Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోహ: ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాణసంచా కాంతులతో అల్-బైట్ స్టేడియం వెలిగిపోయింది. వివిధ దేశాల జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి. ఖతార్‌లో అల్-బైట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాచుల వేదికైంది. హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ఖతార్ ఫుట్‌బాల్‌కు సంబంధించిన కథను వీడియో ద్వారా వివరించాడు. వేడుకలో ప్రధాన గాయకుడు జంగ్‌కూక్ ప్రదర్శన ఇచ్చారు. దీంతో 900 మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. చివర్లో జెండాలు ఊపుతూ వివిధ జట్ల జెర్సీలు ధరించిన కళాకారులు నృత్యాలు చేశారు.