Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బెంగాల్ వారియర్స్‌తో టైటాన్స్ ఢీ
నవతెలంగాణ,హైదరాబాద్ : మూడేండ్ల విరామం అనంతరం ప్రో కబడ్డి హైదరాబాద్‌కు వచ్చేసింది. ప్రో కబడ్డీ సీజన్9 గ్రూప్ దశ చివరి అంచె పోటీలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు ప్రో కబడ్డీ నిర్వాహకులు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిసెంబర్ 13 నుంచి ముంబయి వేదికగా ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. నేడు హైదరాబాద్‌లో తొలి రోజు మూడు మ్యాచులు జరుగనున్నాయి. రెండో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పుణెరి పల్టన్, హర్యానా స్టీలర్స్ తలపడనుండగా, చివరి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, బెంగళూర్ బుల్స్ ఢీకొట్టనున్నాయి.
ఏదీ కలిసిరాలేదు! : ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 14 మ్యాచుల్లో ఏకంగా 13 పరాజయాలు చవిచూసింది. లీగ్ దశలో ఇంకో 8 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ ఎనిమిది మ్యాచుల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం తెలుగు టైటాన్స్‌కు లేదు. అయినా, సొంతగడ్డపై అభిమానుల నడుమ సీజన్‌కు మెరుగ్గా ముగించేందుకు టైటాన్స్ సిద్ధమవుతోందని చీఫ్ కోచ్ వెంకటేశ్ గౌడ్ తెలిపారు. ' టైటాన్స్‌కు ఏదీ కలిసి రాలేదు. గాయాలతో కీలక ఆటగాళ్లు కొందరు దూరమయ్యారు. గణాంకాల పరంగా ఓటములు ఎక్కువున్నాయి. కానీ చివరి నిమిషంలో, చివరి క్షణంలో చేజారిన మ్యాచులే ఎక్కువగా ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా, మాకు మేము మెరుగయ్యేందుకు సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో ఆడతాం. హైదరాబాద్ వేదికగా 8 మ్యాచులు నెగ్గుతామనే విశ్వాసం మాకుంది' అని వెంకటేశ్ గౌడ్ అన్నారు.