Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిస్ట్-ఏ క్రికెట్లో తమిళనాడు రికార్డు
- జగదీశన్ 277, సాయి సుదర్శన్ 154
బెంగళూర్ : లిస్ట్-ఏ క్రికెట్లో తమిళనాడు సంచలనం సృష్టించింది. 50 ఓవర్లలోనే 506/2 పరుగుల మెగా స్కోరు సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నెదర్లాండ్స్‌పై నెలకొల్పిన 498/4 రికార్డును తాజాగా తమిళనాడు తిరగరాసింది. విజరు హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌పై రికార్డు స్కోరు చేసింది. పసికూన అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను తమిళనాడు ఓపెనర్లు నారాయణ్ జగదీశన్ (277, 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (154, 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉతికారేశారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 416 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సాయి సుదర్శన్ భారీ శతకం నమోదు చేయగా.. జగదీశన్ ద్వి శతకంతో విశ్వరూపం చూపించాడు. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత సోదరులు అపరాజిత్ (31, 32 బంతుల్లో), ఇంద్రజిత్ (31, 26 బంతుల్లో 1 ఫోర్) నెమ్మదిగా ఆడారు. అయినప్పటికీ తమిళనాడు 50 ఓవర్లలో 2 వికెట్లకు 506 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. తమిళనాడు బౌలర్లు సిద్దార్థ్ (5/12) ఐదు వికెట్లతో మెరువగా, రఘుపతి, మహమూద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 435 పరుగుల తేడాతో తమిళనాడు రికార్డు విజయం నమోదు చేసింది.