జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, షాదాబ్ ఖాన్, శామ్ కరణ్, ఎన్రిచ్ నోకియా, మార్క్‌వుడ్, షహీన్ షా అఫ్రిది. హార్దిక్ పాండ్య (12వ ఆటగాడు).