Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 జట్లు, 4 గ్రూపులతో తొలి రౌండ్
- ఎనిమిది జట్లతో సూపర్ 8 సమరం
దుబాయ్ : పొట్టి ప్రపంచకప్‌ను మరింత ఆసక్తికరంగా నిర్వహించేందు కు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) సరికొత్త ఫార్ములాతో ముందుకొచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్‌ను సరికొత్త పద్దతిలో జరిపేందుకు ప్రణాళిక విడుదల చేసింది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ యుఏఈ, వెస్టిండీస్‌లలో జరుగనుంది. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లకు భిన్నమైన ఫార్మాట్లో 2024 వరల్డ్‌కప్ ఉండనుంది. తొలి రౌండ్, సూపర్12 ఫార్మాట్ నుంచి 20 జట్లతో కూడిన గ్రూప్ దశ సమరం, సూపర్ 8 పోరుతో భిన్నంగా ఉండనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం కొత్త ఫార్మాట్ వివరాలు వెల్లడించింది. టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్ల సంఖ్య 16 నుంచి 20కు చేరుకోనుంది. గ్రూప్ దశలో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. సూపర్ 8 దశలో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా ఆడతాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. 2024 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు 12 జట్లు అర్హత సాధించాయి. మిగతా జట్లను అర్హత టోర్నీ, కాంటినెంటల్ మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తారు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లు అర్హత సాధించాయి. ఆతిథ్య జట్లు యుఎస్ఏ, వెస్టిండీస్‌లు సైతం అర్హత సాధించాయి. అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లు సైతం అర్హత టోర్నీ అవసరం లేకుండానే నేరుగా వరల్డ్‌కప్‌కు చేరుకోనున్నాయి.