Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : 23వ ఆల్ ఇండియా పోలీసు లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో మాదాపూర్ అదనపు డిసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిలు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడిపై 6-2తో గెలుపొందిన నర్సింహారెడ్డి.. రెండో రౌండ్లో కుల్జీత్ సింగ్ (కాశ్మీర్)ను 6-2తో మట్టికరిపించాడు. మూడో రౌండ్లో అస్సాంకు చెందిన ఐపీఎస్ అధికారి కృష్ణపై 6-1తో ఏకపక్ష విజయం నమోదు చేసి క్వార్టర్ఫైనల్లోకి కాలుమోపాడు. మెన్స్ సింగిల్స్‌లోనే చంద్రశేఖర్ రెడ్డి ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇటీవల ఆల్ ఇండియా మాస్టర్స్ టోర్నీలో మెన్స్ డబుల్స్ విజేతగా నిలిచిన నంద్యాల నర్సింహారెడ్డి అదే జోరులో మరో టైటిల్‌పై కన్నేశారు.